Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

పేదవర్గాల సంక్షేమమే చంద్రన్న ఆశయం….

రైతు కూలీలతో చింతమనేని ప్రభాకర్ ముఖా ముఖి….

విశాలాంధ్ర పెదవేగి: ఏదో వర్గాల సంక్షేమమే చంద్రన్న ఆశయం అని, బాబు సూపర్ 6 పథకాలతో ప్రతి పేద కుటుంబానికి కొన్నంత భరోసా లభిస్తుందని దెందులూరు నియోజకవర్గం ఎన్.డి.ఎ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తెలిపారు.శుక్రవారం పెదవేగి మండలం రామసింగవరం, కూచింపూడి, న్యాయంపల్లి గ్రామాల్లో చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గ్రామ గ్రామాన చింతమనేనికి ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున మహిళలు భాగస్వామ్యం అయ్యారు.
పొలం పనులు చేస్తున్న రైతు కూలీలతో చింతమనేని ప్రభాకర్ ముఖా ముఖి ఈ సందర్భంగా
తాము ఎదుర్కొంటున్న సమస్యలు చింతమనేనికి చెప్పి రైతు కూలీలు వాపోయారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ
వైసిపి పాలనలో అభివృద్ధి నిలిచి పోయిందని, పరిపాలన చేతకాని జగన్ వల్ల రాష్ట్రం సర్వ నాశనం అయిందని, దాని ఫలితంగా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ లక్షలాది మంది పేదల కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
మీ బిడ్డలకు మెరుగైన విద్య ఉపాధి అవకాశాలు రావాలంటే టిడిపి కూటమి అధికారంలోకి రావాలని , బాబు సూపర్6 పథకాల ద్వారా పేద వర్గాల ప్రజలకు కొండంత భరోసా లభిస్తుందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటును సైకిల్ గుర్తు పై వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img