: సీరం సంస్థ
జూలై నాటికి పది కోట్ల టీకాలు ఉత్పత్తి చేస్తామన్న లక్ష్యాన్ని అందుకున్నట్లు ఓ మీడియా సంస్థతో సీరం సంస్థ వెల్లడిరచింది. ఈ నెలలో సుమారు 11.1 కోట్ల కోవీషీల్డ్ కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేయనున్నట్లు ఆ సంస్థ వెల్లడిరచింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ టీకాల కొరత ఉన్న విషయం తెలిసిందే. దిల్లీలో కోవీషీల్డ్ టీకాలకు తీవ్ర కొరత ఉంది. స్టాక్‌లు లేకపోవడం వల్ల నగరంలోని అనేక ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేశారు. ఈ నేపథ్యంలో జూలై నాటికి పది కోట్ల టీకాలు ఉత్పత్తి చేస్తామన్న లక్ష్యాన్ని చేరుకున్నట్లు ప్రకటించింది. అలాగే ఉత్పత్తి వేగాన్ని పెంచినట్లు తెలిపింది.