Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

పునరావాస కేంద్రాల కొనసాగింపు

జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

విశాలాంధ్ర – భీమవరం : వరద తాకిడికి గురైన లంక గ్రామాల్లో అవసరమైతే మరో రెండు రోజులు పాటు పునరావాస కేంద్రాల కొనసాగింపు జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.నరసాపురం, యలమంచిలి, ఆచంట మండలాల్లో 30 లోతట్టు గ్రామాలు ముంపునకు గురయ్యాయన్నారు. ఆయా గ్రామాల్లో 6,011 కుటుంబాలు ఉండగా, 18,306 మంది నివసిస్తున్నట్లు తెలిపారు. యలమంచిలి లో ఒకటి, ఆచంటలో 12 మొత్తం13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 124 మంది గర్భవతులను, 127 మంది పిల్లల తల్లులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు, 25 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 6,011 కుటుంబాలకు అవసరమైన నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాల్సి ఉండగా, నేటి వరకు 1,246 కుటుంబాలకు నిత్యవసర వస్తువులను అందజేయడం జరిగింది అన్నారు. మంగళవారం సాయంత్రం నాటికి ఒక్కొక్కరికి ఐదు కేజీలు చొప్పున 311.50 క్వింటాళ్ల బియ్యం, ప్రతి కుటుంబానికి ఒక్కొక్క కేజీ చొప్పున కందిపప్పు, పామాయిల్ ఒక లీటర్ చొప్పున ఒక్కొక్కటి 1,246 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే ఉల్లిపాయలు బంగాళదుంపలు, వంకాయలు ఒకటి కేజీ చొప్పున 686 కుటుంబాలకు, పచ్చిమిర్చి పావు కేజీ చొప్పున 172 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పశు దాణా 65 మెట్రిటన్నులు సేకరించి సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. ఇప్పటివరకు యలమంచిలి మండలంలో 25 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయడం పూర్తయింది అన్నారు. పెనుగొండ మండలంలో 12 మెట్టు టన్నులు, ఆచంట మండలంలో 28 మెట్రిక్ టన్నులు పశు దాణా పంపిణీ జరుగుతున్నట్లు ఆమె తెలిపారు. తణుకు మండలం దువ్వ గ్రామం లోని 44 కుటుంబాలకు ప్రత్యేక సాయం కింద రూ.87 వేలు అందజేయడం జరిగిందన్నారు. అగ్నిమాపక శాఖ నుండి 5 టీములను, 40 లైఫ్ జాకెట్స్ ను సిద్ధం చేయడం జరిగిందన్నారు. 15 ఇంజిన్ బోట్లను, 8 కంట్రీ బోట్లను మొత్తం 23 బోట్లను సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. శనివారం 50 వేల వాటర్ ప్యాకెట్లను, ఆదివారం 90 వేల వాటర్ ప్యాకెట్లను, సోమవారం 75 వేల వాటర్ ప్యాకెట్లను మొత్తం 2,15,000 వాటర్ ప్యాకెట్లను సరఫరా చేయడం జరిగిందనీ వెల్లడించారు. పాము కాటు కారణంగా ఒక దూడ చనిపోయిందని తెలిపారు. 292.52 కిలోమీటర్ల మేర రోడ్లు ఉపరితలం దెబ్బతిన్నాయని, వాటిలో స్టేట్ హైవేస్ 76.70 కిలోమీటర్లు, డిస్టిక్ హైవే స్ 214.82 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయన్నారు. భీమవరం డివిజన్ పరిధిలో అధిక వర్షాలు కారణంగా ఇప్పటివరకు మూడు గృహాలు పాక్షికంగా దెబ్బతీన్నాయన్నారు. అలాగే రెండు గుడిసెలు దెబ్బతిన్నాయని తెలిపారు. 121 గ్రామాల పరిధిలోని 158.82 హెక్టార్లలో వరి నారుమళ్లు, 1,963.12 హెక్టార్లలో వరి నాట్లు దెబ్బతిన్నాయని తెలిపారు. 48 రైతులకు సంబంధించి18 హెక్టార్లలో అరటి పంట, 154 రైతులకు సంబంధించి 57 హెక్టార్లలో కాయగూరల పంటలు, 85 రైతులకు సంబంధించి 25.50 హెక్టార్లలో తమలపాకు పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. ముంపు గురైన ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లను అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయన్నారు. బియ్యం, నూనె, నిత్యావసర వస్తువులు, మంచినీళ్ల ప్యాకెట్లు అందజేయడం జరుగుచున్నదన్నారు. ముఖ్యంగా వరద ముంపునకు గురై రాకపోకలు స్తంభించిన గ్రామాల ప్రజలకు బోట్ ల ద్వారా వెంటనే అందిస్తున్నామన్నారు. ప్రతీ కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వరద పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేవరకు అధికారులు, సిబ్బంది ప్రజలకు సేవలందించాలనీ ఆ ప్రకటనలో జిల్లా కలెక్టర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img