Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బీజేపీకి శృంగభంగం

ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలలో ఆశించిన సంఖ్యలో సీట్లురాక డీలాపడిన బీజేపీకి ఈ నెల పదవ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో మరింత శృంగభంగం కలిగింది. లోక్‌సభ ఎన్నికలతో ప్రారంభమైన ఈ ట్రెండ్‌ మరింత ముందుకు సాగుతోంది. దేశంలో మారుతున్న రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. శనివారం వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా ఐక్య సంఘటన జోరు ప్రదర్శించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా ఐక్య సంఘటనకు తొలి పరీక్షగా భావించిన అసెంబ్లీల ఉప ఎన్నికల్లో ‘ఇండియా కూటమి’ జయకేతనం ఎగురవేసింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా ఐక్య సంఘటన 10 చోట్ల విజయం సాధించింది. బీజేపీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే ఇండియా ఐక్య సంఘటన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగారు. ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికలలో హిమాచల్‌ప్రదేశ్‌లో ఫిరాయింపులను ప్రోత్సహిం చడం ద్వారా అనైతిక విజయం సాధించిన బీజేపీకి ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికలలో ప్రజలు తగిన పాఠం చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్‌, బీహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోని ఒక్కొక్క స్థానానికి జులై 10న ఉప ఎన్నిక పోలింగ్‌ జరిగింది. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో ఇండియా ఐక్య సంఘటన అధికారంలో ఉండగా, మూడుచోట్ల ఎన్డీయే ప్రభుత్వం ఉంది. ఓట్ల లెక్కింపు శనివారం చేపట్టి ఫలితాలు ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో అత్యధిక స్థానాలు గెలుపొంది జోరుమీదున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ తాజా ఉప ఎన్నికల్లోనూ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగిన రాయ్‌గంజ్‌, రాణాఘాట్‌, బాగ్దా, మాణిక్‌తలా నాలుగు స్థానాల్లోనూ తృణమూల్‌ అభ్యర్థులు విజయం సాధించారు. రాయ్‌గంజ్‌, బాగ్దా, రణఘాట్‌ దక్షిణ్‌ స్థానాలను బీజేపీి నుంచి కైవసం చేసుకోగా మానిక్తలాలో రికార్డు విజయాన్ని సాధించింది. ఉత్తరాఖండ్‌లో కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని ఐదు స్థానాలను గెలుచుకున్న బీజేపీ రెండు నెలలు తిరగకుండానే జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలలో ఓటమిని మూటగట్టుకుంది. ఉప ఎన్నిక జరిగిన మంగలౌర్‌, బద్రీనాథ్‌ స్థానాలలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. మంగలౌర్‌ను బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌ కైవసం చేసుకున్నది. ఇక్కడ విజయం సాధించేందుకు బీజేపీ అనేక దుష్టఎత్తుగడలు వేసింది. కాషాయ పార్టీ దుష్టపన్నాగాలకు ప్రజలు ఓటు ఆయుధంతో తిప్పికొట్టారు. బద్రీనాథ్‌లో కాంగ్రెస్‌కు చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీలోకి మారారు. ఈ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించడం ద్వారా ఆయనకి తగిన సమాధానం చెప్పారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా బీజేపీకి మద్దతు ప్రకటించి ఆ తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసి బీజేపీ తీర్ధం పుచ్చుకున్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికల్లో ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారు. ఆ ఇద్దరూ కాంగ్రెస్‌ అభ్యర్థుల చేతిలో పరాజయాన్ని చవిచూశారు. దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు సతీమణి, కాంగ్రెస్‌ అభ్యర్థి కమలేశ్‌ ఠాకుర్‌ విజయం సాధించారు. ఆమె సమీప బీజేపీ అభ్యర్థిపై 9వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలాగఢ్‌ స్థానంలో కాంగ్రెస్‌ నాయకుడు హర్‌దీప్‌ సింగ్‌ బవా 8,990 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. హమీర్‌పుర్‌ స్థానంలో మాత్రమే బీజేపీ గెలుపొందింది. పంజాబ్‌లోని జలంధర్‌ స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్‌ భగత్‌ బీజేపీ అభ్యర్థి షీతల్‌పై 37వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జలంధర్‌ వెస్ట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) భారీ విజయం సాధించడం రాష్ట్ర ప్రభుత్వ పని పట్ల ప్రజలు ‘‘చాలా సంతోషంగా ఉన్నారని’’ తెలియజేస్తోందని ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ అన్నారు. తమిళనాడులోని విక్రావండి స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్‌ శివ విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని అమర్‌వాడాలో బీజేపీ అభ్యర్థి కమలేశ్‌ షా గెలుపొందారు. బీహార్‌లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంక్‌ సింగ్‌ జయకేతనం ఎగురవేశారు. ఉప ఎన్నికలలో ఇండియా ఐక్య సంఘటన ఘన విజయంపై కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు పవన్‌ ఖేడా స్పందిస్తూ ‘‘2014లో మేము ఎదుర్కొన్నాం …ఇప్పుడు బీజేపీ వంతు. లోక్‌సభ ఎన్నికలతో ప్రారంభమైన ఈ ధోరణి మరింత ముందుకు సాగుతోంది. రాబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీ ఓటమిని చవిచూస్తుంది. 2014 ఎన్నికల్లో మాకు ఇదే విధమైన అనుభవం ఎదురైంది. చాలా ఎన్నికల్లో ఓడిపోయాం…ఇప్పుడు బీజేపీ అదే దశలో ఉంది’’ అని అన్న వ్యాఖ్యలు అక్షరసత్యాల్లా కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్‌ పార్టీ అనాలోచిత విధానాల కారణంగా సార్వత్రిక ఎన్నికలలో ఇండియా ఐక్య సంఘటన తగిన ఫలితాలు రాబట్టలేకపోయింది. ఈ ఉప ఎన్నికలలో వచ్చిన ఫలితాలతోనైనా కాంగ్రెస్‌ పార్టీ మేల్కొని ప్రతిపక్షాల మధ్య మరింత ఐక్యతకు కృషి చేయాలి. అవసరమైతే ఆ పార్టీ కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడాలి. కేంద్రంలో ప్రస్తుతం ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం అన్న మాట మరిచి తన సొంత పార్టీ ప్రభుత్వంగా వ్యవహరిస్తూ మోదీ చేసే ప్రయత్నాలను తిప్పికొట్టే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి ఉంది. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాలి. దళితులు, రైతులు, సమాజంలోని అణగారిన వర్గాలలో చైతన్యానికి కృషి చేయాలి. ప్రతిపక్షం ఐక్యంగా చర్చించి సమష్టి వ్యూహంతో వ్యవహరించకపోతే మోదీ మరింత దుష్పరి పాలన సాగించే అవకాశముందన్న విషయాన్ని ప్రతిపక్షం గమనంలో ఉంచుకోవాలి. రానున్న ఐదు రాష్ట్రాలహర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, దిల్లీ, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో కాషాయ దళాన్ని మట్టి కరిపించి ఇండియా ఐక్య సంఘటన మరిన్ని ఘన విజయాలు సాధించే దిశగా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కమలం పార్టీకి మరోసారి అవకాశం దక్కకుండా ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేకించి వ్యూహరచనతో ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగాలి. ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ బాధ్యత తీసుకోవాలి. ఆయా రాష్ట్రాలలో కేవలం ప్రధాన పార్టీలకే కాకుండా లౌకిక, ప్రజాస్వామ్య శక్తులన్నింటికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. సీట్ల సర్దుబాటులో తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకే అధినేత స్టాలిన్‌ను ఆదర్శంగా తీసుకుని కొంత మేర త్యాగం చేస్తూ ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్యతో నిమిత్తంలేకుండా అన్ని పార్టీలకు సీట్లను కేటాయించాలి. అప్పుడే ఇండియా ఐక్య సంఘటన ఓట్లు చీలకుండా ఉంటాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఈ విధానం పాటించని కారణంగా కొన్ని సీట్లను కోల్పోయిన విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ గమనంలో ఉంచుకుని వ్యవహరించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img