Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వైసీపీ అరాచక పాలన అంతం కోసమే పొత్తు..

తేదేపా ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
జాలా బాలాజీ….

విశాలాంధ్ర ఏలూరు:వైసీపీ అరాచక అంతమొందించేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన
పొత్తు పెట్టుకున్నాయని టిడిపి ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ
పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మూడవ డివిజన్ టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలాజీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తొలి నుంచి రాష్ట్ర ప్రయోజనాల కోసమే పరితపిస్తోందన్నారు. అందుకే 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఖరితో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారన్నారు. ఇలాంటి దుర్మార్గపు పాలన పోవాలంటే మరోసారి 2014 పరిస్థితులు పునరావృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఈ ఆలోచనలతోనే బీజేపీతో కలిశారన్నారు. బిజెపితో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన మైనార్టీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 2014 నుంచి 2019 వరకు మైనార్టీల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో ప్రభుత్వం అంటే దోచుకో.. దాచుకో.. ప్రశ్నిస్తే అరెస్టు చేయి, లేదా దాడులకు పాల్పడండి అన్న చందంగా ఉందని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే మూడు పార్టీలు కలిశాయని, ప్రజలంతా ఈ పొత్తును స్వాగతిస్తున్నారన్నారు. ఈ మూడు పార్టీల పొత్తుతో రాబోవు ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలన అంతం కావడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి 3వ డివిజన్ అధ్యక్షులు చనపతి వెంకటరమణ, సరి పెల్లి పెద్ది రాజు, దేవతోటి శ్రీను, బోన్ లోకేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img