Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

హిందుత్వ బలి పీఠంపై కావడి యాత్ర

భారతీయ జనతా పార్టీ అనుసరించే విధానాలు ప్రతిపక్షాల ఏవగింపునకు గురి కావడమే కాదు స్వపక్షం నుంచి విమర్శలకు దారి తీసే సందర్భాలూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లో కన్వర్‌ యాత్ర సందర్భంగా యోగీ ఆదిత్యనాథ్‌ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై మిత్రపక్షాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. కన్వర్‌ యాత్ర సాగే దారి పొడవున ఉన్న తినుబండారాలు అమ్మే దుకాణాలు, టీ కొట్లు, హోటళ్లు, పళ్లు అమ్మే బండ్లు మొదలైన వాటిమీద అవి అమ్మేవారి పేర్లు కూడా ఉండాలని మొదట ముజఫÛర్‌పూర్‌ పాలనా విభాగం ఆదేశించింది. ఆ తరవాత ఈ ఆదేశాన్ని యోగీ ప్రభుత్వం రాష్ట్ర మంతటికీ వర్తింపచేసింది. అంటే అమ్మేవారి పేర్లనుబట్టి వారి కుల మతాలు తెలుసుకోవాలన్న ఉద్దేశం ఈ ఆదేశాల వెనక దాగి ఉంది. దుకాణాల పేర్లు మాత్రమే కాకుండా వాటిని నడిపేవారి పేర్లు కూడా స్పష్టంగా తెలియజేయాలని యోగీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాదు-కుట్ర చేస్తోంది. అక్కడితో ఆగినా బాగుండేది. ఆ దుకాణాల్లో ముస్లిం ఉద్యోగులు ఉంటే వారిని తొలగించాలని ఆదేశించిన ఉదంతాలూ ఉన్నాయి. ఈ యాత్ర వచ్చే సోమవారం (జులై 22) ప్రారంభం అవుతుంది. తన కొట్లో ముస్లిం ఉద్యోగులను తొలగించవలసి వచ్చిన ఒక యజమాని ‘‘పాపం వారికి పదిహేను ఇరవై రోజులు పని దొరకదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కన్వర్‌ యాత్ర అంటే కావళ్లలో గంగానదీ జలాలు తీసుకురావడం. ఈ యాత్ర ప్రధానంగా హరిద్వార్‌, గౌముఖ్‌, గంగోత్రి నుంచి ప్రారంభం అవుతుంది. భక్తులు ఈ ప్రాంతాల నుంచి కావళ్లలో గంగా జలాలు తమ ప్రాంతాలలోని శివాలయాలకు మోసుకెళ్తారు. భక్తుల దృష్టిలో ఇది ‘‘పవిత్ర’’ కార్యమే కావచ్చు. ఈ యాత్రలో పాల్గొనే వారు మార్గమధ్యమంలో ఆకలి దప్పులు తీర్చుకోవలసి రావచ్చు. వారు వివిధ రకాల అమ్మకం కేంద్రాల మీద ఆధార పడతారు. అవి నడిపే వారి పేర్లు ఏమిటో స్పష్టంగా ప్రకటించాలని అంటే బహిరంగంగా కనిపించే లక్ష్యం అయితే ముస్లింల కొట్లలో లేదా వారు పని చేసే కొట్లలో కొనకూడదనే. ఈ సూత్రాన్నే కింది కులాల వారికీ వర్తింప చేసే అవకాశం లేకపోలేదు. అంటే ఇతర మతాల వారు అమ్మే తినుబండారాలను కొనకుండా కట్టడి చేయడం. ఇతర మతాల వారిలో బీజేపీ దృష్టిలో ప్రధానంగా ఉండేది ముస్లింలే. ఇది ఒక రకంగా హిందూ మత ‘‘పరిశుద్ధత’’ను పరిరక్షించే కుత్సిత ప్రయత్నం. హిందూ మతం భ్రష్టు పట్టకుండా నిలవరించే ప్రక్రియ. మోదీని మించిన హిందు హృదయ సామ్రాట్‌ అనిపించుకోవాలన్న తపన యోగీ మదిలో తొలుస్తూ ఉండొచ్చు. కేవలం జిల్లా స్థాయి అధికారులు తోపుడు బళ్లతో సహా, దుకాణాలు, ధాబాలు, హోటళ్లపై వాటి నిర్వాహకుల, వాటిలో పనిచేసేవారి పేర్లు స్పష్టంగా కనిపించేట్టు ప్రకటించాలని ఆదేశిస్తే క్రమంగా యోగీ దీన్ని మొత్తం రాష్ట్రమంతటికీ వర్తింప చేసి తన ఖాతాలో వేసేసుకున్నారు. ఇదే జరిగినా కొన్ని పేర్ల వల్ల కుల మతాలు తెలియకపోవచ్చునన్న ఇంగిత జ్ఞానం కూడా యోగీ ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు. చింటు, గుడ్డు, పింటు లాంటి పేర్ల వల్ల కుల మతాలు తెలియకపోవచ్చుగా. ఈ విషయం యోగీ ప్రభుత్వానికి తెలియదనుకోలేం కానీ ప్రధానంగా ముస్లింలు నడిపే లేదా ముస్లింలు పనిచేసే దుకాణాల జోలికి వెళ్లకూడదని హెచ్చరించే మాయదారి తంత్రం ఇందులో దాగి ఉంది. సెక్యులర్‌ విధానాలకు కట్టుబడి ఉండాలనుకునే లేదా కట్టుబడి ఉన్న పక్షాలు, పార్టీలు, వర్గాలు యోగి ప్రభుత్వచర్యను తీవ్రంగా ఖండిరచడంలో ఆశ్చర్యం లేదు. కానీ బీజేపీ మిత్ర పక్షాలు కూడా ఈ ఆదేశాలను తూర్పారబడ్తున్నాయి. అంటే ఇది ఎంతటి ప్రజాకంటక ఆదేశమో అర్థం చేసుకోవచ్చు. అన్య మతస్థుల వ్యాపారాలను దెబ్బతీసే ఉద్దేశం వికృతరీతిలో బయటపడ్తోంది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీతో కలిసి అధికారం పంచుకుంటున్న నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలోని జనతా దళ్‌ యునైటెడ్‌, చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌.జె.పి.), రాష్ట్రీయ లోక్‌దళ్‌ కూడా ఈ వివక్షా పూరిత ఉత్తర్వును దుయ్యబడ్తున్నాయి. వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా కోరుతున్నాయి. ‘‘ఈ ఆదేశం మత వివక్షతో కూడిరది. రాజ్యాంగ విరుద్ధమైంది’’ అని రాష్ట్రీయ జనతా దళ్‌ యు.పి. విభాగం అధ్యక్షుడు రమాశీశ్‌ అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మిత్ర పక్షం ఇదొక్కటే. కావడి యాత్ర పవిత్రత గురించి యోగీ ప్రభుత్వానికి అంత దీక్షా తత్పరతే ఉంటే ఆ యాత్ర సాగే దారిలో ఉన్న మద్యం దుకాణాలు సైతం మూసి వేయాల్సింది అని రాష్ట్రీయ జనతాదళ్‌ ప్రధాన కార్యదర్శి త్రిలోక్‌ త్యాగి మరింత పదునైన విమర్శ గుప్పించారు. ‘‘బీహార్‌ లో ఉత్తరప్రదేశ్‌లో కన్నా భారీస్థాయిలో కావడి యాత్రలు సాగుతాయి. జార్ఖండ్‌ లోనూ ఈ యాత్రలు ఉంటాయి. ఆ రాష్ట్రాలలో ఇలాంటి ఆదేశాలు లేవు’’ అని జనతా దళ్‌ (యు) ప్రధాన కార్యదర్శి కె.సి.త్యాగి నిలదీశారు. ‘‘సబ్కా సాథ్‌, సబ్కా వికాస్‌’’ అన్న మోదీ నినాదం ఏమైంది అని కూడా ఆయన ప్రశ్నించారు. లోక్‌ జనశక్తి పార్టీ అధిపతి చిరాగ్‌ పాశ్వాన్‌ కూడా యోగీ ప్రభుత్వ ఆదేశాలను ఈసడిరచారు.
యోగీ ఆదిత్యనాథ్‌ ఎన్నుకున్న ఈ వికృత ఆదేశాల ఆంతర్యం తానే మోదీ కన్నా పెద్ద ‘‘హిందూ హృదయ సామ్రాట్‌’’ అనిపించుకోవడమే కాదు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌ లో బీజేపీకి చావు తప్పి కన్ను లొట్ట పోయింది. నిజానికి అక్కడ అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలెట్టి సర్వమూ మోదీ-అమిత్‌ షా ద్వయం చేతుల మీదుగానే సాగింది. గెలిస్తే మోదీ ఘనత అని ఉధృతంగా ప్రచారం చేసుకునే మోదీ ఇప్పుడు ఓటమి భారాన్ని యోగీ మీదకు తోసేసే పనిలో ఉన్నారు. అందుకే యోగీ మంత్రివర్గంలోని ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, మిత్ర పక్షాలకు చెందిన ఒకరిద్దరు మంత్రులు యోగీ మీద నిందారోపణలకుదిగారు. దీన్నిబట్టి యోగీ పీఠం కదులుతోందన్న వార్తలు జోరుగా సాగుతున్నాయి. త్వరలో మూడు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. మోదీ తరవాత పదునైన ప్రచారకుడు యోగీనే. కానీ మారిన వాతావరణంలో వాటి ఫలితాలూ బీజేపీకి సానుకూలంగా ఉండక పోవచ్చు. అందుకే ఆ ఎన్నికలలో హిందువులకు వలవేయడానికి ఏదో ఎజెండా కావాలి కనక యోగీఆదిత్యనాథ్‌ హిందుత్వ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. యోగి తన అస్తిత్వాన్ని సుస్థిరం చేసుకోవాలను కుంటున్నారు. బీజేపీ హిందుత్వ రాజకీయాలలో మతమే కాదు, పండగలు, పబ్బాలు, ఆచార వ్యవహారాలు ఆ బలి వితర్థిపైకి చేరాల్సిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img