Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అన్న మోదీ కల గత పదేళ్ల కాలంలో నెరవేరలేదు. కానీ ఆయన సంకల్ప బలం గొప్పది. ఇంకా ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్షం లేని ప్రజాతంత్ర వ్యవస్థను సృష్టించడం కోసం ఆయన వేయని ఎత్తులు లేవు. ఇందులో భాగంగానే నాలుగైదు వారాల కింద కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేశారు. ఆర్థికంగా ప్రతిపక్షం పీక నొక్కి 400 సీట్ల లక్ష్యం సాధించాలన్నది మోదీ పన్నాగం. కాంగ్రెస్‌ 14 లక్షల రూపాయల లెక్కలు చూపలేదని ఆదాయపు పన్నుశాఖ ఆరోపించింది. ఈ మాట నిజమే అనుకున్నా లెక్కలు చూపకుండా దాచేస్తే జరిమానా విధించే అధికారం ఆదాయపు పన్ను శాఖకు ఉంది. ఇలాంటి సందర్భాలలో సాధారణంగా పదివేల రూపాయల జరిమానా విధిస్తూ ఉంటారు. ఈ మాట ఆదాయం పన్ను చట్టమే చెప్తోంది. కానీ విచిత్రంగా ఆదాయపు పన్నుశాఖ కాంగ్రెస్‌ కు 200 కోట్ల రూపాయల జరిమానా విధించి చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అన్న మోదీ లక్ష్య సాధనకోసం ఆదాయపు పన్ను శాఖ సకల నియమాలను, బాహాటంగా ఉల్లంఘించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేతిలో పరిచారికగా మారింది. మొత్తంమీద కాంగ్రెస్‌ కు సంబంధించిన 11 బ్యాంకు ఖాతాలను స్తంభింప చేశారు. ఎన్నికలు జరగనున్న సమయంలో ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బ్యాంకు ఖాతాలు జప్తు చేయడం అంటే ఆ పార్టీని ఆర్థికంగా నిస్తేజం చేయడమే. అంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ తమ నాయకుల పర్యటన కోసం కనీసం రైలు టికెట్లు కొనే స్థితిలో కూడా లేకుండా చేయాలని మోదీ ప్రభుత్వం ఆలోచన. ఆదాయపు పన్నుశాఖతో పాటు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టొరేట్‌, సీబీఐ లాంటి స్వతంత్ర వ్యవస్థలన్నింటినీ విపరీతంగా దుర్వినియోగం చేస్తున్న మోదీ సర్కారు ఇప్పుడు కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను జప్తు చేసి ఆర్థికంగా నిరస్త్రం చేయాలని నిర్ణయిం చుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలకు తెలియకుండా ఆదాయపు పన్ను శాఖ ఇంత అఘాయిత్యానికి పాల్పడడానికి సాహసించదు. లెక్కలు చూపడంలో కాంగ్రెస్‌ నెల రోజులు అలస్యం చేసిందట. ఇంకా విచిత్రం ఏమిటంటే ఆదాయపు పన్ను శాఖ అధికారులు కాంగ్రెస్‌ ఖాతాలున్న బ్యాంకులకు వెళ్లి అక్కడి సిబ్బందిని బెదిరించి, భయపెట్టి కాంగ్రెస్‌ ఖాతాల నుంచి రూ.115 కోట్లు ఆదాయపు పన్ను శాఖకు బదిలీ చేయించుకుంది. ఈ క్రమం అంతా చూస్తూ ఉంటే మోదీ ప్రభుత్వ ఎత్తుగడ ఏమిటో ఎవరి భాష్యమూ అక్కర్లేకుండానే బట్టబయలు అవుతోంది. 2017-18 నాటి లెక్కలు చూపనందుకు కూడా కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను జప్తు చేశారట. ఇదీ విచిత్రమే. ఇంతకు ముందు ఆరేళ్ల తరవాత పాత కేసులు తవ్వి తీసేవారు కాదు. 2022లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టినప్పుడు ఆరేళ్ల గడువును మూడేళ్లకు తగ్గించారు. మరి కాంగ్రెస్‌ కు ఈ వెసులుబాటు లేకుండా చేయడంలో ఏ దురుద్దేశం లేదని నమ్మలేం. రాజకీయ పార్టీలు ఆదాయం పన్ను చెల్లించనవసరం లేదు కాని లెక్కలు మాత్రం ఆదాయపు పన్ను శాఖకు అందజేయాలి. ఈ విషయంలో కాంగ్రెస్‌ పొరపాటు చేసిందనే అను కున్నా బ్యాంకు ఖాతాలు జప్తు చేయించడానికి ఎన్నుకున్న సమయం ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో స్పష్టంగానే తేలిపోతోంది. కాంగ్రెస్‌ చూపాల్సిన లెక్కల్లో 0.7 శాతం లెక్కలు చూపనందుకే ఇంత తీవ్రమైన చర్య తీసుకోవడం వెనక కాంగ్రెస్‌ ను ఎన్నికల సమయంలో ఆర్థికంగా అశక్తం చేయాలన్న కుట్ర దాగి ఉందనుకోవడానికన్నా మించిన కారణం ఏమీ కనిపించదు.
తమ బ్యాంకు ఖాతాలు జప్తు చేయడాన్ని, దాని వెనక ఉన్న లక్ష్యం గుట్టు విప్పడానికి గురువారం నాడు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే విలేకరుల సమావేశం నిర్వహించి ప్రజాస్వామ్యం గొంతు నొక్కడానికే తమ బ్యాంకు ఖాతాలు జప్తు చేశారని ఆక్రోశించారు. ఇలాంటి చర్యల ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుంది. ప్రభుత్వం కాంగ్రెస్‌ విషయంలోనే ఈ దుర్నీతికి పాల్పడిర దని సరిపెట్టుకోవడానికి వీలు లేదు. ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉన్న వారందరూ తీవ్రంగా పట్టించుకోవలసిన అంశం ఇది. బీజేపీ 37 శాతం ఓట్లతో అధికారం సంపాదిస్తే కాంగ్రెస్‌ దాదాపు 20 శాతం ఓట్లు సంపాదించి అతి పెద్ద ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. బీజేపీకి వేల కోట్ల నిధులు సమకూర్చుకోవడం కోసమే ఎన్నికల బాండ్ల విధానం ప్రవేశ పెట్టారు. అనుకున్నట్టే బాండ్ల ద్వారా వసూలైన నిధుల్లో 56 శాతం బీజేపీ ఖాతాలో చేరితే కాంగ్రెస్‌ కు అందింది 11 శాతం నిధులే. పైగా ఎన్నికల బాండ్లలో అసలు మోసం విరాళాలు ఎవరు ఇచ్చారో, ఎవరికి ఇచ్చారో తెలియకుండా చట్టంలోనే వెసులుబాటు కల్పించడం. ఈ తతంగం అంతా సుప్రీంకోర్టు ఆదేశాలవల్ల వెల్లడి కావడం మంచి పరిణామమే. గురువారం కాంగ్రెస్‌ అగ్రనాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన తరవాత బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా, మాజీ కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. కాంగ్రెస్‌ ను వచ్చే ఎన్నికలలో ప్రజలు ఓడిస్తారు కనకే విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్‌ అగ్ర నాయకులు కన్నీళ్లు కారుస్తున్నారనీ, ప్రజాస్వామ్యం మంటగలిసి పోతుందని ఆరోపిస్తున్నారని నడ్డా అన్నారు. కాంగ్రెస్‌ మేధో పరంగా, నైతికంగా దివాలా తీసిందని కూడా నడ్డా అన్నారు. దాతలు ఎవరో తెలియకుండా విరాళా లివ్వడానికి ఎన్నికల బాండ్ల చట్టం తీసుకొచ్చిన పార్టీ నైతికత గురించి మాట్లాడడం హాస్యాస్పదమే కాదు, ఈ దేశ ప్రజలను మోసగించడం. ఇక మేధోపరమైన దివాళాకోరు తనం గురించి నడ్డా నుంచి నేర్చుకోవలసి రావడం ఈ దేశ ప్రజలు దిక్కుమాలిన స్థితికి చేరుకున్నారనడానికి నిదర్శనం. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ లక్ష్యం నెరవేరలేదు కనక ఆర్థికంగా ప్రతిపక్షాలను దెబ్బతీసి ప్రజాస్వామ్య సౌధాన్ని కూల్చడానికి మోదీ సర్కారు బుల్డోజర్‌ రాజకీయాన్ని అనుసరించింది. టర్కీలో కుర్దులకు అనుకూలమైన పార్టీ నిధులను, రష్యాలో ప్రతిపక్ష నాయకుడు నవలానీ బ్యాంకు ఖాతాలను ఇలాగే జప్తు చేశారు. ఖాతాల జప్తును టర్కీ కోర్టు రద్దు చేసింది. పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు షాబాజ్‌ ఖాతాలు ఇలాగే జప్తు చేయించారు. మన ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య ఛాయలు ఇసుమంతైనాలేని దేశాల స్థాయికి దిగజారుస్తున్నారు. చట్ట విరుద్ధంగా ప్రతిపక్షాల రెక్కలు కత్తిరించడానికి చట్టాన్నే దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను మరో తోపు తోయడమే. ఇది ఒక్క కాంగ్రెస్‌ కు ఎదురైన పరిస్థితి కాదు. మోదీ ఏలుబడిలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతోంది. జన జాగృతే దీనికి నిష్కృతి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img