Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రాహుల్‌ దిద్దిన కొత్త ఒరవడి

భారత్‌ జోడో యాత్రతో రాహుల్‌ గాంధీలో బిడియం, అనాసక్తత మాయమైపోయినాయి. ఇటీవల ప్రతిపక్ష నాయకుడైన తరవాత, ముఖ్యంగా ప్రతిపక్షాల బలం పదేళ్ల తరవాత గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ రాజకీయాలకు ఉన్న అడ్డుకట్టలన్నీ తొలగిపోయాయి. పార్లమెంటు లోపల, వెలుపల ఆయన ప్రసంగాల్లో పరిణతి పదునెక్కింది. బుధవారం ఆయన దాదాపు డజను మంది రైతు నాయకులను పార్లమెంటుకు ఆహ్వానించి ప్రతిపక్ష నాయకుడిగా తనకు కేటాయించిన గదిలో సమావేశమయ్యారు. రోడ్డెక్కిన వివిధ ఆందోళనకారులతో ప్రభుత్వాధినేతలు, ప్రతిపక్ష నాయకులు చర్చించిన సందర్భాలు ఉండొచ్చు. ఆందోళన చేస్తున్నవారితో మమేకమైన ప్రతిపక్ష నాయకులకు లెక్కేలేదు. వివిధవర్గాల ప్రజల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి వాటిలో కొన్నింటినైనా పరిష్కరించడానికి కారకులైన ప్రతిపక్ష నాయకులూ ఉండొచ్చు. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, అరకొరగానైనా భూసంస్కరణల అమలు లాంటి ప్రగతిశీల విధానాలు రూపొందడానికి ప్రతిపక్షాల, ముఖ్యంగా కమ్యూనిస్టుల నిరంతర పోరాటాలే ప్రధాన కారణం. ప్రతిపక్ష నాయకుడి పని ఓ మంత్రికి ఉండే సదుపాయాలు అనుభవించడంతో అంతం కాదు. అధికారపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించనప్పుడు ఆ పక్షాన్ని బోనెక్కించి, జవాబుదారుగా నిలబెట్టడంలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర చాలా కీలకం. అలా నడుచుకున్న ప్రతిపక్ష నాయకులు గతంలో కూడా ఉన్నారు. సంఖ్యాబలంతో నిమిత్తం లేకుండా ప్రతిపక్ష నేతల మాట చెవిన పెట్టిన అధికారపక్ష నాయకులూ ఉన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత అంతా ఏకపక్షమే. ఆయన మంత్రివర్గ సభ్యుల్లో చాలామంది నిగమశర్మ అక్క స్థాయి దాటనే లేదు. పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి అధికారపక్షం చేయని ప్రయత్నం లేదు. నిష్పక్షపాతంగా మెలగాల్సిన సభాపతులు కూడా అధికారపక్షంతో కుమ్మక్కు అయిపోయి ప్రతిపక్షాల పీక నొక్కిన సందర్భాలు గత పదేళ్లలో కొల్లలుగా ఉన్నాయి. సాహసించి ఏ ప్రతిపక్ష నాయకుడైనా పార్లమెంటులో మాట్లాడితే, సభాపతులు వారి మైక్‌ కట్టేస్తారు. ఆ నాయకుడి మాటల్లో ప్రభుత్వానికి అననుకూలమైన మాటలను రికార్డుల నుంచి తొలగించిన సందర్భాలు ఎన్నో. కానీ మొన్నటి ఎన్నికల తరవాత అధికారపక్షం బలం విపరీతంగా కుదించుకు పోయింది. ప్రతిపక్షాలబలం గణనీయంగా ఉంది. అందువల్ల రాహుల్‌ గాంధీతో సహా ప్రతిపక్ష నాయకులు గొంతెత్తగలుగుతున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌ గాంధీ ప్రసంగం అందరి దృష్టినీ ఆకర్షించింది. లోక్‌సభలో మూడవ పెద్ద పార్టీగా అవతరించిన సమాజ్‌ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు మహువా మొయిత్రా కూడా అడుగడుగునా సమర్థంగా, అర్థవంతంగా ప్రభుత్వపక్ష వితండవాదనలను, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడ్తున్నారు. మన పార్లమెంటు మీద మళ్లీ ఆశలు చిగురిస్తోంది.
రాహుల్‌ గాంధీ మారిన ఈ పరిస్థితిని వినియోగించుకుని దాదాపు నాలుగేళ్లుగా నిరంతరం పోరాడుతున్న రైతు సంఘాల ప్రతినిధులను పార్లమెంటుకు ఆహ్వానించి, ప్రతిపక్ష నేతగా తనకు కేటాయించిన గదిలో చర్చించి కొత్త ఒరవడి దిద్దారు. రోడ్డుమీద కనిపించే ఉద్యమ నాయకులు పార్లమెంటులో కాకపోయినా పార్లమెంటు ఆవరణలో తమ వాదన ప్రతిధ్వనించేలా చేయగలిగారు. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్నాటకకు చెందిన రైతు సంఘాల నాయకులు పార్లమెంటు భవన ప్రాంగణంలో రాహుల్‌ గాంధీతో తమ సమస్యల మీద చర్చించగలిగారు. వారిని రాహుల్‌ గాంధీనే పార్లమెంటులోకి ఆహ్వానించారు. కానీ భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. ఈ లోగా ద్వారం దగ్గరికి వెళ్లి వారితో మాట్లాడాలని రాహుల్‌ అనుకున్నారు. ఈ లోగా సభాపతికో, పార్లమెంటు సిబ్బందికో జ్ఞానోదయం అయి రైతు సంఘాల నేతలను లోపలికి రానిచ్చారు. బడ్జెట్‌ ప్రతిపాదించిన మరుసటి రోజే ఈ సంఘటన జరగడం విశేషం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌ కూడా రైతుల దీర్ఘ కాలిక డిమాండ్లను పట్టించుకోలేదు. బడ్జెట్‌ ప్రసంగంలో అసలు సమస్యల ఊసే లేదు. అందుకే రైతు సంఘాల నాయకులు బడ్జెట్‌ ప్రతులను దగ్ధం చేయాలని సంకల్పించారు. 2020-2021 సంవత్సరాలలో దిల్లీ సరిహద్దుల్లో పదమూడు నెలలకు పైగా బైఠాయించారు. ఉద్యమక్రమంలో దాదాపు 700 మంది రైతుల ప్రాణాలు బలై పోయిన తరవాత 2021 నవంబర్‌ 19న ప్రధానమంత్రి మోదీ వివాదాస్పదమైన మూడు సేద్య బిల్లులను వెనక్కు తీసుకుంటునట్టు ప్రకటించారు. రైతుల డిమాండ్లను పరిష్కరించడానికి అవకాశాలను పరిశీలించడానికి ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కమిటీ ఏర్పాటు చేయడానికి మోదీ ప్రభుత్వానికి తొమ్మిది నెలలు పట్టింది. కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సంజయ్‌ అగర్వాల్‌ అధ్యక్షతన 29 మందితో చివరకు కమిటీ ఏర్పాటు అయింది. దిల్లీ సరిహద్దుల్లో రైతుల బైఠాయింపు జరిగినప్పుడు ఈ ఆందోళనలో దేశమంతటి రైతులు పాల్గొనడం లేదని మోదీ ప్రభుత్వం ప్రచారం చేసింది. కేవలం పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని కొంత ప్రాంతం రైతులే ఉద్యమంలో పాల్గొంటున్నారని అసత్య ప్రచారం చేసింది. విచిత్రం ఏమిటంటే సంజయ్‌ అగర్వాల్‌ కమిటీలో పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ రైతుల ప్రతినిధులే లేరు. రైతుల ప్రధానమైన కోరిక కనీస మద్దతు ధరకు చట్ట ప్రతిపత్తి కల్పించాలనే 1920-21 ఉద్యమం సందర్భంగా రైతు నాయకుల మీద పెట్టిన కేసులు ఎత్తి వేయాలని, లఖిం పూర్‌ ఖేరీలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా తేనీ కుమారుడు రైతుల మీద నుంచి వాహనాలు నడిపించి అయిదుగురు రైతుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్నందున దీని మీద చర్యతీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కనీస మద్దతు ధరకు చట్ట ప్రతిపత్తి కల్పించడానికి మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి నిరాకరిస్తూనే ఉంది. రైతుల డిమాండ్లపై 2022 లో కుదిరిన కొన్ని ఒప్పందాల అమలుకు ఇప్పటికీ దిక్కు లేదు. రైతులు దిల్లీ పొలిమేరలు దాటకుండా ప్రభుత్వం రోడ్ల మీద అడ్డంకులు పెట్టడమే కాదు, ముళ్లకంచెలు వేయించింది. మేకులు నాటించింది. కందకాలు తవ్వించింది. సరిహద్దు దగ్గర ఉన్న వారితో యుద్ధం చేస్తున్నట్టుగానే మోదీ ప్రభుత్వం భావించింది. 2020నాటి విద్యుత్‌ బిల్లును ఉపసంహరించనే లేదు. ఉద్యమం ఒక కొలిక్కి రాకపోవడంతో గత ఫిబ్రవరిలో రైతులు మళ్లీ దిల్లీ రావాలనుకున్నారు. వారిని పంజాబ్‌, హర్యానా సరిహద్దు అయిన శంభు ప్రాంతంలోనే ఆపేశారు. అప్పటి నుంచి భారీ సంఖ్యలో కాకపోయినా అక్కడే రోడ్ల మీదే బైఠాయించారు. 2020-2021 బైఠాయింపు సమయంలో సింఘు, ఘాజీపూర్‌, తిక్రీ ప్రాంతాలు సాక్షాత్తు రణ క్షేత్రాలుగా తయారయ్యాయి. మొన్నటి ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రణాళికలో తాము అధికారంలోకి వస్తే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఇది రైతులలో ఆశ రేకెత్తించింది. అందుకే రైతు సంఘాల నాయకులు పార్లమెంటు ఆవరణలో రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని రాహుల్‌ రైతు ప్రతినిధులకు హామీ ఇచ్చారు. రైతులు ఆశ ప్రతిపక్షాల మీదే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img