Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రెక్కలు విరిగిన దిల్లీ ప్రభుత్వం

దిల్లీ ప్రభుత్వాన్ని రెక్కలు విరిగిన పక్షిలా మార్చేసి కేంద్ర ప్రభుత్వం పెత్తనం కొనసాగించడానికి పట్టిన పంతం నెగ్గింది. లోకసభ ఈ బిల్లును ఆమోదించిన తరవాత రాజ్యసభ కూడా ఆమోదించింది. రాజ్యసభలో బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ లేనందువల్ల ఈ బిల్లును అడ్డుకోవచ్చునన్న ప్రతిపక్షాల వ్యూహం పారలేదు. ఒరిస్సా ముఖ్యమంత్రి నాయకత్వంలోని బిజూ జనతాదళ్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ సమర్థించినందువల్ల ప్రభుత్వంపని సులభం అయింది. ఉభయసభలు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించిన తరవాత అది చట్టం అవుతుంది. దిల్లీ ప్రభుత్వోద్యోగుల నియామకం, బదిలీలు మొదలైన వ్యవహారాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేయడం ఇక లాంఛనం మాత్రమే. ఈ చట్టం అమలులోకి వస్తే జాతీయ రాజధాని దిల్లీ ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతాధికారుల సస్పెన్షన్‌, వారిపై దర్యాప్తులు, నియామకాలు, బదిలీలు అన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి. ముఖ్యమంత్రి ఉత్సవ విగ్రహంగా మారిపోయి అనేక అంశాల మీద లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మాటే చెల్లుతుంది. కొంత కాలంగా ఎవరు లెఫ్టినెంట్‌ గవర్నరుగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే నడుచుకున్నారు. అక్కడితో ఆగకుండా దిల్లీ ముఖ్యమంత్రి అమలు చేయాలనుకున్న అనేక పథకాలకు, నిర్ణయాలకు మోకాలడ్డారు. ఉభయ సభలూ బిల్లును ఆమోదించేశాయి గనక లెఫ్టినెంట్‌ గవర్నరుకు సొంతంగా అమలు చేయగలిగిన విచక్షణాధికారాలు అపారంగా అంది వస్తాయి. అమలులోకి వచ్చే ఈ చట్టం ప్రకారం జాతీయ రాజధాని నగర సివిల్‌ సర్వీసుల అథారిటీ ఏర్పాటు అవుతుంది. ఈ వ్యవస్థలో దిల్లీ ముఖ్యమంత్రి కూడా ఉంటారు. దిల్లీ ప్రభుత్వ ప్రధాన కారదర్శి, దిల్లీ ప్రిన్సిపల్‌ హోం సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు. ఈ వ్యవస్థకు ముఖ్యమంత్రే అధ్యక్షుడిగా ఉన్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఎటూ మోదీ చేతిలోని వారే కనక ఆచరణలో వారి నిర్ణయమే అమలవుతుంది. ఈ వ్యవస్థ ఉన్నతాధికారుల బదిలీలు, నియామకాలు, వారి మీద క్రమశిక్షణా చర్య లాంటి అంశాల మీద తీసుకునే చర్యను లెఫ్టినెంట్‌ గవర్నరుకు నివేదించవలసి ఉంటుంది. అంతిమ నిర్ణయం ఆయనదే. ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి పేరుకే ఆ కమిటీలో ఉంటారు. రాబోయే ఈ కొత్త చట్టంవల్ల దిల్లీ పరిపాలనా క్రమబద్ధం అవుతుందంటున్నారు. అంటే ఇంతకు ముందు క్రమబద్ధంగా లేదన్నదే కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం అనుకోవాలి. ఈ బిల్లును సభలో ప్రతిపాదించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమర్థ పరిపాలన, అవినీతి రహిత పరిపాలన అందించడమే ప్రధాన ఉద్దేశం అన్నారు. అంటే ఇప్పటి వరకూ ఈ రెండూ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ప్రభుత్వంలో లేవనే భావించాలి. దీన్నిబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ఆధిపత్యం కొనసాగితే తప్ప అమిత్‌ షా చెప్తున్న రెండు లక్ష్యాలు నెరవేరవన్నదే కేంద్ర ప్రభుత్వ విశ్వాసం. లోకసభ ఈ బిల్లును గత గురువారం (ఆగస్టు 3) ఆమోదించినప్పుడు ‘‘ఇండియా’’ ఫ్రంట్‌ కు చెందిన ప్రతిపక్షం వాకవుట్‌ చేసింది. అధికార పక్షానికి ఎదురే లేకుండా పోయింది. కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చాలా కాలంగా ఘర్షణ కొనసాగుతోంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు దిల్లీ పరిపాలనాధికారం ప్రజలెన్నుకున్న దిల్లీ ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పును వమ్ము చేయడానికే వారం తిరగకుండా మోదీ ప్రభుత్వం ముందు ఆర్డినెన్సు తీసుకొచ్చి ఆ తరవాత ఉభయసభల్లో బిల్లును ఆమోదింపచేసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు గాలిలో పేలాల పిండిలా మారిపోయింది. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సుపై  పార్లమెంటులోనే తమ వైఖరి వెల్లడిస్తామన్న కాంగ్రెస్‌ వైఖరి కేజ్రీవాల్‌కు నచ్చలేదు. కాంగ్రెస్‌ తమ వైఖరిని స్పష్టం చేస్తే తప్ప ప్రతిపక్షాల సమావేశంలో తమ పార్టీ పాల్గొనబోదని భీష్మించారు. కాంగ్రెస్‌ తన వైఖరిని కొంతమేర సవరించుకుని కేజ్రీవాల్‌ కు మద్దతు ప్రకటించవలసి వచ్చింది. ఈ మధ్యలో దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ కుమారుడు సందీప్‌ పాటిల్‌ తన పార్టీ వైఖరికి అతీతంగా కేజ్రీవాల్‌ కేంద్రంతో ఘర్షణపడినందువల్లే ఈ ఆర్డినెన్సు జారీ చేయవలసి వచ్చిందని అనుచిత వ్యాఖ్య చేశారు. పార్లమెంటు ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించడం భారత ప్రజా స్వామ్యంలో చీకటి రోజు అని, ఇది రాజ్యాంగ విరుద్ధమైందని కేజ్రీవాల్‌ తో సహా ఆయన పార్టీ నాయకులు ఆక్రోశిస్తున్నారు. వెరసి దిల్లీ ప్రభుత్వాన్ని కట్టడి చేయడానికి ఉపకరించే ఈ శాసనం దిల్లీ ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పును వమ్ము చేయడానికే ఉపయోగపడ్తుంది. దిల్లీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నా ఆ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేయడమే మోదీ ప్రభుత్వ అంతిమ లక్ష్యం. దేశంలో ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్నాను అనుకుంటున్న మోదీ దేశ రాజధాని అయిన దిల్లీలో తమ పార్టీ ప్రభుత్వం లేకపోవడాన్ని బొత్తిగా సహించలేక పోతున్నారు. ఈ కొత్త శాసనంపై మళ్లీ సుప్రీంకోర్టు లో న్యాయ పోరాటం కొనసాగించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆలోచిస్తోంది. మళ్లీ ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్తే తాము ముందు ఇచ్చిన తీర్పునకు అనుకూలంగానే మళ్లీ కొత్త తీర్పు వస్తే అప్పుడు జరిగేదల్లా కార్యనిర్వాహక వర్గానికి, న్యాయ వ్యవస్థకు మధ్య మరోసారి ఘర్షణ అనివార్యం అవుతుంది. ప్రజలు అధికారం ఇచ్చిన ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం నిరంకుశత్వమనడంలో అనుమానమే అక్కర్లేదు. ప్రజాభీష్టాన్ని లెక్క చేయకపోవడం బీజేపీ నైజం. ఈ బిల్లును ప్రతిపక్షాలు నివారించలేక పోయినా న్యాయపోరాటం కొనసాగించుకోవాలనుకుంటోంది. దిల్లీ ప్రభుత్వ అధికారాల విషయం సుప్రీంకోర్టులో మూడుసార్లు ప్రస్తావనకు వచ్చింది. 2018, 2023లో సుప్రీంకోర్టు దిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పులు చెప్తుంది. ఈ సారి కూడా సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆశిస్తోంది.  ఈ బిల్లు సందర్భంగా మరో విచిత్రం కూడా వ్యక్తం అయింది. రాజ్యసభలో బిల్లుమీద చర్చ జరిగినప్పుడు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ కూడా మాట్లాడారు. ఆయన రాజ్యసభ సభ్యుడై మూడేళ్ల నాలుగు నెలలైంది. ఇంతకాలం కూడా రంజన్‌ గొగోయ్‌ ఒక్క సారి కూడా పెదవి విప్పలేదు. రంజన్‌ గొగోయ్‌ మాట్లాడడానికి సిద్ధం కాగానే రాజ్యసభలో అయిదుగురు మహిళా సభ్యులు వాకవుట్‌ చేశారు. బీజేపీ తన పంతం నెగ్గించుకున్నా దిల్లీ ప్రభుత్వ వ్యవహారం ఇప్పటికైనా కొలిక్కి వస్తుందన్న నమ్మకంలేదు. ఒక వేపు న్యాయపోరాటం మరో వేపు దిల్లీ పెద్దల జోక్యం అనివార్యం. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img