Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గందరగోళం

ఎవరి పాట వారిదే

వైసీపీ వన్స్‌మోర్‌ అంటున్న కొన్ని సంస్థలు
ఎన్డీఏ కూటమిదే పీఠమంటూ మరికొన్ని సంస్థలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎగ్జిట్‌ పోల్స్‌ గందరగోళం సృష్టించాయి. వాటి కోసం పోలింగ్‌ ముగిసిన దగ్గర నుంచి తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూసిన రాజకీయపార్టీల నేతలకు, రాష్ట్ర ప్రజలకు నిరాశే ఎదురైంది. కొన్ని సంస్థలు వైసీపీ మరలా విజయ దుందుభి మోగిస్తుందని ప్రకటించగా… మరికొన్ని సంస్థలు ఎన్డీఏ కూటమిదే పీఠమంటూ ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడిరచాయి. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే దానిపై స్పష్టత రాక గందరగోళం నెలకొంది. పార్టీల విజయావకాశాలపై ఉత్కంఠ మరో మూడు రోజులు కొనసాగే పరిస్థితులు ఏర్పడ్డాయి. వివిధ మీడియా హౌస్‌లు, సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి, వాటిని క్రోడీకరించి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో అంచనా వేశాయి. మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా అత్యధికంగా 82.37శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 46 మంది పోటీలో ఉండగా, అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నుంచి అత్యల్పంగా ఆరుగురు మాత్రమే పోటీలో నిలిచారు. మంగళగిరిలో నారా లోకేశ్‌ సహా 40 మంది బరిలో ఉన్నారు. కుప్పం నుంచి చంద్రబాబు సహా 13 మంది, పిఠాపురం అసెంబ్లీ బరిలో పవన్‌ సహా 13 మంది పోటీ చేశారు. పులివెందుల నియోజకవర్గంలో జగన్‌ సహా 27 మంది పోటీలో నిలిచారు. మొత్తానికి భారీ పోలింగ్‌కు తగినట్లుగానే ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడ్డాయి. సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించి మళ్లీ అధికారంలోకి రానుందని కొన్ని సంస్థలు తేల్చాయి. నవరత్నాల పేరుతో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఎన్నికల మేనిఫెస్టోను 99శాతం అమలు చేయడం, వలంటీర్‌, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో పాలన ప్రజల ముంగిటకు తీసుకురావడం, విద్య, వైద్య రంగాల్లో నాడు`నేడు అమలు, వ్యవసాయరంగంలో ఆర్బీకే కేంద్రాలు వంటి విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన జగన్‌ ప్రభుత్వానికే మరోసారి జనం జై కొట్టనున్నారని ఆరా సంస్థ తేల్చింది. 94 నుంచి 104 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలవబోతుందని ఆరా మస్తాన్‌ తెలిపారు. అలాగే 13-15 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ గెలవబోతుందని ఆరా అంచనా వేసింది. కడప కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్‌ షర్మిలకు డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదని ఆరా మస్తాన్‌ తేల్చేశారు. పులివెందులలో జగన్‌, కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్‌, పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌, తెనాలిలో నాదెండ్ల మనోహర్‌, ఉండిలో రఘురామకృష్ణరాజు, హిందూపురంలో బాలకృష్ణ, టెక్కలిలో అచ్చెన్నాయుడు విజయం సాధిస్తున్నట్లు వెల్లడిరచారు. ఇక మరికొన్ని సంస్థలు ఎన్డీఏ కూటమి భారీ సీట్లతో విజయం సాధించబోతున్నట్లు ప్రకటించాయి. ఇందుకు అనేక కారణాలను విశ్లేషించాయి. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని, అభివృద్ధి జాడ లేదని యువత వ్యతిరేకంగా ఉన్నట్లు గుర్తించారు. ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలవడంతో దానికి అనుబంధ రంగాల్లో పనిచేసే కార్మికులు ప్రభుత్వం తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. అలాగే మద్యం ధరలు పక్క రాష్ట్రాల కంటే అధికంగా ఉండటం, సరైన బ్రాండ్లు దొరకకపోవడంతో మందు బాబుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. డీఏ, పీఆర్సీ బకాయిలు చెల్లించకపోవడం, జీతాల చెల్లింపులో ఆలస్యం కావడం, పదవీ విరమణ ప్రయోజనాలు సకాలంలో దక్కకపోవడం వంటి కారణాలతో ఉద్యోగులు దూరమయ్యారు. వైసీపీ కంటే ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టో పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే రూ.4వేల పెన్షన్‌ చెల్లింపు, అవి కూడా ఏప్రిల్‌ నుంచే చెల్లిస్తానని హామీ ఇవ్వడం, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలెండర్లు ఉచితంగా పంపిణీ చేయడం వంటి అంశాలు ఆకర్షించినట్లు సంస్థలు పేర్కొన్నాయి. అన్నింటికంటే వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరుతో భూములు లాక్కుంటుందని ఎన్డీఏ కూటమి నేతలు చేసిన విస్తృత ప్రచారంపై ఓటర్లలో ఆందోళన వ్యక్తమైందని, ఇటువంటి మరికొన్ని కారణాలతో ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత కూటమి విజయానికి కారణాలుగా ఆయా సంస్థలు పేర్కొన్నాయి.

టీడీపీ కూటమి అనుకూల సంస్థలు

సంస్థ టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ ఇతరులు
పీపుల్స్‌ పల్స్‌ 95110 4560 1420 2 5 కేకే సర్వేస్‌ 133 14 21 7
చాణక్య స్ట్రాటజీస్‌ 114-125 39-49 0-1
పయనీర్‌ 144 31 రైజ్‌జి 113-122 48-60 0-1 జనగళం 113-122 48-60 0-1 పల్స్‌టుడే 125 50

వైసీపీ అనుకూల సంస్థలు

సంస్థ వైసీపీ టీడీపీ కూటమి
ఆరా సంస్థ సర్వే 94104 7181
ఆత్మసాక్షి 98-116 59-77
రేస్‌ సంస్థ సర్వే 117-120 48-50
పోల్‌ స్ట్రాటజీ గ్రూప్‌ 115-125 50-60
ఆపరేషన్‌ చాణక్య 95-102 64-68
చాణక్య పార్థదాస్‌ 110-120 55-65
జన్‌మత్‌ 95-103 67-75

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img