Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రతిపక్షాలపై తీవ్రవాద ముద్ర

ప్రతిపక్షంఅంటే మోదీ దృష్టిలో తీవ్రవాదులే. సమైక్య ప్రతిపక్షం లేవనెత్తుతున్న అంశాలకు సమాధానం చేప్పే శక్తిలేని మోదీ...చివరి అస్త్రంగా తిట్లు లంకించుకున్నారు. ప్రతిపక్షాలు ఇటీవల ‘ఇండియా’ పేరుతో ఐక్యసంఘటన ఏర్పాటు చేయడంతో మోదీ గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. మణిపూర్‌ మారణ కాండపై ప్రధానమంత్రి సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుండడంతో గురువారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు వరసగా నాలుగు రోజులుగా వాయిదా పడడం తోనే సరిపోతోంది. బీజేపీ పార్లమెంటరీ పక్షం సమావేశంలో మాట్లాడిన ప్రధానమంత్రి... ప్రతిపక్షాలను ఎంతగా దూషించడానికి వీలుందో అంతగానూ దూషించారు. ఇండియా అన్న పేరుపెట్టు కోవడాన్ని ఎద్దేవా చేస్తూ ఇండియన్‌ ముజాహిదీన్‌లో, ఈస్ట్‌ ఇండియా కంపెనీలో, ఇండియన్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌లో కూడా ఇండియా ఉందని తన అక్కసంతా వెళ్లబోశారు. అయితే ఆయనే ప్రారంభించిన స్కిల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, స్టాండ్‌ అప్‌ ఇండియా లాంటి పథకాలలో కూడా ఇండియా అన్న మాట ఉంది. ఆ పథకాల న్నింటినీ తీవ్రవాదంతో జమకట్టగలమా! 2024లో ప్రతిపక్షా లను ఎదుర్కోవడం కష్టం అన్న నిర్ణయానికి మోదీ వచ్చేసి నట్టున్నారు. అందుకే ప్రతిపక్షాలను అపరాధంచేసిన వారిగా చిత్రిస్తున్నారు. ప్రతిపక్షంపై నిరాధారమైన నేరారోపణ చేస్తున్నారు. ప్రతిపక్షాలమీద దుమ్మెత్తిపోసేక్రమంలో ఇండియానే అగౌరవపరుస్తున్నా నన్న స్పృహ మోదీలో కనిపించడంలేదు. అమెరికా పార్లమెంటులో ఇటీవల ప్రసంగించిన మోదీ భారతదేశం ప్రజాస్వామ్యా నికి మాతృక లాంటిదన్నారు. అంటే ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది అంటున్న నోటితోనే ప్రతిపక్షాలను తీవ్రవాదులని మోదీ ఎలా అనగలుగు తున్నారు? మణిపూర్‌ గురించి ప్రపంచమంతా చర్చ జరుగుతున్న తరుణంలో మన పార్లమెంటులో మాత్రం ఆ అంశంపై చర్చకు మోదీ సర్కారు అంగీకరించడంలేదు. ప్రజా సమస్యలను పార్లమెంటులో చర్చకు రాకుండా అడ్డుకోవడమే మన ప్రజాస్వామ్య ఘనత అనుకోమంటున్నారు మోదీ. ఇవి కేవలం మోదీ మాటలే అయితే బాధ పడవలసిన అగత్యం లేదు. కానీ ప్రధానమంత్రి పదవిలో ఉండి ఇంత విద్వేషం వెదజల్లడం తలవంపులు తెచ్చే పనే. మొత్తం ఇండియా సమష్టిగా మణిపూర్‌ ప్రజలకు మద్దతు ఇస్తున్నందువల్లే మోదీ వెన్నులో ఒణుకు పుట్టిందేమో! మొత్తం ఇండియా ఏకమవుతుండడం ప్రధాని భయానికి కారణం కావచ్చు. పార్లమెంటు వెలుపల 36 సెకన్లపాటు మణిపూర్‌ వ్యవహారాన్ని ప్రస్తావించి పార్లమెంటులో ఆ విషయంపై మాట్లాడడం నుంచి తప్పించుకోవడం మోదీ కపట రాజకీయంలో అంతర్భాగం. మోదీకి అన్నింట్లో రాజకీయమే కనిపిస్తుంది. మానవీయ కోణం ఆయనలో ఏ కోశానా ఉన్నట్టు లేదు. మణిపూర్‌ భారత్‌లో అంతర్భాగం. మోదీ దేశమంతటికీ ప్రధానమంత్రి. కానీ ఆయనకు ఆ స్పృహ ఉన్నట్టు లేదు. కేవలం ‘భక్తులకు’ మాత్రమే ప్రధానిని అనే ఆయన నమ్ముతున్నట్టున్నారు. కానీ అది కేవలం భ్రమే. మణిపూర్‌లో హింసాకాండ చెలరేగి 85 రోజులైనా పార్లమెంటులో ప్రకటన చేయడానికి మోదీ సిద్ధంగా లేరు. మోదీ అబద్ధాలకు జనం అలవాటు పడిపోయి ఉండొచ్చు. కానీ బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత మోహన్‌ భగవత్‌ కూడా నోరు మెదపక పోవడం ఆశ్చర్యంగా ఉంది. లేదా అదీ దుష్ట నీతిలో అంతర్భాగం అయి ఉండాలి. ప్రధాని సభకు హాజరై ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో నాలుగు రోజులుగా కోరుతున్నా ఫలితం కనిపించకపోవడంతో ప్రతిపక్షాలు ఆఖరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనుకుంటున్నాయి.

ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి పెరిగినందువల్ల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రతిపక్షాలు కోరుతున్నట్టుగా మణిపూర్‌ అంశంపై పార్లమెంటులో చర్చకు సిద్ధమేనంటున్నారు. కానీ ఈ మాటలోనూ ఓ మతలబు ఉంది. ప్రధాని సమాధానం చెప్పాలని పట్టుబట్టకూడదట. ఇన్ని రోజులుగా ఉభయసభల్లో ప్రతిపక్షాలు ప్రధాని ప్రకటన చేయాలని పట్టుబడుతూ ఉంటే అమిత్‌ షా నోరు మెదపకపోవడంలో ఆంతర్యం ఏమిటి? ఈ రకంగా ప్రధానిని వెనకేసుకురావడం అమిత్‌ షా వ్యూహం. అధికార పక్షాన్ని వెనకేసుకు రావడంలో అత్యుత్సాహం ప్రదర్శించే రాజ్యసభ అధ్యక్షులు జగదీప్‌ ధన్కర్‌ జామియా ఇస్లామియాలో రెండు రోజుల కింద మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేవాలయంలాంటి పార్లమెంటు సమావేశాలకు ఆటంకం కలగజేయకూడదని, సమా వేశాలకు విఘాతం కలిగించడాన్ని ప్రతిపక్షాలు ఆయుధంగా వినియోగించకూడదనీ, రాజకీయ వ్యూహంగా పరిగణించకూడదనీ, పార్లమెంటు ఉన్నది చర్చించడానికి, సంప్రదించుకోవడానికి అని సుద్దులు చెప్పారు. మరి రాజ్యసభలో చర్చకు ఆయన ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు. పార్లమెంటులో చర్చకు అవకాశం ఇవ్వాలని ఆయన అధికార పక్షానికి ఎందుకు చెప్పలేకపోతున్నారు. సభకు హాజరై దేశ వాసులకు వాస్తవ పరిస్థితి ఏమిటో తెలియజెప్పడం ప్రధానమంత్రి నైతిక బాధ్యత. దీన్ని మోదీ ఖాతరు చేయడం లేదు. ప్రధానమంత్రికి ప్రజాస్వామ్య విలువలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా, ఔచిత్యం పాటించే తత్వం ఉన్నా, రాజ్యాంగ నియమాలపై గురి ఉన్నా మణిపూర్‌ పరిస్థితిపై పార్లమెంటు వేదిక నుంచే మాట్లాడే వారు. ఈ విషయంలో సందిగ్ధతకు తావులేదు. మణిపూర్‌ మంటలు కేవలం ప్రతిపక్షానికే సంబంధించినవి కావు. సోమవారం ఇంఫాల్‌లో మణిపూర్‌కు చెందిన కేంద్రమంత్రి ఆర్‌.కె.రంజన్‌ సింగ్‌ ఇంటిమీద దాడి చేశారు. రంజన్‌ సింగ్‌ విదేశాంగ శాఖ సహాయం మంత్రి. రెండు నెలల కాలంలో ఆయన ఇంటిమీద దాడి జరగడం ఇది రెండవసారి. మణిపూర్‌లో శాంతి భద్రతలు సంపూర్ణంగా అడుగంటాయి. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ప్రవర్తనపైనే దర్యాప్తు జరగవలసి ఉంది. ఆయన ఒక వర్గానికి మద్దతు ఇస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మణిపూర్‌లో హింసాకాండ ప్రజ్వరిల్లడానికి కారణం ప్రభుత్వం విధి నిర్వహణను నిర్లక్ష్యం చేయడమే, హింసాకాండకు లోపాయికారీగా మద్దతు ఇవ్వడమేనని అనేకమంది పూర్వ సైనికాధికారులు బాహాటంగానే చెప్తున్నారు. దీన్ని కేవలం ఆరోపణగా కొట్టి పారేయడానికి వీలులేదు. మణిపూర్‌ను దహించి వేస్తున్న మంటలు క్రమంగా పొరుగు రాష్ట్రాలను కూడా చుట్టుముడ్తున్నాయి. ఇదంతా ఆర్‌.ఎస్‌.ఎస్‌., బీజేపీ కుట్రలో భాగమే. కాస్త ఆర్థికస్తోమత ఉన్నవారు కూడా మణిపూర్‌ వదిలి అసోం వెళ్లిపోతున్నారు. ఇలాంటి వారికి భద్రత కల్పించడానికి మిజోరం సిద్ధంగా ఉంది. అయినా తరలిపోయేవారు అసోం వెళ్లడానికే ఇష్టపడుతున్నారు. ఇలా పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న వారు కుకీలు మాత్రమే కాదు. అందులో మెయితీలు కూడా ఉన్నారు. బీజేపీ ఏలుబడిలో మణిపూర్‌ పూర్తిగా మతతత్వ ప్రాంతంగా మారిపోయింది. అధిక సంఖ్యాకులైన మెయితీలు హిందువులు. కుకీలు తదితర తెగలవారు ప్రధానంగా క్రైస్తవులు. వారిలో కొందరు ముస్లింలు. మైనారిటీలైన ఈ రెండు వర్గాల వారిని తుడిచి పెట్టాలన్న కుట్ర జరుగుతోంది. దానికి మోదీ ప్రాతినిధ్యం వహించే పార్టీ దన్ను ఉంది. అందుకే మణిపూర్‌ అగ్ని గుండం అయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img