Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

జనసేనకునిరసన సెగ

. కాకినాడ రూరల్‌ మహిళా నేత సరోజ రాజీనామా
. వల్లభనేని బాలశౌరికి షాక్‌
. మచిలీపట్నం ఎంపీ సీటుపై మౌనం
. విజయవాడ పశ్చిమలో ‘పోతిన’ తిరుగుబావుటా

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: జనసేన పార్టీ జాబితా విడుదలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 18 మంది అసెంబ్లీ అభ్యర్థులతో జనసేన జాబితా విడుదల చేయగా, అందులో మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిత్వంపై ఎక్కడా ప్రస్తావించలేదు. ఎన్డీయే కూటమి భాగస్వామ్యమైన బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. అందులో భాగంగా ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో తొలుత జనసేనకు 24 అసెంబ్లీలు, మూడు లోక్‌సభ స్థానాలను టీడీపీ కేటాయించింది. అనంతరం బీజేపీతో పొత్తు ఖరారయ్యాక, జనసేనకు 21 అసెంబ్లీలు, రెండు లోక్‌సభ స్థానాలకు కుదించుకుపోయాయి. ఆ రెండు పార్లమెంట్‌ స్థానాల్లో మచిలీపట్నం, కాకినాడ నుంచి జనసేన పోటీ చేస్తుందని పవన్‌ ఆర్భాటంగా ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన జాబితాలో కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ అభ్యర్థిత్వాన్ని ఇటీవలే ప్రకటించామని జనసేన తన జాబితాలో గుర్తుచేసింది. అదే సమయంలో మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వల్లభనేని బాలశౌరి పేరుపై మౌనం వహించింది. దీంతో జనసేన మచిలీపట్నం పార్లమెంట్‌ను కూడా వదులకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణను టీడీపీ బరిలోకి దించితే, బాలశౌరి అవనిగడ్డ అసెంబ్లీ నుంచి పోటీకి దిగే అవకాశాలున్నాయి. చివరి క్షణంలో పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీని విరమించుకుని, కాకినాడ లేదా మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న ప్రచారముంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మచిలీపట్నం పేరును ఖరారు చేయలేదని సమాచారం. అందుకు నిదర్శనంగా అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉందని తెలిపి, మచిలీపట్నం లోక్‌సభ స్థానంపై మౌనం వహించారు.
వైసీపీ మచిలీపట్నం లోక్‌సభ సీటును వల్లభనేని బాలశౌరికి నిరాకరించింది. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆయనకు మచిలీపట్నం లోక్‌సభ సీటు జనసేన నుంచి వస్తుందని ఆశించారు. జనసేన అభ్యర్థుల జాబితాలో ఎక్కడా ఆయన ప్రస్తావన లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా విజయవాడ పశ్చిమ స్థానంపైనా స్పష్టతలేదు. విజయవాడ పశ్చిమ స్థానం బీజేపీకి కేటాయిస్తారన్న సమాచారంతో జనసేన నేత పోతిన వెంకట మహేశ్‌ ఆయన వర్గం ఆందోళనకు దిగుతోంది. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీకి కష్టపడి పనిచేసిన పోతినకు టికెట్‌ విషయంలో మొండిచేయి చూపుతున్నారని, అవసరమైతే రెబల్‌ అభ్యర్థిగా పోటీలోకి దిగుతామని ఆయన చెబుతున్నారు. తాను పవన్‌ను మూడుసార్లు కలిసినప్పటికీ, టికెట్‌ విషయంపై స్పష్టత ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను స్థానికుడినని, ఎంతోకాలంగా స్థానిక సమస్యలపై పోరాటం చేశానని పేర్కొన్నారు. అటు కాకినాడ రూరల్‌ నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకురాలు పోతల సరోజ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను బీసీని కాబట్టే టికెట్‌ ఇవ్వలేదని వాపోయారు. జనసేన నాయకుడు నాందెడ్ల మనోహర్‌ టీడీపీకి కోవర్ట్‌గా మారారంటూ మండిపడ్డారు. పార్టీని నాదెండ్ల మనోహర్‌ సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img