Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏపీ సర్కార్‌ భారీ అప్పు

. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన రెండో రోజే…
. ఆర్‌బీఐలో బాండ్ల వేలం ద్వారా రూ.4 వేల కోట్ల రుణం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అప్పులు చేయడంలో ప్రసిద్ధి చెందిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా ఏమాత్రం వెనుకాడడం లేదు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన రెండో రోజే భారీస్థాయిలో ఒకేసారి 4 వేల కోట్ల రూపా యల అప్పు చేసింది. ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం పెన్షన్ల పంపిణీ కోసం నిధులు లేక పోవ డంతో రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తలుపు తట్టింది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ.4 వేల కోట్ల రుణం తీసుకుంది. ఆర్థిక సంవ త్సరం ప్రారంభమైన రెండో రోజే జగన్‌ సర్కార్‌ అప్పులతో ఖాతా తెరిచిందంటే రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకో వచ్చు. తాజాగా సేకరించిన రుణంలో రూ.1,000 కోట్లను 7.46 శాతం వడ్డీతో 17 సంవత్సరాలకు చెల్లించేలా, మరో రూ.1000 కోట్ల మొత్తాన్ని 7.46 శాతం వడ్డీతో 19 సంవత్సరాల్లో, ఇంకో రూ.1,000 కోట్లు 7.46 శాతం వడ్డీతో 20 సంవత్సరాల్లో చెల్లించేలా రుణం తీసుకుంది. అలాగే రూ.500 కోట్లు 7.39 శాతం వడ్డీతో 6 సంవత్సరాలకు, మిగిలిన రూ.500 కోట్లు 7.46 శాతంతో 18 సంవత్సరాల్లో చెల్లింపులు చేసేలా అప్పు తీసుకుంది. మొత్తానికి ఈ అప్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. ఎన్నికల కోడ్‌ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీకి అనుకూలమైన కాంట్రాక్టర్లకు మార్చి నెలలో దాదాపు రూ.15 వేల కోట్లు సర్దుబాటు చేసింది. దీంతో పెన్షన్లకు డబ్బుల్లేని పరిస్థితి ఏర్పడిరది. అయితే కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటికీ పెన్షన్ల కోసం అప్పు తీసుకొచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటూ ఆర్‌బీఐని ఆశ్రయించింది. మంగళవారం సాయంత్రానికి ఆ నిధులు రాష్ట్ర ఖజానాలో జమ కావడంతో వాటిని డ్రా చేసి, సచివాలయం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లకు ప్రభుత్వం పంపే ఏర్పాట్లు చేపట్టింది. బుధవారం ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేపడుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img