Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

పదేళ్లయినా చార్జిషీట్లు వేయరా?

ఎంపీ, ఎమ్మెల్యేల కేసులపై సుప్రీం ఆగ్రహం
ఈడీ, సీబీఐ దర్యాప్తు తీరుపై అసహనం
కేసుల ఉపసంహరణ అధికారం రాష్ట్రాలదే…
అయినా హైకోర్టులు పరిశీలించాల్సిందేనని వ్యాఖ్య
మానవవనరులు, మౌలిక సదుపాయాలపై అసంతృప్తి

న్యూదిల్లీ : ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు అహసనం వ్యక్తం చేసింది. చాలా కేసుల్లో కనీసం చార్జిషీట్లు దాఖలు చేయకపోవ డానికి గల కారణాలు చెప్పలేని దర్యాప్తు సంస్థలు`ఈడీ, సీబీఐ తీరుపై అసంతృప్తి తెలిపింది. మనీలాండరింగ్‌ వంటి కేసుల్లో చార్జిషీట్లు లేకుండా కేవలం ఆస్తులు జప్తు చేస్తే ఏమి ప్రయోజనమని సూటిగా ప్రశ్నించింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల స్థితిగతులపై అమికస్‌ క్యూరీగా ఉన్న సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియా తాజాగా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు. మనీలాండరింగ్‌ కేసుల్లో 51 మంది ఎంపీలు, 71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిందితులుగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టుల్లో 151 కేసులు పెండిరగ్‌లో ఉన్నాయని నివేదిక తెలిపింది. 58 పెండిరగ్‌ కేసుల్లో జీవితఖైదు

పడే అవకాశముందని పేర్కొంది. 45 కేసుల్లో అభియో గాలు నమోదు కాలేదని వెల్లడిరచింది. ఈ నివేదికను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దర్యాప్తు సంస్థల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది చాలా విచారకరమని వ్యాఖ్యానించింది. నివేదిక అసంపూర్తిగా ఉందని, 10-15 ఏళ్ల కిందటి కేసుల్లోనూ కనీసం అభియోగాలు నమోదు చేయలేదని ఆగ్రహం వెలి బుచ్చింది. చార్జిషీటు దాఖలు చేయకపోవడానికి కారణాలు కూడా చెప్పలేదని తెలిపింది. వాస్తవంగా తాము దర్యాప్తు సంస్థలను నిలదీయడం లేదని, న్యాయమూర్తుల లాగా వారికీ అధిక భారం ఉందని పేర్కొంది. అందుకే సంయమనం పాటిస్తున్నామని చెప్పింది. చాలా మనీలాండరింగ్‌ కేసుల్లో ఈడీ కేవలం ఆస్తులు జప్తు చేయడం మినహా ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదని, చార్జిషీట్లు లేకుండా ఆస్తులు స్వాధీనం చేసు కుంటే ప్రయోజనమేమిటని ధర్మాసనం నిలదీసింది. దీనికి సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సమాధాన మిస్తూ చాలా కేసుల్లో దర్యాప్తులపై హైకోర్టులు స్టే విధించాయని, అందుకే ఆలస్యమవుతున్నాయన్నారు. సొలిసిటర్‌ జనరల్‌ సమాధానం పట్ల సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. కేవలం 8 కేసుల్లో మాత్రమే కోర్టుల నుంచి స్టే ఉత్తర్వులు ఉన్నాయన్నారు. పెండిరగ్‌ కేసులు వదిలేయడం సరికాదని, కనీసం చార్జిషీట్లయినా దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కేసుల విచారణలో మానవ వనరుల కొరత కూడా ప్రధాన సమస్యగా మారిం దని జస్టిస్‌ ఎన్‌వీ రమణ అభిప్రాయపడ్డారు. జడ్జిల సంఖ్య, మౌలిక సదుపాయాలు సమస్యగా మారుతున్నా యని చెప్పారు. దీన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తామని తెలిపారు.
చట్టప్రకారం క్రిమినల్‌ కేసులు ఉపసంహరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, అలాంటి కేసుల ఉపసంహరణకు తాము వ్యతిరేకం కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. అదేసమయంలో ఆ కేసులను హైకోర్టులు సంబంధిత హైకోర్టులు పరిశీలించాల్సి ఉందని చెప్పింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై నమోదైన కేసుల దర్యాప్తు, విచారణలో జాప్యంపై అసహనం వ్యక్తం చేసింది. ఇందుకుగాను మానవ వనరులు, ప్రాతిపదిక సదు పాయాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దర్యాప్తు సంస్థల నైతికకతను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని తెలిపింది. 200 కేసులు పెండిరగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ అసంపూర్తిగా ఉన్నాయని చెప్పడానికి విచారిస్తు న్నామని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. తీవ్ర నేరాల కేసుల్లో శిక్షపడిన ప్రజా ప్రతినిధులపై ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితాంతం నిషేధం విధించాలని, పెండిరగ్‌ కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరుతూ న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img