Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జగనన్న ఇళ్ల కాలనీలో ప్రజలకు బురద,ఇసుక నీరే వారికి తాగునీరు

కాలనీ లో సమస్యను తెలుసుకుంటున్న అధికారులు
విశాలాంధ్ర – ఉంగుటూరు ( ఏలూరు జిల్లా): ఉంగుటూరు మండలం యర్రమిల్లిపాడు జగనన్న ఇళ్ల కాలనీ వాసులకు కష్టాలతో బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించాలని ద్యేయం తో జగనన్న ఇళ్ల కాలనీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే అధికారుల మాత్రం ఆశించిన స్థాయిలో పనిచేయటం లేదు. కాలనీలో రూ.7 లక్షల నిధులతో తాగునీరు కోసం వేసిన బోరు పాడైపోయింది. బోరుకు సంబంధించి పైపులు నాసిరకం వేయడంతో బోరు లోపల పైపులు పగిలిపోయి బురద నీరు, ఇసుక వస్తుంది. దీంతో కాలనీవాసులు తాగునీరు కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కరించడం కోసం మండల నిధులనుండి మరో రూ.1 లక్ష 20 వేల తో 10 హెచ్ పి మోటార్ బిగించారు. ఇటీవల కురిసిన వర్షాలకు బోరు వద్ద మోటర్ దిగిపోవడం జరిగింది. కేవలం కేబుల్ వైరు పట్టుకుని ప్రమాద భరితంగా ఉంది. అయినా బురద నీరే వస్తుంది.పంట పొలాల్లో ఉన్న వ్యవసాయ బోర్ల దగ్గరికి వెళ్లి మంచినీరు తెచ్చుకుంటున్నారు. మంచినీరు కోసం పెట్టిన రూ.20 వేలు నిధులు బూడిద పాలయ్యాయి. ఈ విషయాన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వారు తాత్సర్యం చేస్తున్నారు. ఆ బోరు సంగతి వదిలేయండి మరో రూ.7 లక్షలతో కొత్త బోరు వేస్తామని ఆర్డబ్ల్యూఎస్ అధికారి ప్రజా ప్రతినిధికి చెప్పటం జరిగిందని తెలిసింది. అలాగే కాలనీ వాసులకు మూడు గజాల రోడ్డు మాత్రమే ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను సర్పంచ్ తమ్మిన శ్రీనివాస్ దృష్టికి కాలనీవాసులు తీసుకెళ్లడం జరిగింది. ఆయన పక్కన రైతుతో మాట్లాడి ఒక గజం బారున మూడు సెంట్లు స్థలం రైతు వద్ద నుండి తీసుకున్నాడు. స్థలం ఇచ్చిన రైతుకు ఆ స్థలానికి సంబంధించి డబ్బులు ఇవ్వకపోవడంతో రైతు రోడ్డుకు ఎంత స్థలం ఇచ్చాడో అక్కడ రాళ్లు పాతటం జరిగింది. కాలనీ వాసులకు ఇళ్ల నిర్మాణం కోసం వెళ్లే వాహనాలు వెళ్లడానికి ఇబ్బందిగా మారింది. జగనన్న కాలనీలో రెండు సమస్యలు ఉంటే అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు.జగనన్న కాలనీలో 37 ఇళ్ల స్థలాలు ఇచ్చారు వారిలో ఐదుగురు మాత్రమే ఇల్లు నిర్మించుకున్నారు. తాగునీరు, రోడ్డు సమస్య ఉండటంతో లబ్ధిదారులు ఎవరు ఇల్లు నిర్మించుకోవడానికి ముందుకు రావడం లేదు. కొందరు లబ్ధిదారులు బేస్మెంట్ వరకు నిర్మించుకుని అసంపూర్తిగా వదిలేశారు.
సర్పంచి వివరణ :
జగనన్న ఇళ్ల కాలనీలో
త్రాగునీరు, రోడ్డు సమస్య పై గ్రామ సర్పంచి తమ్మిన శ్రీనివాస్ ను వివరణ కోరగా ఆ రెండు సమస్యలు వాస్తవమేనన్నారు. ఈ విషయాన్ని ఇద్దరు అధికారులు దృష్టికి తీసుకెళ్లేనన్నారు.
తాగునీరు సమస్య పరిష్కరిస్తాం : అధికారులు
యర్రమిల్లిపాడు గ్రామములో జగనన్న ఇళ్ల కాలనీలో తాగునీరు, రోడ్డు సమస్య పరిష్కరిస్తామని అధికారులు కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. మంగళవారం అధికారులు కాలనీ వాసులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణం చేసుకొనే లబ్ధిదారులకు నీటి సమస్యలు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశామన్నారు. అలాగే రోడ్డు సమస్య కూడా పరిష్కరిస్తున్నామని అధికారులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు తాహసిల్దార్ ఏవి రమణారావు, ఆర్డబ్ల్యూఎస్ అధికారి సుబ్రహ్మణ్యం, హౌసింగ్ ఏ ఈ సురేష్, గ్రామ సర్పంచ్ తమ్మిన శ్రీనివాసు, పంచాయతీ కార్యదర్శి అల్లు సుధారాణి, ఆర్డబ్ల్యూఎస్ వర్క్ ఇన్స్పెక్టర్ జానీ, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img