Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మోగిన ఎన్నికల నగారా

లోక్‌సభకు, నాలుగు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ ఖరారు చేయడంతో దేశ వ్యాపితంగా ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు వివిధ రాష్ట్రాలలోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. జూన్‌ 16వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు 43 రోజుల వ్యవధిలో ఏడు దశల్లో నిర్వహిస్తారు. జమ్ముకశ్మీర్‌లో ఈసారి కూడా కేవలం లోక్‌సభ ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ముకశ్మీర్‌లో ఆరేళ్లుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. అక్కడ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించబోమని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 30లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. మొదటి దశలో 21 రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు, రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు, మూడో దశలో 12 రాష్ట్రాల్లోని 94 లోక్‌సభ స్థానాలకు, నాలుగో దశలో 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు, ఐదో దశలో 8 రాష్ట్రాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు, ఆరో దశలో 7 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు, ఏడో దశలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇలా ఏడు దశల్లో మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. ఈసారి వేసవితాపంతోపాటు హోరాహోరి ఎన్నికల పోరు తీసుకువచ్చే రాజకీయ వేడిని జనం చవిచూడక తప్పదు. ఎన్నికల్లో వివిధ పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రజల వాస్తవ ప్రయోజనాలను విస్మరించి వాటిని సమాధి చేసేందుకు ప్రయత్నిస్తాయన్న విషయంలో ఎట్టి అనుమానం ఉండనవసరం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే జమ్మూ-కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు, సీఏఏ, అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ తదితర అంశాలను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తన పార్టీ లబ్ధి కోసం అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు మోదీ ప్రయత్నాలను తిప్పికొట్టే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి ఉంది. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాలి. దళితులు, రైతులు, సమాజంలోని అణగారిన వర్గాలలో పెల్లుబికిన ఆగ్రహాన్ని ఓట్లుగా మలచుకోవాలి. ప్రతిపక్షం ఐక్యంగా చర్చించి సమష్టి వ్యూహంతో వ్యవహరించకపోతే మోదీ దుష్పరిపాలనకు చరమగీతం పాడటం కష్టమన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌లో ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్‌ పార్టీ ఇంకా సీట్ల సర్దుబాటు ప్రక్రీయను పూర్తిచేయలేదు. ఇప్పటికైనా ఆ క్రమాన్ని త్వరగా పూర్తిచేసి ఎన్నికల కదనరంగంలోకి దూకాల్సిన అవసరం ఎంతో ఉంది. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గడచిన తొమ్మిదేళ్ల పదిమాసాల్లో పెరిగిన నిరుద్యోగం, చుక్కలనంటిన నిత్యావసరాల ధరల తగ్గింపు, నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో విఫలం, అమలుకాని ఎన్నికల హామీలు, దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం, సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొన్న అష్టకష్టాలను ప్రధానాంశాలుగా ప్రతిపక్షాలు విస్తృతంగా ప్రచారం చేయాలి. కేంద్రంలో తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోడానికి సంఘపరివార్‌, బీజేపీ శక్తులు విశ్వప్రయత్నాలు చేస్తాయన్న విషయాన్ని ప్రతిపక్షాలు విస్మరించరాదు. మరోసారి మోదీకి అవకాశం దక్కకుండా ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేకించి కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి వ్యూహరచనతో ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగాలి. మోదీ ప్రభుత్వానికి జాతీయ ప్రత్యామ్నాయాన్ని దేశ ప్రజల ముందు ఉంచేందుకు కృషి చేయాలి. దేశవ్యాపితంగా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న 1.82 కోట్ల మంది యువత విశ్వాసాన్ని చూరగొనేలా ప్రతిపక్ష పార్టీలు కార్యక్రమాన్ని రూపొందించవలసిన అవసరముంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా చర్యలు చేపట్టేందుకు ఉపక్రమించాలి. విద్వేషాలు రెచ్చగొట్టి, వ్యాపింపచేసే విచ్ఛిన్నకర ప్రభుత్వం కింద మగ్గడం కొనసాగాలా? లేక సామరస్య పరిస్థితుల్లో జీవించాలా? అన్నది దేశ ప్రజల ముందు ప్రస్తుతమున్న ప్రశ్న. న్యాయమైన, పారదర్శక పాలన ప్రజలకు అవసరం ఉంది. మోదీ ప్రభుత్వ పాలనలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకి తగిన గుణపాఠం చెప్పడానికి ఓటర్లు సంసిద్ధులు కావాలి.
స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించడమనేది కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ విధి. ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడం వల్ల కొంత మేలు ఉన్నప్పటికీ లోపాలు కూడా లేకపోలేదు. సున్నిత నియోజకవర్గాల్లో, ఎన్నికల సంబంధ హింసాకాండ చోటుచేసుకొనే అవకాశమున్న పోలింగ్‌ కేంద్రాల్లో తగిన సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించడానికి ఏడు దశల్లో ఎన్నికల నిర్వహణ దోహదపడుతుంది. 85 ఏళ్ల్ల వయసు పైబడిన వారందరూ ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 85 ఏళ్ల వయసు పైబడిన ఓటర్లు దేశవ్యాప్తంగా 82 లక్షల మంది ఉన్నట్లు రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఇందులో 40 శాతం మంది ఓటర్లు దివ్యాంగులు. ఓటర్లకు పోలింగ్‌ కేంద్రాల వద్ద వలంటీర్లు సహాయం చేస్తారని, వీల్‌ చైర్లు, రవాణా సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇక వందేళ్లు దాటిన ఓటర్లు 2 లక్షల 18 వేల మంది ఉన్నారు. మాజీ ఎన్నికల కమిషనర్‌ టీఎన్‌ శేషన్‌ చెప్పినట్లుగా దశ మహాపాతకాలు దేశ ఎన్నికల వ్యవస్థను కరకరా నమిలేస్తున్నాయి. నీరు విడిచిన చేపైనా బతుకుతుందేమోగానీ, అక్రమ ధనప్రవాహాలు వెల్లువెత్తనిదే ఓట్ల పండగ గడవదని పదేపదే నిరూపితమవుతోంది. రాజకీయాధికారాన్ని ఒడిసిపట్టే క్రమంలో ప్రలోభాల ఎరలు వేయడానికి, ధన భుజబల మదోన్మత్త శక్తులను వినియోగించి రకరకాల అకృత్యాలకు తెగబడటానికి పార్టీలు, అభ్యర్థుల పోటాపోటీని పరికించి భారత జనస్వామ్యం నివ్వెరపోతోంది. ధన, మద్యం ప్రవాహాలు, ప్రలోభాల ప్రభావాల పీడ విరగడకాకుండా ఎన్ని సార్వత్రికాలు నిర్వహించినా సగటు మానవుడికి జరిగేది, ఒరిగేది ఏముంది? అధికారపీఠంపై వ్యక్తులు మారడం తప్ప సామాన్య ప్రజల బతుకులు బాగుపడనప్పుడు ‘ప్రజాస్వామ్య కుంభమేళా’ల ఆర్భాటాల వల్ల కలిగే ప్రయోజనం శూన్యం.
దేశ భావిగతిని సవ్యంగా, సజావుగా నిర్దేశించాల్సిన పార్టీలు సంకుచిత రాజకీయ లబ్ధి వేటలో తలమునకలవుతున్నట్లు గ్రహించాకనైనా ఓటర్లు జాగురూకులు కావాలి. గెలుపు గుర్రాల్ని ఏరికోరి అక్కున చేర్చుకుంటున్న వారిని, నేరగాళ్లే తమ పార్టీకి జవసత్వాలని భావించే వారిని, ప్రజాస్వామ్య విలువలకు తలకొరివి పెడుతున్న అభ్యర్థులను ఓటర్లు నిష్కర్షగా తిరస్కరించినప్పుడే పాలనా వాసి మెరుగుపడుతుంది, చట్టసభలు తేటపడతాయి. ఎన్నికలు న్యాయంగా, సక్రమంగా నిర్వహించడంపై ఎన్నికల సంఘం నిఘా పెట్టాలి. స్వతంత్రంగా వ్యవహరించి రాజ్యాంగ విలువలను, దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టటం అతిముఖ్యం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img