Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కులతత్వం

గతంలో దళితులకు చదువుకునే హక్కే మృగ్యమైనప్పుడు స్వాతంత్య్రం తరవాత దళితులకు కూడా ఉన్నత విద్య అభ్యసించే అవకాశం వచ్చింది. కానీ వారిని గౌరవించడం, వారి ఉన్నతిని అంగీకరించడం ప్రస్తుత సమాజానికి సుతరామూ ఇష్టం లేదు. అందుకే తెలంగాణలో దళిత వర్గానికి చెంది, బాగా చదువుకుని మహాత్మా గాంధీ అంతర్రాష్ట్రీయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ స్థాయికి ఎదిగిన దళితుడిని ఈ సమాజం జీర్ణించుకోలేక పోయింది. ఆ దళిత విద్యావేత్త కారుణ్యకార హరిజనోద్ధరణ కోసం ఉద్యమించిన మహాత్మా గాంధీ పేర నెలకొల్పిన విశ్వవిద్యాలయం భరించ లేక పోయింది. కారుణ్యకార వైస్‌ చాన్సలర్‌ గా బాధ్యతలు తీసుకోక ముందు రాజేశ్‌ కుమార్‌ శుక్లా వైస్‌ చాన్సలర్‌ గా ఉండే వారు. ఒక మహిళతో ఆయన సంభాషణ వివాదాస్పదం కావడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. మహాత్మా గాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలంలో ప్రొ వైస్‌ చాన్సలర్‌ ను నియమించే సంప్రాదాయం లేదు. అందుకని ఉన్న వారిలో సీనియర్‌ అయిన కారుణ్య వైస్‌ చాన్సలర్‌ బాధ్యతలు చేపట్టారు. విద్యా రంగంలో కారుణ్యకార సాధించిన విజయాలు అమోఘమైనవి. కానీ ఆయన ముక్కు సూటితనం విశ్వవిద్యాలయ కులీనులకు నచ్చలేదు. కారుణ్యకార గత సంవత్సరం ఆగస్టులోనే వైస్‌ చాన్సలర్‌ బాధ్యతలు తీసుకున్నారు. కానీ కులీన వర్గం ఆయనను మూడు నెలలైనా భరించలేక పోయింది. ఆయనను ఆ పదవిలోంచి తొలగించారు. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ ఏలిన వారికి నచ్చలేదు. రాష్ట్రపతి ముర్ము ఈ విశ్వవిద్యాలయానికి ‘‘విజిటర్‌’’. ఆమె ఆదేశాల మేరకు కేంద్ర విద్యా శాఖ ఆయనను తొలగించింది. రాష్ట్రపతి కేంద్ర మంత్రివర్గ సిఫార్సు లేకుండా ఎవరినీ తొలగించే అవకాశమే లేదు. కారుణ్య ఇది విశ్వవిద్యాలయ చట్టానికి వ్యతిరేకమని మొర పెట్టుకున్నా వినే వారే కనిపించలేదు. విశ్వ విద్యాలయ నిబంధనల ప్రకారం ‘‘విజిటర్‌’’ స్థానంలో ఉన్న రాష్ట్రపతికి ఎవరినీ నియమించే అధికారం గానీ, తొలగించే అధికారం గానీ లేదు. కారుణ్య స్థానంలో డా. భీమరయ్‌ మెత్రియన్‌ తాత్కాలిక వైస్‌ చాన్సలర్‌ గా నియమించారు. ఆ తరవాత కృష్ణ కుమ్మర్‌ ను వైస్‌ చాన్సలర్‌ గా నియమించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కారుణ్యకార గత మార్చి 31న మళ్లీ వైస్‌ చాన్సలర్‌ బాధ్యతలు స్వీకరించారు. తనకు జరిగిన అన్యాయానికి, విశ్వవిద్యాలయం అనుసరిస్తున్న అక్రమ పద్ధతులకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తుండగానే ఆయనకు గత నెలలో షో కాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. ఆయన గదికి తాళం పెట్టారు. అసలు ఆయనను విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టడానికే అవకాశం లేకుండా చేశారు. కారుణ్యకు సహానుభూతి తెలిపే విద్యార్థులు, అధ్యాపకులు తన అధికారాలను వినియోగించుకోవాలనుకునే దళిత విద్యావేత్తను విశ్వవిద్యాలయం యాజమాన్యానికి నచ్చడం లేదంటున్నారు. ఇది ఉన్నత స్థానానికి ఎదిగిన ఓ దళిత విద్యావేత్తను పనిగట్టుకుని వేధించడమే. విశ్వవిద్యాలయాలలోకి హిందుత్వ శక్తులు చొరబడిన తరవాతే ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురవుతోందని వారు అంటున్నారు. విశ్వ విద్యాలయాలోకి చొరబడ్డ హిందుత్వ శక్తులు యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. విశ్వవిద్యాలయాల నిర్వాహకులకు విద్యార్థులు సమీకృతం కావడం, విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేయడం బొత్తిగా ఇష్టం లేదు. కారుణ్యకారను వైస్‌ చాన్సలర్‌ పదవి నుంచి తొలగించినందుకు నిరసన తెలియజేసిన విద్యార్థుల్లో కొంత మందిని విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించారు. తనను విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించినందుకు ఒక విద్యార్థి బొంబాయి హైకోర్టు నాగపూర్‌ బెంచిని ఆశ్రయించవలసి వచ్చింది.
విశ్వవిద్యాలయాలలో కులీన వర్గాల పెత్తనం ఒక ఎత్తయితే సామాజిక శాస్త్రాలు బోధించే ఉన్నత విద్యా రంగంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కుక్కగొడుగుల్లా పుట్టుకు రావడం మరో ఎత్తు. మహాత్మా గాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయం ప్రైవేటు విశ్వవిద్యాలయమే. అంతకు ముందు ఈ అంశాలు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే విశ్వవిద్యాలయాల్లో మాత్రమె బోధించే వారు. పదిహేనేళ్ల కింది దాకా కూడా సామాజిక శాస్త్రాల అధ్యయనానికి ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో చేరాలన్న ఆలోచనే ఉండేది కాదు. ఈ ఉన్నత విద్యా సంస్థలలో ఫీజులు దండిగా వసూలు చేస్తారు. వాటి స్థాయినిబట్టి ఒక్కో విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేషన్‌ కోర్సు పూర్తి చేయడానికే 15 నుంచి 50 లక్షల దాకా వసూలు చేస్తుంది. ఒకప్పుడు ఊహించడానికి వీలులేని పరిస్థితి ఇప్పుడు సర్వత్రా కనిపిస్తోంది. అతి కొద్ది కాలంలో ఉన్నత విద్యారంగ స్వరూప స్వభావాలు అమాంతం మారిపోయాయి. డబ్బు సంచులు కుమ్మరించి ఇలాంటి ఉన్నత విద్యాలయాల్లో చదువుకునే వారి అంతిమ లక్ష్యం విదేశాలకెళ్లి మరింత ఉన్నత విద్య అభ్యసించడమే. ఆ తరవాత వారు స్వదేశానికి తిరిగి రావడమే అరుదు. వచ్చినా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే విశ్వవిద్యాలయాల వేపే చూడరు. మళ్లీ డబ్బు భారీగా సంపాదించే విద్యాసంస్థలలో చేరాలనే ప్రయత్నిస్తారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల మీద ఉండే, అవి నాణ్యంగా ఉంటాయన్న భ్రమ మౌలికంగా విద్యార్థుల జీవన శైలినే మార్చేస్తున్నాయి. ఈ విశ్వవిద్యాలయాల్లో విదేశాలలో డాక్టరేట్‌ పట్టా పుచ్చుకుని వచ్చిన వారికే పెద్ద పీట. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నాణ్యత తగ్గుతోందన్న అభిప్రాయం కూడా ప్రైవేటు విశ్వవిద్యాలయాల మీద మోజు పెరగడానికి కారణం. ఈ మోజే వాటిలో విద్యాభ్యాసం చాలా ఖరీదైన వ్యవహారం అయిపోతోంది. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో చదువు ఎలా ఉన్నా అవి విశాలమైన స్థలంలో ఏర్పాటు చేస్తారు. నాణ్యతతో నిమిత్తం లేకుండా పచ్చని లాన్లు, అందమైన భవనాలు మాత్రం ఉంటాయి. ఆ సంస్థల్లో ఉండే ఖాళీ స్థలాల్లో నలుగురికి ఉపయోగపడే ఫల వృక్షాలు కనిపించవు. సౌందర్యాత్మకత ఉట్టిపడే లాన్లు మాత్రం విస్తృతంగా ఏర్పాటు చేస్తారు. ఈ సొబగులు ఉండకూడదని కాదు. కానీ మౌలికమైన విద్య విష్యంలో శ్రద్ధ లేక పోవడం, అవి కుల వివక్షతతో సహా అనేక రకాల వివక్షకు ఆలవాలంగా మారడం ప్రమాదకరం. సొబగుల మీద శ్రద్ధవల్ల విద్యార్జన బహు భారమై పోతోంది. సొగసైన అద్దాలతో అందంగా నిర్మిస్తున్న విశ్వవిద్యాలయాల భవనాలు జ్ఞానార్జనకు నిలయాలుగా లేకపోవడం దుష్పరిణామాలకు దారితీసే విలోమ ప్రక్రియే. కారుణ్యకార లాంటి వారు ప్రతి ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ తారస పడుతూనే ఉంటారు. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో రోహిత్‌ వేముల ఆత్మ హత్యకు పాల్పడవలసి రావడం, జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, జాదవ్‌ పూర్‌ విశ్వవిద్యాలయంలో సామాజిక చింతన ఉన్న విద్యార్థులు జైళ్లకెళ్లడంతో పాటు నానా యాతన పడవలసి రావడం వికృత పరిస్థితులకు ప్రస్ఫుటమైన సంకేతం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img