Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎస్సీ వర్గీకరణపై విచారణకు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం

సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వం

న్యూదిల్లీ : ఎస్సీ వర్గీకరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. దీనిపై విచారణ జరపడానికి చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారు. విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లకు సంబంధించి షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలలో ఉపకులాల వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా లేదా అనే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పంజాబ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌కు ఇతర పిటిషన్లను ధర్మాసనం జత చేసింది. అన్ని పిటిషన్లు ఒకేసారి విచారిస్తామని స్పష్టంచేసింది. ఎస్సీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ…అందులోనూ వాల్మీకి, మజాబీ సిక్కులకు ప్రాధాన్యత ఇస్తూ పంజాబ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన షెడ్యూల్డ్‌ కులాలు, వెనుకబడిన తరగతుల(రిజర్వేషన్స్‌ ఇన్‌ సర్వీస్‌) చట్టం 2006కు చట్టబద్ధతను రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తోంది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనంలో న్యాయమూర్తులు బీఆర్‌ గవాయ్‌, విక్రమ్‌నాథ్‌, బేలా ఎం త్రివేది, పంకజ్‌ మిత్తల్‌, మనోజ్‌ మిశ్రా, సతీశ్‌చంద్ర మిశ్రా సభ్యులుగా ఉన్నారు. పంజాబ్‌, హరియాణా హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పంజాబ్‌ ప్రభుత్వం 2010లో దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన పిటిషన్‌గా తీసుకొని…దీనికి మరో 23 పిటిషన్లు జతకలిపి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాల్మీకీలు, మజాబీ సిక్కులకు 50 శాతం ఎస్సీ రిజర్వేషన్‌ కల్పిస్తూ పంజాబ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఈవీ చిన్నయ్య వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో 2004లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఆ చట్టం ఉల్లంఘించిందని హైకోర్టు పేర్కొంది. షెడ్యూల్డ్‌ కులాలకు సంబంధించి ఉపకులాల వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14ను ఉల్లంఫించినట్లేనని చిన్నయ్య జడ్జిమెంట్‌ స్పష్టం చేసింది. ఎస్సీ వర్గీకరణ పిటిషన్‌పై పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ వివరించారు. విచారణలో భాగంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను రాజ్యాంగ ధర్మాసనం తెలుసుకుంటుంది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు రాజ్యాంగం అనుమతిస్తుందా? లేదా అన్నది రాజ్యాంగ ధర్మాసనం తేల్చనుంది. వర్గీకరణకు రాష్ట్రశాసనసభలు సిద్ధంగా ఉన్నాయా? రిజర్వేషన్లకు సంబంధించి అసమానతలు తొలగించడానికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటి వంటి వివరాలను ధర్మాసనం తెలుసుకోనుంది. గతంలో ఏపీ కల్పించిన వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. అయితే వర్గీకరణకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాలని నాడు యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉషా మెహ్రా కమిషన్‌ అభిప్రాయపడిరది. ఉషా మెహ్రా కమిషన్‌ సిఫార్సులను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం అధ్వర్యంలో ఇప్పటికే ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. కమిటీలో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా కేంద్రం నియమించింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు రాజ్యాంగం అనుమతిస్తుందా? లేదా అన్నది రాజ్యాంగ ధర్మాసనం తేల్చనుంది. వర్గీకరణకు రాష్ట్రశాసనసభలు సిద్ధంగా ఉన్నాయా?. రిజర్వేషన్లకు సంబంధించి అసమానతలు తొలగించడానికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటి? వంటి వివరాలను ధర్మాసనం తెలుసుకోనుంది. కాగా, అంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఎస్సీ వర్గీకరణ కోసం నాలుగు దశాబ్దాలుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఈ సమస్య మళ్లీ వివాదంలో పడిరది. ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణకు తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు మంద కృష్ణ మాదిగ కూడా హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img