Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

టిడిపి, జనసేన, బిజెపి పొత్తు తో వైసీపీలో అలజడి…

విశాలాంధ్ర- ఏలూరు: టిడిపి, జనసేన, బిజెపి పొత్తుతో సైకో ముఖ్యమంత్రి జగన్‌, వైసిపి నేతల గుండెల్లో దడ మొదలైందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి – జనసేన ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి దుయ్యబట్టారు. కులాలు, మతాల వారీగా విడగొట్టి రానున్న ఎన్నికల్లో పబ్బంగడుపుకోవాలనుకున్న వైసిపి ఎత్తుగడలు ఇక చిత్తైనట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఏలూరు నియోజకవర్గంలో వైసిపి నుండి టిడిపిలోకి వలసల పర్వం జోరందుకుంది. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ వైసిపి నుంచి భారీగా టిడిపిలో చేరుతూ వస్తున్నారు. ఏలూరు 15వ డివిజన్‌ వడ్డెరగూడెంలో వరుసు రమణయ్య ఆధ్వర్యంలో గుంజే వెంకన్న, దాలి రాట్నాలు, ఓల్లేపు ఇస్సాకు, గుంజే చిన్నచిన్న, గుంజే రామాంజనేయులు తోపాటుగా సుమారు 30 మంది టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి బడేటి చంటి పార్టీలోనికి ఆహ్వానించారు. గడిచిన 57 నెలల్లో వైసిపి ప్రభుత్వ హయాంలో ఎంతో నష్టపోయామని, రాష్ట్ర భవిష్యత్తు టిడిపి – జనసేనతోనే సాధ్యమని భావించి పార్టీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ టిడిపి – జనసేన, బీజేపి కూటమి ద్వారా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడం ఖాయమని పేర్కొన్నారు. తన అసమర్ధ పాలనతో జగన్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. విద్యుత్‌ ఛార్జీలు, పన్నుల పెరుగుదల, అదుపుతప్పిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలకు వైసిపి అంటేనే చులకనభావం ఏర్పడిందన్నారు. టిడిపి – జనసేన, బీజేపీ కూటమితోనే సంపద సృష్టించడం, అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ కూటమిని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన జగన్‌ సహజ వనరులను దోచుకుంటూ రాష్ట్ర ప్రజల జీవితాలకు భద్రత లేకుండా చేశారని ఆరోపించారు. ఈ రెండు నెలల పాటూ టిడిపి నాయకులు, కార్యకర్తలు వైసిపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ చోడే వెంకటరత్నం, డివిజన్ ఇంచార్జ్ కోన మాణిక్యం, తెదేపా నాయకులు ఆవుల చంద్రయ్య, గుంజే దుర్గారావు, వేముల వెంకన్న, గువ్వల ఏసుబాబు, వల్లెపు పోతురాజుతో పాటుగా, వివిధ హోదాలల్లో ఉన్న పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img