Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

జగన్‌ను సాగనంపుదాం

పొదిలి సభలో చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – ఒంగోలు: రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన సైకో ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఒంగోలు జిల్లా పొదిలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. గడిచిన ఐదేళ్లలో సైకో జగన్‌ ప్రభుత్వం… రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెట్టి కోట్ల రూపాయలు దోచుకోవడంపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. మాయమాటలు చెబుతూ మరో అవకాశం కోసం మీ వద్దకు వస్తున్నాడని, ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో జగన్‌కు బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అమ్మ, చెల్లిని చూడనివారు రాష్ట్ర ప్రజలను చూస్తాడా అని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో జనాన్ని మోసం చేసి మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖపట్నం నుంచి పాలన కొనసాగిస్తానని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. 2019 ఎన్నికల ముందు వివేకానందరెడ్డి హత్య , కోడికత్తి వంటి నాటకాలు ఆడి ప్రజలను మోసం చేసి సానుభూతితో ఓట్లు పొందారని, మరోసారి గులకరాళ్లతో కొట్టించుకొని ఓట్లు పొందాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే వృద్ధులకు ఇంటివద్దనే రూ.4వేలు పింఛన్‌ ఇస్తామని, వలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని, మహిళలకు మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధితో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం టీడీపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
నెల్లూరులో బాబు, పవన్‌ రోడ్‌షో
చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ నెల్లూరులో రోడ్‌షో నిర్వహించారు. రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని కేవీఆర్‌ పెట్రోల్‌ బంకు నుంచి ప్రారంభమైన రోడ్‌ షో ఆర్టీసీ బస్‌ స్టేషన్‌, మద్రాస్‌ బస్టాండ్‌, వీఆర్సీ సెంటర్‌, గాంధీ బొమ్మ, ఏసీ సెంటర్‌ మీదుగా నర్తకి సెంటర్‌కు చేరుకుంది. వీరితో పాటు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, సిటీ, రూరల్‌ అసెంబ్లీ అభ్యర్థులు పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి కూడా ప్రచార రథంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img