Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మాయమవుతున్న భావ సంఘర్షణ

ప్రజాస్వామ్యంలో భావసంఘర్షణకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. పార్లమెంటు ఈ భావ సంఘర్షణకు వేదికగా ఉండాలి. ప్రజాస్వామ్యం అంటేనే భిన్న భావ సంఘర్షణల మధ్య సమన్వయం కుదర్చడం. విరుద్ధ భావాల సంఘర్షణ ఫలితంగా సంపూర్ణ ఏకాభిప్రాయం లేకపోయినా ఏదో ఒక మేర సమస్యను పరిష్కరించ డానికి అవకాశం ఉండే వ్యవస్థే ప్రజాస్వామ్యం. కానీ అధికార పక్షాలకు తిరుగులేని మెజారిటీ ఉన్న సందర్భాలలో, ముఖ్యంగా మోదీ హయాంలో మాకు మెజారిటీ ఉంది కనక ఎవరి మాట ఎందుకు లెక్క చేయాలన్న ఏకపక్ష, అహంకారపూరిత ధోరణి కొనసాగుతోంది. ప్రతిపక్షాల మాట అంగీకరించకపోయినా కనీసం వినిపించుకునేపాటి ఔదార్యం కూడా ప్రస్తుత ప్రభుత్వంలో ఇసుమంత కూడా కనిపించడం లేదు. భిన్న భావాలు ఒకే సమయంలో కొనసాగడానికి అవకాశం సన్నగిల్లినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ మరో రూపం దాల్చే ప్రమాదం పొంచి ఉంటుంది. భారత ప్రజాస్వామ్యం కూడా దీనికి అతీతంకాదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సుదీర్ఘ జాతీయ పోరాటం ఫలితంగా అమలులోకి వచ్చింది. భిన్న భావాలు సంఘర్షణలోంచే నూతన భావాలు ఉద్భవించాలి. ఈ పరిస్థితి కనిపించకపోవడమే ఇప్పుడు మనం ఎదుర్కుంటున్న అసలు సమస్య. పార్లమెంటు సమావేశాలకు విఘాతం కలగడం మనకేం కొత్త కాదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పక్షం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో ఒక్క రోజు కూడా సభ నిర్వహించడానికి అవకాశం లేని ఉదంతాలు ఉన్నాయి. పార్లమెంటే రియన్లుగా విశేషమైన అనుభవం ఉన్న బీజేపీ నాయకులు ఒక సందర్భంలో సభ జరగనివ్వం అని సమావేశాలు ప్రారంభం కాక ముందే ప్రకటించిన ఉదంతాలూ ఉన్నాయి. మన పార్లమెంటరీ వ్యవస్థలో అంతకన్నా ఘోరమైన పరిణామాలే జరుగుతున్నాయి. అధికార పక్ష సభ్యులే సభా నిర్వహణకు అంతరాయం కలిగిస్తుండడం ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కనిపిస్తున్న కొత్త ధోరణి. ఇది వినాశ కరమైంది. అధికార పక్ష సభ్యులే సభ ప్రారంభం కాగానే ‘‘మోదీ, మోదీ’’ అని నినదిస్తుంటే ప్రతిపక్షాల వైఖరిని తప్పుబట్టి ఫలితం లేదు. మోదీ, మోదీ అనడంలోనే వ్యక్తి ఆరాధన తార స్థాయికి చేరిందని రుజువు అవుతోంది. ఈ వ్యక్తి ఆరాధనా తత్వమే అగ్ర నాయకులు నిరంకుశంగా తయారుకావడానికి దారి తీస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అధ్యక్ష తరహా పాలనగా మార్చేయడానికి మోదీ కంకణం కట్టుకున్నారు. కానీ పార్లమెంటు సమావేశాలు సవ్యంగా జరగడమే అపురూపమై పోయింది. పార్లమెంటు సమావేశాలు అంటే రభస, వాయిదా వేయడం అన్న చందంగా తయారైంది. రాజ్యసభ అధ్యక్షుడు జగదీప్‌ ధన్‌కర్‌, లోకసభ్‌ స్పీకర్‌ ఓంబిర్లా ఎన్నిసార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించినా సభను సవ్యంగా నిర్వహించడానికి మార్గం కనిపించడం లేదు. మణిపూర్‌ మారణకాండపై ప్రధానమంత్రి మోదీ ప్రకటన చేయాలని ఎన్నిసార్లు అభ్యర్థించినా ప్రయోజనం లేదు. మోదీ మౌనవ్రతం వీడే సూచనలేలేవు. అందుకని ప్రతిపక్షాలు తమ ఎత్తుగడ మార్చి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. వచ్చే ఎనిమిదవతేదీ నుంచి ఈ తీర్మానంపై చర్చ జరగవలసి ఉంది. పదో తేదీన ప్రధానమంత్రి సమాధానం ఇస్తారు. అయినా ఈ విషయంలో ప్రధానమంత్రి మోదీ మంకుపట్టే చెల్లినట్టు లెక్క.

ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనివ్వకుండా మైకులు ఆపేయడం, అదీ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి మైక్‌ ఆపేయడం మన పార్లమెంటు స్థాయి దిగజారడానికి నిదర్శనం. ఇది సిగ్గుచేటు. సభ్యులు మాట్లాడిన మాటల్లో అభ్యంతరకరమైనవి, సభా మర్యాదకు భంగం కలిగించేవి ఉన్నప్పుడు వాటిని రికార్డులనుంచి తొలగించడం పరిపాటి. కానీ ఇటీవలికాలంలో సభ్యుల ప్రసంగాల్లోని విస్తారమైన భాగాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నారు. అంటే నిర్దిష్టమైన సమయంలో పార్లమెంటులో ఏం జరిగిందో తెలుసుకునే హక్కు భవిష్యత్‌ తరాల వారికి లేకుండా చేయడమే. మణిపూర్‌లో రెండురోజుల పాటు పర్యటించివచ్చిన ప్రతిపక్ష నాయకుల బృందం బుధవారం రాష్ట్రపతి ముర్మును కలుసుకుని తమ పర్యటనలో కనుగొన్న విశేషాలను వివరించడంతో పాటు ప్రధానమంత్రి సభలో మాట్లాడేట్టు చూడమని కూడా అభ్యర్థించారు. అభ్యర్థన మేరకు అభ్యంతరం ఉండక్కర్లేదు. ఎందుకంటే ప్రధాని నోరు తెరిచేట్టు చేయడానికి మార్గాంతరం లేక ప్రతిపక్షనేతలు ఈ పనిచేసి ఉంటారు. కానీ రాష్ట్రపతి ఈ విషయంలో ప్రధానిని ఆదేశించే వీలు లేదు. సభాధిపతుల వ్యవహార సరళి కూడా గౌరవప్రదంగా లేకపోవడం బాధాకరం. ఉదాహరణకు దాదాపు అరవైమంది రాజ్యసభ సభ్యులు 267వ నిబంధన కింద చర్చ చేపట్టాలని నోటీసు ఇచ్చారు. దీన్ని రాజ్యసభ అధ్యక్షుడు జగదీప్‌ ధన్‌కర్‌ ససేమిరా అంగీకరించడంలేదు. పైగా ఆ నోటీసులు సవ్యంగా లేవం టున్నారు. ఈ నిబంధన ప్రకారం అయితే ముందు ప్రధాని ప్రకటన చేయ వలసి వస్తుంది. తరవాత చర్చ జరుగుతుంది. కానీ జగదీప్‌ ధన్‌కర్‌ చాలా చాకచక్యంగా 176వ నిబంధన కింద చర్చకు కొందరు ఇచ్చిన నోటీసును ఆమోదించారు. నిజానికి 267వ నిబంధన కింద నోటీసు ఇచ్చినప్పుడు 176వ నిబంధన కింద నోటీసులను పట్టించుకోనక్కర్లేదు. అంటే రెండు మూడు గంటల స్వల్ప వ్యవధి చర్చకు మాత్రమే పరిమితం చేయాలన్నది ధన్‌కర్‌ ఆలోచన. అంటే సభాధ్యక్షులు అధికారపక్షం మదిలో ఉన్న ఆలోచనను అమలుచేస్తున్నారన్న మాట. ఏ సభాపతి అయినా అధికార పక్షం మద్దతు ద్వారానే ఆ స్థానంలోకి వస్తారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి రాజ్యసభ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి కూడా అధికారపక్షం దన్ను ఉండవలసిందే. లోకసభలో అధికారపక్ష సభ్యులు కాని వారు స్పీకర్లుగా వ్యవహరించిన ఉదాహరణలు ఉన్నాయి. సభాధిపతి స్థానంలోకి వచ్చిన తరవాత ఎవరైనా అధికార, విపక్ష సభ్యులను పక్షపాత దృష్టిలేకుండా చూడాలి. కానీ ధన్‌కర్‌ విషయంలో అలా కనిపించడం లేదు. ప్రధానమంత్రి ముందు ప్రకటన చేయాలన్న ప్రతిపక్షాల డిమాండు రాజ్యాంగ విహితమైంది కాదని ధన్‌కర్‌ గుర్తు చేస్తున్నారు. ఆ మాట నిజమే కావచ్చు.
సభ నిర్వహించడానికి ప్రత్యేక నిబంధనలున్నాయి. అవసరమైనప్పుడు ఆ నిబంధనలకు మినహాయింపు ఇచ్చి సభ నిర్వహించిన సందర్భాలూ ఉన్నాయి. మణిపూర్‌ మారణకాండ నిజానికి అలాంటి మినహాయింపులకు పూర్తిగా అర్హమైందే. ప్రధాని ఎటూ ఆ విషయాన్ని ఖాతరు చేయడంలేదు. రాజ్యసభ అధ్యక్షులు కూడా అధికార పక్షానికే వంత పాడే రీతిలో ఉన్నారు. పైగా ప్రతిపక్షాలు తమకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవడం లేదని నిరాధారంగా దెప్పి పొడుస్తున్నారు. బుధవారం ఉదయం లోకసభ స్పీకర్‌ ఓం బిర్లా కూడా సభకు హాజరుకాలేదు. విసిగిపోయి అలిగి ఆయన సభకు రాలేదన్న ఊహాగానాలు సాగుతున్నాయి. సభ నిర్వహించడానికి, ప్రతిపక్షాల వాణి కూడా వినబడేట్టు చేయడం సభాధ్యక్షుడి బాధ్యత. అలక దానికి పరిష్కారం కాదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img