Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మోదీ సర్కారు దాష్టీకానికిజమ్మూ-కశ్మీర్‌ బలి

జమ్మూ ప్రాంతంలోని దోడాలో మంగళవారం తీవ్రవాదుల దాడిలో ఒక మేజర్‌తో సహా నలుగురు భారత జవాన్లు మరణించడం చెదురు మదురు సంఘటన కాదు. గత 32 నెలల కాలంలో జమ్మూ-కశ్మీర్‌లో 48 మంది సైనికులు బలయ్యారు. కథువాలో భారత సైనికుల వాహనాలపై తీవ్రవాదుల దాడిలో అయిదుగురు సైనికులు నేలకొరిగారు. జూన్‌ 11-12న ఆరుగురు సైనికులు నేలకొరిగారు. జూన్‌ 9న యాత్రికుల బస్సుమీద తీవ్రవాదులదాడిలో పదిమంది మరణించారు. 33 మంది గాయపడ్డారు. మే నాలుగున పూంచ్‌లో భారత వైమానిక దళానికి చెందిన ఒకరి ప్రాణాలను తీవ్రవాదులు బలి గొన్నారు. అయిదుగురు గాయపడ్డారు. 2023 డిసెంబర్‌ 21న నలుగురు సైనికులు ప్రాణత్యాగం చేశారు. 2023 నవంబర్‌ 22న ఇద్దరు కెప్టెన్లతో సహా అయిదుగురు సైనికులు తీవ్రవాదుల తూటాలకు బలయ్యారు. 2023 ఏప్రిల్‌- మే నెలల్లో 10 మంది సైనికులు అమరులయ్యారు. 2022 మే 13న కత్రాలో యాత్రికుల బస్సు మీద జరిగిన దాడిలో నలుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో ఒకరు సైన్యంలో పని చేస్తున్న ఇద్దరు కొడుకులను పోగొట్టుకోవాల్సి వచ్చింది. 2019 ఆగస్టు అయిదున కశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దు చేసిన నాటి నుంచి లెక్కవేస్తే ఈ జాబితా చాలా పొడవుగా ఉంటుంది. 370వ అధికరణం కారణంగానే కశ్మీర్‌ లో తీవ్రవాదం ప్రబలి పోయిందని మోదీ ప్రభుత్వం వాదించింది. ఈ అధికరణాన్ని రద్దు చేసిన చాలా నెలలకు కానీ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కశ్మీర్‌ వెళ్లే సాహసం చేయలేకపోయారు. సరిగ్గా నెల రోజుల కింద అమిత్‌ షా జమ్మూ-కశ్మీర్‌ లో తీవ్రవాదుల దాడులను సమీక్షించడానికి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అప్పటి నుంచి తీవ్రవాదులు భారత సైనికదళాల మీద కసితో దాడులు చేస్తున్నారు. తీవ్రవాద దాడులు దాదాపు నిత్యకృత్యం అయిపోయాయి. జైష్‌-ఎ-మహమ్మద్‌ అనుబంధ విభాగం అని చెప్పుకునే కశ్మీర్‌ టైగర్స్‌ ఈ దాడులన్నింటికీ తామే కారణం అని చెప్పుకుంటోంది. ఈ సంస్థపేరు ఇటీవలి కాలంలోనే వినిపిస్తోంది. తీవ్రవాద సంస్థల పేర్లు మారుతున్నా సృష్టిస్తున్న విధ్వంసంలో ఏ మాత్రం తేడాగానీ, విరామంగానీ లేదు. తీవ్రవాదుల దాడులు ఇదివరకు ఎక్కువగా కశ్మీర్‌కే పరిమితం అయ్యేవి. ఇప్పుడు జమ్మూ, లడాఖ్‌ ప్రాంతంలో కూడా తీవ్రవాద ముఠాలు స్వైర విహారం నిర్భయంగా చేస్తున్నాయి. ఇది మన భద్రతా దళాల, ముఖ్యంగా గూఢచార విభాగాలకు, వాటికి ఆధిపత్యం వహిస్తున్న మోదీ సర్కారు వైఫల్యమే. 370వ అధికరణం రద్దు చేయాలన్న సంఫ్‌ు పరివార్‌ సుదీర్ఘ ఆలోచన కార్యరూపంలోకి వచ్చిన తరవాత అక్కడ అంతా ప్రశాంతంగా ఉంది అనిచేస్తున్న ప్రచారం మోదీ ప్రభుత్వం, ముఖ్యంగా అమిత్‌ షా కల్లబొల్లి మాటలకు తిరుగు లేని నిదర్శనం.
మంగళవారం తీవ్రవాదులు విరుచుకుపడ్డ దోడా సరిహద్దులో లేదు. దాదాపు జమ్మూకు పూర్తి దక్షిణాదిన ఉంది. అంతదూరం తీవ్రవాదులు దూసుకు రాగలుగుతున్నారంటే (ఘర్‌ మే ఘుస్‌ కార్‌ మారేంగే) ఇంట్లోకి దూరి దాడి చేస్తాం అన్న మోదీ మాటల్లోని డొల్లతనం బహిర్గతమైంది. ఈ ప్రాంతాలలో సైనిక పహరా తగ్గిందని భద్రతా నిపుణులు అంటున్నారు. తీవ్రవాద ముప్పును పసిగట్టడంలో మన గూఢచారశాఖ వైఫల్యం ఎంత తీవ్రంగా ఉందో మన భద్రతా దళాల కదలికలను గమనించి గురిచూసి దాడిచేయడంలో తీవ్రవాదుల చాకచక్యం అంతకన్నా అనేక రెట్లు ఎక్కువ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరిహద్దు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయంటే కొంత మేరకు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అలా కాకుండా వందల మైళ్లు మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి తీవ్రవాదులు దాడి చేయగలుగుతున్నారు. తీవ్రవాదులకు విధ్వంసం సృష్టించాలన్న లక్ష్యశుద్ది అపారంగా ఉండొచ్చు. కానీ తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాలలో నియోగించే మన భద్రతా దళాలు సుశిక్షితులైన వారు. వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఉంటుంది. తీవ్రవాదులు గుప్పెడు మంది. మన సైనిక బలగం చాలా పెద్దది. తీవ్రవాదులు పరాయి నేలమీద పనిచేసేవారు. మన భద్రతా దళాలు సొంతగడ్డను సంరక్షించే బాధ్యత ఉన్నవారు. తీవ్రవాదులకన్నా మన భద్రతా దళాలకు ఉన్న సాధన సంపత్తి చాలా ఎక్కువ. తీవ్రవాదుల దగ్గర ఉన్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సైతం పరిమితమైనవే. అయినా తీవ్రవాదులు భారీ సంఖ్యలో మన బలగాలను హతమార్చగలుగుతున్నారంటే అధికారంలో ఉన్న వారు ఉదాసీనంగా, నిర్లిప్తంగా ఉన్నట్టే లెక్క. 370వ అధికరణం రద్దే తీవ్రవాదాన్ని అంతమొందిస్తుందన్న గుడ్డి నమ్మకంతో వ్యవహరిస్తున్నారనుకోవాలి. 370వ అధికరణం రద్దే తీవ్రవాదం అంతానికి మందు అన్న వాదనలో ఏ మాత్రం పసలేదు. విచిత్రం ఏమిటంటే 370వ అధికరణం రద్దు తరవాత జనాగ్రహం అంత తీవ్రంగా వ్యక్తం అయిన దాఖలాలు లేవు. అంటే జనం దీన్ని ఆమోదించారని కాదు. ఎలాంటి భిన్నస్వరమూ వినిపించకుండా మోదీ ప్రభుత్వం అన్ని గొంతులూ నొక్కేసింది. గొంతెత్తే ప్రయత్నంచేసే వారిని ద్రోహుల ఖాతాలోకి తోసేసింది. ముస్లింల రాజకీయ అభిప్రాయ వ్యక్తీకరణకు తావే లేకుండా చేసింది. 370వ అధికరణం రద్దు తరవాత రెండు కేంద్ర ప్రాంతాలుగా మారిపోయిన మునుపటి జమ్మూ-కశ్మీర్‌కు వర్తించే అనేక కొత్త చట్టాలు చేసేస్తున్నారు. అడిగే నాథుడే లేడు. 370వ అధికరణం రద్దుకు ఆమోద ముద్రవేసి అత్యున్నత న్యాయస్థానం జమ్మూ-కశ్మీర్‌ ప్రజలను కుమ్మరి ఆవంలోకి పడదోసింది. కశ్మీర్‌ ప్రతిపత్తి ఇప్పుడు కేవలం పండిత చర్చలకే పరిమితం. 370వ అధికరణం మీద సంఫ్‌ు పరివార్‌ ఇన్నాళ్లుగా చేసిన దుష్ప్రచారం అంతా జమ్మూ-కశ్మీర్‌ చరిత్ర తెలియకపోవడంవల్ల మాత్రమే కాదు. చరిత్రను వక్రీకరించాలన్న కుత్సిత బుద్ధే దీనికి ప్రధాన కారణం. ఈ అధికరణానికి ఉన్న చట్ట ప్రతిపత్తిని కూడా బీజేపీ ప్రభుత్వం విరూపం చేసింది. 370వ అధికరణం భారత రాజ్యాంగంలో భాగం. తీవ్రవాదానికి ఇదే కారణం అయ్యేటట్టయితే తీవ్రవాదం నిరంతరం కొనసాగుతుందనుకోవాలేమో. 370వ అధికరణం తీవ్రవాదానికి, పాకిస్తాన్‌ సరిహద్దులో జగడాలకు కారణం అనుకోవడం భ్రమ. కశ్మీర్‌ కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని గుట్టు చప్పుడు కాకుండా వమ్ము చేసింది. అంతక్రితమే 1989లో అక్కడ తీవ్రవాదం వేళ్లూనింది. ఇటీవల చైనా చొరబాట్లకూ అదే కారణం. స్వాతంత్య్రానికి ముందు భారత యూనియన్‌లో భాగం కాని జమ్ము-కశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడానికి అంగీకరించినందువల్లే కశ్మీర్‌ మన దేశానికి కలికి తురాయి అని గర్వపడగలుగుతున్నాం. 370వ అధికరణం రద్దుతో మోదీ ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్‌ భారత్‌ లో అంతర్భాగంగా చేసిన భూమికనే దెబ్బతీసింది. 370వ అధికరణం రద్దుతో సాంకేతికంగా ఆ ప్రాంతాన్ని భారత్‌తో సమీకృతం చేశామని మురిసిపోవచ్చు కానీ ఈ క్రమంలో కశ్మీర్‌ ప్రజలు దూరమయ్యారు. పదేళ్లనుంచి ఆ ప్రాంతంలో ఎన్నికలే లేవు. అంటే ప్రజల వాణిని వినిపించే ప్రజా ప్రతినిధులే లేరు. ఉన్నదల్లా మోదీ సర్కారు దాష్టీకమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img