Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

దిల్లీ చుట్టూ చక్కర్లు

నిన్న చంద్రబాబు…నేడు జగన్‌, పవన్‌

. బీజేపీతో అధికార, అనధికార పొత్తుల కోసం వెంపర్లాట
. ఏపీ రాజకీయాలను శాసిస్తున్న కమలనాథులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో ఒక్కశాతం ఓటింగ్‌ కూడా లేని కమలనాథులు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. మళ్లీ అధికారం తమదేనని బల్లగుద్ది చెబుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, అధికారపార్టీని మట్టి కరిపిస్తామని చెపుతున్న టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ పెద్దల ఆశీస్సుల కోసం తహతహలాడుతున్నారు. ఏపీలో అధికారంలోకి రావడానికి బీజేపీ సహకారం ఏమాత్రం అవసరం లేనప్పటికీ ఈ మూడు ప్రధాన పార్టీలు కమలం పార్టీతో అధికార, అనధికార పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే జనసేన పార్టీ ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉంది. దీంతో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర ఎన్నికల్లో తనతోపాటు బీజేపీని కూడా కలుపుకుపోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు కొంతకాలంగా సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి టీడీపీ శ్రేణులు బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనాసక్తత కనబరుస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి ముఖ్యనేతలు తీసుకెళ్లారు. అవసరమైతే ఎన్నికల తర్వాత ఎన్డీయే కూటమికి మద్దతు ఇద్దామని, సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులను కలుపుకుపోదామని సూచిస్తున్నారు. పదేళ్లుగా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టం జరుగుతుందని వారు బలంగా నమ్ముతున్నారు. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా జనసేన అధినేతను ప్రయోగించి చంద్రబాబుపై పొత్తుకు ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే బుధవారం చంద్రబాబు దిల్లీ వెళ్లారు. అమిత్‌షా, నడ్డాతో భేటీ అయ్యారు. ఈ భేటీ సారాంశం గురించి రెండు పార్టీల నేతలు బహిరంగంగా వెల్లడిరచకపోయినప్పటికీ… ఎన్నికల పొత్తులపైనే వీరి మధ్య చర్చ జరిగినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు దిల్లీ నుంచి తిరిగి రాగానే పవన్‌కల్యాణ్‌కు చర్చల సారాంశాన్ని తెలియజేశారు. అయితే ఎన్నికల పొత్తుల వ్యవహారంలో బీజేపీ దూకుడుని తగ్గించే ప్రయత్నంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్‌ కల్యాణ్‌ కూడా దిల్లీ పెద్దలను కలిసేందుకు హూటాహుటిన హస్తిన చేరుకున్నారు. ఇక సింహం సింగిల్‌గానే వస్తుందని, తమకు ఏ పార్టీతోనూ ఎన్నికల పొత్తులు ఉండవని పదేపదే చెపుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఐదేళ్లుగా మోదీ జపం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఎటువంటి వివాదాస్పద బిల్లు ప్రవేశపెట్టినా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల కంటే వైసీపీ ఎంపీలే ముందుగా జై కొడుతున్న విషయం తెలిసిందే. అలాగే ప్రత్యేక హోదాతో పాటు పెండిరగ్‌లో ఉన్న విభజన అంశాల్లో ఏ ఒక్కటీ వైసీపీ సాధించలేకపోయింది. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి పూర్తిగా తాకట్టుపెట్టిన వైసీపీ… ఆంతరంగికంగా బీజేపీతో అంటకాగుతోంది. ప్రస్తుతం అదే సహకారాన్ని దిల్లీ పెద్దల నుంచి కోరుకుంటోంది. అందుకోసమే చంద్రబాబు హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ అయిన 24 గంటల్లోపే రాష్ట్ర సమస్యల పరిష్కారం పేరుతో వైసీపీ అధినేత, సీఎం జగన్‌ దిల్లీ బయలుదేరి వెళ్లారన్న విమర్శలు వినపడుతున్నాయి. మొత్తానికి ఈ మూడు పార్టీల అధినేతలు బయటకు ఏమి చెప్పినా…రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీ పెద్దల ఒత్తిడికి తలొగ్గుతున్న విషయం బహిరంగ రహస్యం. అందుకే రాష్ట్రంలో ఈ మూడు పార్టీల గెలుపు, ఓటములను శాసించలేని కమలనాథుల ఆశీస్సుల కోసం దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img