Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

అవే వినతులు

ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ
ప్రత్యేక హోదా సహా ఇతర హామీల అమలు కోసం విజ్ఞాపన

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: దిల్లీ పర్యటనకు అకస్మాత్తుగా బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిసి గతంలో వలే మళ్లీ విభజనాంశాల అమలుపైనే విజ్ఞాపన పత్రం అందజేశారు. ఆంతరంగిక చర్చల సారాంశం బయటకు రానప్పటికీ, మీడియాకు మాత్రం విభజన హామీలు, ఏపీకి రావాల్సిన పెండిరగ్‌ నిధులు గురించి చర్చించినట్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. గురువారం రాత్రికి దిల్లీ చేరుకున్న సీఎం జగన్‌, శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో పార్లమెంటు హాలులో భేటీ అయ్యారు. తొలుత ప్రధానికి శాలువా కప్పి వెంకటేశ్వరస్వామి ప్రతిమను సీఎం బహూకరించారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై, తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపొనెంట్‌ వారీగా సీలింగ్‌ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించిందని, దీంతోపాటు ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తిచేయడానికి రూ.12,911కోట్ల నిధుల విడుదలకూ అంగీకరించిందని, ఈ రెండు అంశాలు కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయని, దీనిపై తక్షణమే దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి కోరారు. పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తిశాఖ పెండిరగ్‌లో ఉన్నందున, వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 2014 జూన్‌ నుంచి మూడేళ్లపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్‌కో విద్యుత్‌ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన రూ.7,230 కోట్ల బకాయిలు పెండిరగ్‌లో ఉన్నాయని, వెంటనే వీటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేకహోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా తద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పాడతాయి. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తున్నాం. ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారికి తగిన సహాయ సహకారాలు అందించాలని, విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం కర్నూలు హైస్పీడ్‌ కారిడార్‌ను వయా కడప మీదుగా బెంగుళూరు వరకూ పొడిగించాలని, దీనిపై తగిన పరిశీలనలు పూర్తిచేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని సీఎం కోరారు. కడప- పులివెందుల- ముదిగుబ్బ – సత్యసాయి ప్రశాంతి నిలయం- హిందూపూర్‌ కొత్త రైల్వేలైన్‌ను దీంట్లో భాగంగా చేపట్టాలని కోరిన సీఎం. ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందని సీఎం చెప్పారు. విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్‌ పార్లమెంటులోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండిరగ్‌ బకాయిల గురించి చర్చించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img