Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నూతన సీఎస్‌గానీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌

బాధ్యతల స్వీకరణ తర్వాత గవర్నర్‌తో భేటీ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీఎస్‌గా ఉన్న జవహర్‌ రెడ్డి సెలవుపై వెళ్లగా, నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ను సీిఎస్‌గా నియమిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన వెలగపూడి రాష్ట్ర సచివాలయంలోని సీఎస్‌ చాంబరులో టీటీడీ వేద పండితులు, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాల వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సీిఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ తనకు సీిఎస్‌గా పనిచేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సహచర కార్యదర్శులు, శాఖాధిపతులు, ఇతర అధికారులు, సిబ్బంది సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేసి వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో మరింత సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జీఏడీ కార్యదర్శి సురేశ్‌ కుమార్‌, స్పెషల్‌ సీిఎస్‌లు గోపాల కృష్ణ ద్వివేది, రజత్‌ భార్గవ, కె.విజయానంద్‌, వై.మధుసూదన్‌ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు కె.సునీత, ప్రవీణ్‌ ప్రకాశ్‌, ప్రద్యుమ్న, ఐటీ కార్యదర్శి

కె.శశిధర్‌, వీసర్వీసెస్‌ శాఖ కార్యదర్శి పి.భాస్కర్‌, గనుల శాఖ కార్యదర్శి శ్రీధర్‌, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌, హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ, స్పెషల్‌ సెక్రటరి డా.చలపతి రావు తదితరులు పాల్గొని సీఎస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉద్యోగ ప్రస్ధానం
బీటెక్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేసి 1987 ఐఏఎస్‌ బ్యాచ్‌కు ఎంపికయిన నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ తొలుత 1988లో పశ్చిమ గోదావరి జిల్లాలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ (ట్రయినీగా) ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 1990లో తూర్పు గోదావరి సబ్‌ కలెక్టర్‌గా, రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌గా, 1991లో ఏటూరు నాగారం పీవో ఐటీడీఏగా, 1992లో కృష్ణా జిల్లా పీడీ డీఆర్డీఏగాను పని చేశారు. 1993లో కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, 1996లో ఖమ్మం కలెక్టర్‌గా, 1998లో చిత్తూరు కలెక్టర్‌గా పని చేశారు. 1999లో యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ శాప్‌ ఎండీగాి పనిచేసి 2000 ఏడాదిలో కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. 2005లో రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ వీసీి అండ్‌ ఎండీగాి, 2007లో పరిశ్రమల శాఖ కమిషనర్‌గా, 2009లో మత్స్యశాఖ కమిషనర్‌గా పని చేశారు. అదే విధంగా 2012లో రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి సంస్థ కమిషనర్‌గా, రాష్ట్ర విభజన అనంతరం 2014లో జీఏడీ ముఖ్య కార్యదర్శిగా, 2015లో వైఏటీసీి ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2017లో కార్మిక ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా, 2018లో ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, 2019లో రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. అనంతరం 2019 నవంబరు నుంచి చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌) గా పని చేసి, 2022 ఫిబ్రవరి 23 నుంచి రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తూ, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img