Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

విషం ఎక్కిస్తున్న ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి.

చరిత్రను మార్చేయడం, తమకులేని చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చడం బీజేపీ మతతత్వ వాదులకు మొదటి నుంచీ అలవాటు. ఈ ధోరణి మోదీ పదేళ్ల కింద అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రారంభం కాలేదు. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడూ ఇదే పద్ధతి కొనసాగింది. ఇప్పుడు మళ్లీ ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి. పాఠ్య పుస్తకాలను మార్చేపనిలో పడ్డారు. అందులో ప్రధానాంశం తమ తప్పులను పాఠ్య పుస్తకాలలోంచి తొలగించడం. దేశ వ్యాప్తంగా నాలుగుకోట్ల మంది విద్యార్థులు ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి. పాఠ్య గ్రంథాలను చదువుతారు. వారి మెదళ్లలోకి కుహనా జాతీయవాదం ఎక్కించే ప్రయత్నం జరుగుతోంది. 2024-25 విద్యా సంవత్సరంలో ఈ పాఠ్య పుస్తకాలే అమలులో ఉంటాయి. అవసరానికి తగ్గట్టుగా, మారుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పాఠ్య గ్రంథాలను మార్చే అవసరం ఉండొచ్చు. కానీ దానికి ఒక పద్ధతి ఉంది. అంతకు ముందు పాఠ్య గ్రంథాలు రాసిన వారికి మాట మాత్రంగానైనా చెప్పకుండా, మార్చేసిన పాఠ్య గ్రంథాలలో మునుపురాసిన వారి అనుమతిలేకుండా మార్చేసి ప్రచురించడం దుర్మార్గం. అందుకే యోగేంద్ర యాదవ్‌, సుహాస్‌ పల్షీకర్‌ తమ అనుమతి లేకుండా పాఠ్య గ్రంథాలను మార్చేసి సలహాదార్లుగా తమ పేర్ల మీద ప్రచురిస్తే కోర్టులో కేసు దాఖలు చేస్తామని హెచ్చరించవలసి వచ్చింది. ఈ మేరకు వారు ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి. డైరెక్టర్‌ దినేశ్‌ ప్రసాద్‌ సక్లానీకి లేఖ కూదా రాశారు. విరూపం చేసిన పుస్తకాలను తమ పేర్లతో ప్రచురించే న్యాయపరమైన, నైతిక హక్కు ఎన్‌.సి.ఇ.ఆర్‌.టికి లేదని వారు అంటున్నారు. కొత్తగా సిద్ధంచేసిన పాఠ్య పుస్తకాలలో బాబ్రీ మసీదు విధ్వంసానికి ముందు జరిగిన అడ్వాణీ రథయాత్ర, ఆ తరవాత జరిగిన పరిణామాలను తొలగించేశారు. అయితే వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మించడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి మాత్రం విస్తారంగానే ప్రస్తావించారు. 12వ తరగతి విద్యార్థులకోసం తయారుచేసిన రాజకీయ శాస్త్ర పాఠ్య పుస్తకాలలో బాబ్రీ మసీదు పేరైనా చెప్పకుండా దాన్ని మూడు గుమ్మటాల నిర్మాణం అని రాశారు. అయోధ్య గురించి మునుపటి పుస్తకాలలో నాలుగు పేజీలు ఉంటే ఇప్పుడు రెండు పేజీలకు కుదించారు. ఈ మార్పులు చేసినప్పటికీ యోగేంద్ర యాదవ్‌, సుహాస్‌ పల్షీకర్‌ పేర్లను సలహాదార్లుగా ప్రచురించారు. మార్చిన పాఠ్య పుస్తకాల మీద సలహాదార్లుగా తమ పేర్లు తొలగించాలని యోగేంద్ర యాదవ్‌, పల్షీకర్‌ ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి. డైరెక్టర్‌ సక్లానీకి గత సంవత్సరమే ఇ-మెయిల్‌ పంపించారు. ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి. దాన్ని పట్టించుకోలేదు. మార్చకుండా ఆరు పాఠ్య పుస్తకాలు ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి. వెబ్‌ సైట్లో, ముద్రిత రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి. ఇంతకు ముందు ఇలా మార్చేటప్పుడు అక్కడక్కడా కొన్ని అంశాలను తొలగించేవారు లేదా తమకు కావాల్సిన భాగాలను చేర్చేవారు. ఇప్పుడు ఇష్టారీతిన మార్చేసినా సలహాదార్లకు మాట మాత్రం కూడా చెప్పలేదు. పాఠ్య గ్రంథాల రచయితలకు విరుద్ధమైన అభిప్రాయాలను వారి అనుమతి లేకుండా మార్చడమే కాక, తమ పేర్లను తొలగించాలని కోరినా పెడచెవిన పెట్టడం సకల నియమాలకూ విరుద్ధమే. పాఠ్య పుస్తకాలను కాషాయీకరించాలన్న ప్రస్తుత పాలకుల ధోరణికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. కాలానుగుణంగా మార్పులు అవసరమవుతాయని, 2020 జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నామని సక్లానీ వాదిస్తున్నారు. ఈ మార్పులు నూతన విధానానికి అనుగుణంగా ఉంటే ఉండొచ్చు కానీ ఆ మార్పులకు రచయితల, సంపాదకుల, సలహాదార్ల సమ్మతి కావాలన్న అంశాన్ని ఆయన పట్టించుకోవడానికి సిద్ధంగాలేరు. అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వ భావాలను ఇతరుల నోటిద్వారా చెప్పిస్తున్నారు. ప్రజలను విభజించే రీతిలో పాఠ్య పుస్తకాలు ఉండకూడదని సక్లానీ అంటున్నారు.
గుజరాత్‌ మారణకాండకు, బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన విషయాలను ఎందుకు మార్చారు అని ప్రశ్నిస్తే పిల్లలను దూకుడుగా, విద్వేష పూరితంగా, లేదా విద్వేషానికి గురయ్యేలా తయారు చేసే పాఠాలు ఉండాలా అని సక్లానీ వితండవాదం చేస్తున్నారు. ఇలాంటి విషయాలు వారు పెరిగి పెద్దయిన తరవాత తెలుసుకుంటే తెలుసుకుంటారు కానీ పాఠ్య పుస్తకాల్లో ఈ విషయం ఎందుకు అన్నది ఆయన భావన. పెద్దయ్యాక తెలుసుకుంటారు కాని పునాదిస్థాయిలో మదిలోకెక్కిన అసత్యాలు, వక్రీకరణలు వారిమీద తీవ్ర దుష్ప్రభావం చూపుతాయి. దీనికి సక్లానీదగ్గర సమాధానం లేక కాదు. ఏలిన వారి సైద్ధాంతాలకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు రూపొందించి తరించడం మాత్రమే ఆయనకు తెలుసు. ఈ మార్పుల గురించి రగడే అనవసరం అని సక్లానీ ఆధిపత్య ధోరణిలో మాట్లాడుతున్నారు. ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి. పాఠ్య పుస్తకాలలో ఏకపక్ష మార్పులను వ్యతిరేకిస్తున్నది కేవలం సెక్యులర్‌వాదులో, ఆ గ్రంథాల రూపకల్పనతో సంబంధం ఉన్నవారో మాత్రమే కాదు. అయోధ్యలో రామమందిర ప్రధాన పూజారి సత్యేంద్రదాస్‌ మహారాజ్‌ కూడా మార్పులను అంగీకరించడం లేదు. కొత్త పాఠ్య గ్రంథాలలో అయోధ్య ఉద్యమానికి సంబంధించి చేసిన మార్పులను ఆయన తూర్పారబట్టారు. 1992 డిసెంబర్‌ ఆరున ‘‘మూడు గుమ్మటాల నిర్మాణం’’ ఎలా కూలిపోయిందో వివరించలేదని ఆయన అంటున్నారు. 2019 నవంబర్‌ 9న సుప్రీంకోర్టు తీర్పు గురించి మాత్రమే ప్రస్తావించడం వైపరీత్యం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పాఠ్య గ్రంథాలలో 1990లో సోంనాథ్‌ నుంచి అయోధ్య దాకా జరిగిన రథయాత్ర, కరసేవకుల పాత్ర, బాబ్రీ విధ్వంసం, అప్పుడు బీజేపీ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం, అయోధ్య పరిణామాలపై అప్పుడు బీజేపీ ‘‘విచారం’’ వ్యక్తం చేయడంలాంటివి ఏవీ మచ్చుకైనాలేవు. 1949 డిసెంబర్‌ 22న హఠాత్తుగా బాబ్రీ మసీదులో రాముడి విగ్రహాలు ప్రత్యక్షమైన ఊసుకూడా లేదు. పాఠ్య పుస్తకాలు సిద్ధంచేయడంలో ఒకప్పుడు ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి.కి చాలా మంచి పేరు ఉండేది. బీజేపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి. పాఠ్యపుస్తకాలను సంఫ్‌ు పరివార్‌ కరపత్రాలుగా దిగజారుస్తున్నారు. ఇప్పుడవి ఎంతమాత్రం పాఠ్య గ్రంథాలుగాలేవు. అధికారంలో ఉన్నవారి చిత్తవృత్తికి అనుగుణంగా పాఠ్యగ్రంథాలు తయారవుతున్నాయి. పనిలోపనిగా భారత రాజ్యాంగాన్ని కించపరిచే అంశాలకు మాత్రం పాఠ్య గ్రంథాలలో పెద్దపీట వేస్తున్నారు. అయోధ్య ఉద్యమానికి, బాబ్రీ మసీదు విధ్వంసానికి ముసుగువేస్తున్న పాఠ్య గ్రంథాలలో ప్రపంచ యుద్ధాల గురించిన ప్రస్తావన మార్చకపోవడం మరో వైపరీత్యం. కశ్మీర్‌కు వర్తించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దుచేసిన అంశాన్ని మాత్రం ప్రస్తావించారు. ‘‘ఆజాద్‌ కశ్మీర్‌’’ మాటస్థానంలో ‘‘పాక్‌ ఆక్రమిత జమ్మూ-కశ్మీర్‌’’ అని చేర్చారు. వామపక్ష పార్టీలు అంటే స్వేచ్ఛాయుతమైన పోటీకి తావివ్వకుండా ‘‘నియంత్రించే’’ విధానాన్ని అనుసరించేవారు అన్న తప్పుడు అభిప్రాయాన్ని కల్పించే ప్రయత్నం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img