Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

వరద ముంపును ఎదుర్కోవడానికి పటిష్ట చర్యలు

జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

విశాలాంధ్ర – భీమవరం : గోదావరి పరివాహాక ప్రాంత గ్రామాలలో వరద ముంపును ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.
శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వరద ప్రభావం ఉన్న 5 జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఐదు జిల్లాల కలెక్టర్లు వరద కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. పునరావాస కేంద్రాల నుండి తిరిగి వెళ్లే సమయంలో ఒక్కొక్క కుటుంబానికి రూ.2 వేలు, సింగిల్ గా ఉన్నవారికి ఒక వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చి పంపాలని ఆదేశించారు. అవసరమైన నిత్యవసర వస్తువులు, బియ్యం పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచాలన్నారు.ఈ సందర్భంలో జిల్లాలోని వరద పరిస్థితులు, తీసుకున్న చర్యలపై జిల్లా కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరిస్తూ వరద ప్రభావం ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో కలెక్టరేట్, డివిజన్, మండల హెడ్ క్వార్టర్స్ లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవసరమైతే రెస్క్యూ, పునరావాసం కోసం గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులను, సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. నేటికి ఎలాంటి నష్టం జరగలేదని, ఇళ్లు ముంపునకు కూడా గురికాలేదని తెలిపారు. యలమంచిలి మండలం కనగాయలంక గ్రామంలో వరద నీటితో కాజ్‌వే నీట మునిగిందని, రోజువారీ ప్రజా జీవితానికి ఇబ్బంది కలగకుండా వారి రవాణా కోసం మోటారు పడవలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని వశిష్ట గోదావరి కుడి ఒడ్డున కి.మీ 39.000 నుండి 90,000 కి.మీ వరకు వర్నబుల్ పాయింట్లను గుర్తించి పెట్రోలింగ్ కు నీటిపారుదల, నదీ పరిరక్షణ శాఖలను ఆదేశించడం జరిగిందన్నారు. యలమంచిలి, ఆచంట, నరసాపురం మండలాల్లో గోదావరి పరివాహక ప్రాంతానికి ఆనుకుని ఉన్న లంక గ్రామాల్లో అవసరమైన మోటార్ బోట్లు లైఫ్ జాకెట్లతో సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. లంక గ్రామాలకు అవసరమైన నిత్యావసర వస్తువులు కూడా సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. నరసాపురం డివిజన్లోని 34 గ్రామాలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నాయని, అయితే ప్రస్తుతం యలమంచిలి మండలంలోని కనగాయలంక, పెదలంక గ్రామాలు వరద ప్రభావానికి గురికావడం జరిగిందని తెలిపారు. ఈ రెండు గ్రామాల్లో 55 కుటుంబాలు ఉండగా, 125 మంది నివసిస్తున్నట్లు తెలిపారు. పునరావాస కార్యక్రమాల్లో భాగంగా124 మంది గర్భిణీ స్త్రీలను, 127 మంది పిల్లలను తల్లులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని, 22 మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఐదు కేజీలు చొప్పున బియ్యం, ప్రతి కుటుంబానికి ఒక్కొక్క కేజీ చొప్పున కందిపప్పు, పామ్ ఆయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ఒక లీటర్ పాలు, బిస్కెట్లు, రొట్టెలు పంపిణీకి సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. 5 ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ టీమ్స్, 40 లైఫ్ జాకెట్స్, మూడు బోట్స్ ను సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. భీమవరం డివిజన్లో అధిక వర్షాలు కారణంగా మూడు గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి జగన్ కి వివరించారు. అలాగే నరసాపురం పరిధిలోని 10 గ్రామాల్లో సుమారు 3,000 ఎకరాలు బ్యాక్ వాటర్ కారణంగా వరద ముంపుకు గురవుతున్నాయని, దీని నివారణకు ఫ్లడ్ బ్యాంక్స్ పటిష్టత కోసం, మరమ్మత్తుల కోసం 20 కోట్ల రూపాయల నిధులు మంజూరుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కు ప్రతిపాదనలను పంపడం జరిగిందన్నారు. ప్రస్తుతం నాలుగు ప్రాంతాల్లో స్లూయిజ్ లు, ఫ్లడ్ బ్యాంక్స్ అత్యవసర మరమత్తులకు రూ.63 లక్షలను మంజూరు చేయవలసిందిగా ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సూచించడం జరిగింది.వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, జిల్లా ఎస్ పి యు.రవి ప్రకాష్, జిల్లా రెవెన్యూ అధికారి కే.కృష్ణవేణి, డి.ఎల్.డి.ఓ కేసిహెచ్ అప్పారావు, జిల్లా నీటి వనరుల అధికారి సుబ్రహ్మణ్యేశ్వర రావు, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img