Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే వారిపై చర్య తీసుకోండి

ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భుజంగరావు

విశాలాంధ్ర- ఉంగుటూరు( ఏలూరు జిల్లా) : పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఉంగుటూరు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముప్పన భుజంగరావు అన్నారు. జర్నలిస్టుపై జరుగుతున్న దాడులకు నిరసనగా బుధవారం ఉంగుటూరు తాహసిల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఉంగుటూరు డిటి పోతురాజుకు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముప్పన భుజంగరావు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రజ్యోతి విలేఖరి గుత్తికొండ శ్రీనివాస్ని, ఆంధ్రప్రభ విలేకరి అర్జా బుల్లి స్వామి, పెండ్యాల రవి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img