Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విపత్తుగా మారుతున్న విత్తు

ఖరీఫ్‌ ముంగిట చచ్చుపుచ్చు విత్తుల్ని నాణ్యమైన రకాలుగా రైతులకు అంటగట్టి వ్యాపారులు, దళారులు ఎడాపెడా కాసుల పంట పండిరచుకోవడం, విత్తింది విపత్తు అని ఆలస్యంగా గుర్తించి నష్టాలతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవడం… ఏళ్లతరబడి కొనసాగుతున్న దారుణం. ప్రపంచ విత్తనోత్పత్తిలో భారత్‌ ప్రముఖ స్థానంలో ఉన్నా, వ్యవసాయశాఖ అలక్ష్యం, నిఘా వ్యవస్థల వైఫల్యం క్షేత్రస్థాయిలో రైతుల పుట్టి ముంచుతున్నాయి. నిషేధిత పంటల విత్తన రకాలు మార్కెట్లో లభ్యమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిషేధిత, నాసిరకం విత్తనాలు గుజరాత్‌లాంటి రాష్ట్రాల నుంచి తెచ్చి రైతులకు అమ్ముతున్నారు. పత్తి అధికంగా పండిరచే తెలుగు రాష్ట్రాల్లో ఈ పోకడలను నియంత్రించడంలో వ్యవసాయశాఖ యంత్రాంగం విఫలమవుతోంది. ప్రభుత్వరంగ సంస్థల విత్తన సేకరణ, సరఫరాలో రాజకీయ నేతల జోక్యం పెరిగిపోవడంతో వాటి పని విధానంలోనూ లోపాలు తలెత్తుతున్నాయి. రైతుల శ్రమను, పెట్టుబడుల్ని విత్తన రూపేణా మట్టిపాల్జేసి అన్నదాతల కుటుంబాల్లో విషాదాగ్నులు ప్రజ్వరిల్లజేస్తున్న దగా కోరులపై పాలకులు కొరడా రaళిపించాల్సిన అవసరం ఉంది. దిగుబడులు పెంచే, తెగుళ్లను తట్టుకొనే విత్తన రకాలు కూడా ఏళ్ల తరబడి అందుబాటులోకి రావడంలేదు. నిధుల కొరతతో ప్రభుత్వరంగ పరిశోధనలు పడకేయడమే ఇందుకు ప్రధాన కారణం. రకరకాల కారణాలతో నకిలీ, నాసిరకం విత్తన దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని గుంటూరు, ప్రకాశం, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌, అనంతపురం జిల్లాల్లో ఈ నకిలీ విత్తన దందా కొన్నేళ్లుగా సాగుతోంది. కొన్ని సంవత్సరాలుగా అంచెలవారీగా ఈ దందా వివిధ జిల్లాలకు పాకింది. కల్తీ విత్తుల తయారీ, ప్యాకింగుల్లో వ్యాపారులు, దళారులు వెయ్యి పడగలతో విషం కక్కుతున్నారు. విత్తన సరఫరాలో మోసాలు ప్రధానంగా పత్తి, వేరుశనగ వంటి పంటల్లోనే అధికంగా జరుగుతున్నాయి. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని భద్రంపల్లెలో నకిలీ ఉల్లి విత్తనాలు రైతులను ముంచివేశాయి. విత్తనాలు వేసి నెల రోజులు గడిచినా మొలకెత్తకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. వేసిన పంటను కలియదున్నేశారు. కిలో విత్తనాలు రూ. 1100 పెట్టి కొనుగోలు చేసి విత్తారు. ఇప్పటికే మొక్కలు పచ్చగా పెరగాల్సి ఉండగా మొలకలే రాకపోవడంతో ఇక మొలకెత్తే అవకాశం లేదని ఆదివారం పంట మొత్తం కలియదున్నేశారు. నియోజకవర్గంలో దాదాపు 475 ఎకరాల్లో ఉల్లి పంటవేశారు. మొలకెత్తని కారణంగా ఇప్పటికే 84 ఎకరాల్లో పంటను రైతులు తొలగించారు. ఒక ప్రైవేట్‌ కంపెనీలో కొనుగోలు చేసిన విత్తనాలే తమ పుట్టిముంచాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నకిలి, నాసిరకం విత్తనాలతో అన్ని ప్రాంతాలలోనూ రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకసారి వేసిన విత్తనం పండకపోవడంతో దానిని తొలగించి కొత్తగా విత్తనాలు వేయడంతో పంట ఖర్చు కూడా గణనీయంగా పెరుగుతోంది. పెట్టిన పెట్టుబడిరాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. 1966 విత్తన చట్టం, 2004 విత్తన బిల్లు కూడా విత్తనోత్పత్తి, పంపిణీలోని లోపాలను సరిచేయలేక పోగా, ఉత్పత్తిదారులకు మేలు చేసేలా మారాయి. తాము సరఫరా చేసినవి నాణ్యమైన విత్తనాలు కావని తేలినప్పుడు… చట్టంలోని నిబంధనలను అడ్డు పెట్టుకుని ఎన్నో సంస్థలు స్వల్ప జరిమానాలతో తప్పించుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. 2002లో తీసుకొచ్చిన జాతీయ విత్తన విధానం సైతం పరిస్థితిలో పెద్దగా మార్పు తీసుకురాలేకపోయింది. ప్రభుత్వ రాయితీ పంపిణీలో మోసాలను అరికట్టడానికీ, నాసిరకం విత్తనాల పంపిణీని నియంత్రించడానికీ, రాయితీలు దిగమింగే అధికారులపై చర్యలకూ, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నకిలీ విత్తనాల తయారీ ఆలోచన వస్తేనే మోసగాళ్లు వణికిపోయేలా కఠిన శిక్షలు అమలు చేస్తేనే ఈ దందాకు ముకుతాడు పడుతుంది.. రైతులు తెప్పరిల్లుతారు!
దేశంలో పెరుగుతున్న జనాభాకు తగ్గ ఆహారం ఉత్పత్తి చేయాలంటే ప్రస్తుతం జరుగుతున్న ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. పంటల సాగులో ఒక్కోసారి సాధారణ ఉత్పత్తిని అందుకోలేకపోతున్న మనం, అధికోత్పత్తులను సాధించా లంటే ముందుగా నాణ్యత కలిగిన విత్తనాలను అందించడంపై దృష్టిపెట్టాలి. చీడపీడలను, కరవు పరిస్థితులను తట్టుకుని రెట్టింపు దిగుబడినిచ్చే అత్యాధునిక వంగడాలను సృష్టించేలా పరిశోధనా రంగం కృషిచేయాలి. విత్తనశుద్ధి, నిల్వ సదుపాయాలను మరింతగా పెంపొందించాలి. ఎంతటి సారవంతమైన నేల అయినా విత్తును బట్టే పంట. మేలిమి విత్తనమే పైరు ఎదుగుదలకు, గింజ నాణ్యతకు, అధిక దిగుబడికి అసలైన పునాది. విత్తులో సత్తువ లేనప్పుడు రైతు ఎంతగా ఆరాటపడినా ఫలితం ఉండదు. నాణ్యమైన వంగడ రకాల పంపిణీకి ఉద్దేశించి దేశంలో అయిదున్నర దశాబ్దాల కిందటే జాతీయ విత్తన సంస్థను ఏర్పరిచారు. రాష్ట్రాల్లో విత్తనాభివృద్ధి సంస్థలు, గ్రామీణ విత్తనోత్పత్తి కార్యక్రమాలు చేపడుతున్నారు. విత్తన పంటలు పండిరచి, శుద్ధిచేసి, నిల్వచేసి, వాటి సాగు, కొనుగోళ్లు, నాణ్యతా నియంత్రణ, మండలాల వారీగా పర్యవేక్షణకు ఉద్దేశించిన మార్క్‌ఫెడ్‌, ఆయిల్‌ఫెడ్‌, హాకా తదితర సంస్థలు పనితీరు సక్రమంగా లేకపోవడం వల్లే ప్రైవేటు విత్తన సంస్థలు, వ్యక్తుల ఆటలు సాగుతున్నాయి. నకిలీలకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నది. పత్తి, వేరుశనగ నుంచి ఇటీవల సంవత్సరాల్లో మినుము, సోయాచిక్కుడు, వరి, కూరగాయల విత్తుల్లోనూ నకిలీల ఉద్ధృతి వేల కోట్లరూపాయల అక్రమ వ్యాపారంగా మారింది. ఇందుకు అధికారులు, రాజకీయ నాయకుల లోపాయకారి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఫలితంగా పీడీ చట్టం అమలు చేస్తామన్నా ఫలితం దక్కడం లేదు. నాణ్యమైన విత్తనం, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే 45శాతం దాకా ఫలసాయంలో వృద్ధి సాధ్యమని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. జాతీయ స్థాయిలో మెరుగైన చట్టం కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు నీరుగారి పోతున్నాయి. కాబట్టి రాష్ట్రాలైనా నాసిరకం, కల్తీ విత్తనాలు సరఫరా చేసిన సంస్థలు, వ్యాపారులపై, పర్యవేక్షణ యంత్రాంగంపై కఠిన చర్యలు చేపట్టేలా విధివిధానాల్ని పరిపుష్టంచేయాలి. సమగ్ర పరిశోధన, పటిష్ఠ కార్యాచరణను రూపొందించి మేలిమి విత్తనాలు సరఫరాచేసేందుకు చర్యలు చేపట్టాలి. అప్పుడే రైతులకు విత్తు విపత్తు తప్పి అధిక దిగుబడులకు అవకాశం కలుగుతుంది. అప్పుల బాధలు, ఆత్మహత్యల నుంచి రైతన్నకు విముక్తి కలుగుతుంది. దేశం సుభిక్షంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img