Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అంగన్‌వాడీలపై ఎస్మా

. అత్యవసర సర్వీసుల కింద జీవో 2 జారీ
. సమ్మెలు 6 నెలలు నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
. జీతాల్లో కోత విధిస్తూ అకౌంట్లలో జమ
. అరాచక పాలనకు పరాకాష్ఠ అంటూ విపక్షాల మండిపాటు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అంగన్‌వాడీల ఉద్యమంపై జగన్‌ సర్కారు ఉక్కుపాదం మోపింది. 26 రోజులుగా ఆందోళన చేస్తున్నా ఏమాత్రం పరిష్కారానికి ముందుకు రాని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన ఎస్మాను ప్రయోగించింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీల సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ చూపని రాష్ట్ర ప్రభుత్వం…ఉద్యమం అణచివేత కోసం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అంగన్‌వాడీల సమ్మెపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్‌వాడీలను అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొస్తూ జీవో నెంబర్‌ 2 విడుదల చేసింది. దీని ప్రకారం ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే… జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది. ఈ అవకాశాన్ని వైసీపీ ప్రభుత్వం ఉపయోగించుకుంటూ అంగన్‌వాడీల ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధపడిరది. మరోవైపు సమ్మె చేసిన కాలానికి అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. సుమారు రూ.3,450 తగ్గించి… రూ.8,050 వేతనాన్ని ఖాతాల్లో జమచేసింది. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. సీఎం జగన్‌ అరాచక పాలనకు ఇది పరాకాష్ట అంటూ మండిపడ్డాయి. తక్షణమే ఎస్మా ప్రయోగాన్ని ఉపసంహరించాలని, అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. లేనిపక్షంలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించాయి.
జగన్‌ నిరంకుశ వైఖరికి పరాకాష్ఠ: రామకృష్ణ్ణ
అంగన్‌వాడీల సమ్మెపై జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండిరచారు. అంగన్‌వాడీలు తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపకుండా సమ్మెపై ఎస్మా ప్రయోగించడం జగన్‌ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి పరాకాష్ఠ. సమ్మె కాలానికి సంబంధించిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించి, వేతనాలు తగ్గించి జమ చేయడం మరింత దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి ప్రజా సమస్యలను గాలికొదిలి, కేవలం రాజకీయాలకే పరిమితమయ్యారు. ఆందోళనలు చేపట్టిన కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలు మార్చినందువల్ల వైసీపీ గెలుపు అసాధ్యం. ఇకనైనా తన వైఖరి మార్చుకోకపోతే మరో మూడు నెలల తర్వాత ఇంటికెళ్లడం ఖాయమని రామకృష్ణ హెచ్చరించారు. తక్షణమే అంగన్‌వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగాన్ని విరమించి, సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషిచేయాలని హితవు పలికారు. ప్రజాతంత్రవాదులంతా రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఖండిరచాలని కోరారు.
అప్రజాస్వామికం: శ్రీనివాసరావు
అంగన్‌వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 2 జారీ చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్రంగా ఖండిరచారు. శాంతియుతంగా జరుగుతున్న అంగన్‌వాడీలను ఎస్మా చట్టపరిధిలోకి తీసుకువచ్చి సమ్మె నిషేధించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకుండా…సమ్మె కాలానికి వేతనాల్లో కోత విధించడం దుర్మార్గమని తెలిపారు. న్యాయబద్ధమైన సమ్మెను నిరంకుశ చర్యల ద్వారా విచ్ఛిన్నం చేయాలనుకోవడం అవివేకమన్నారు. కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తోందన్నారు. ఇదే వైఖరి కొనసాగితే జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
అమ్మనే గెంటేసినవాడికి…నారా లోకేష్‌
అమ్మనే గెంటేసిన వాడికి అంగన్‌వాడీల విలువ ఏమి తెలుస్తుందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా? అంగన్వాడీ ఉద్యమంపై సైకో సర్కార్‌ ఉక్కుపాదం మోపడం దారుణం. అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగం, సమ్మె కాలానికి వేతనంలో కోత పెట్టడం, జగన్‌ నియంత పోకడలకు పరాకాష్ఠగా పేర్కొన్నారు.
జగన్‌ అసమర్థ పాలనకు నిదర్శనం: కాంగ్రెస్‌
డిమాండ్ల సాధన కోసం ఆందోళనబాట పట్టిన అంగన్‌వాడీల సమస్యలకు పరిష్కారం చూపకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్‌ తీవ్రంగా ఖండిరచారు. జగన్‌ ప్రతిపక్షంలో ఉండగా అంగన్‌వాడీలకు అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా…అడిగితే ఉక్కుపాదం మోపుతున్నారని విమర్శించారు. అంగన్‌వాడీలపై నిర్బంధం సీఎం జగన్‌ అసమర్ధ పాలనకు నిదర్శనమని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img