Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తాం

. సిబీఐ ఛార్జిషీటులో వైఎస్‌ పేరు కాంగ్రెస్‌ చేర్చలేదు
. బీజేపీ కనుసన్నల్లో ఏపీ పాలన
. కడప సభలో రాహుల్‌గాంధీ

విశాలాంధ్ర బ్యూరో`కడప: ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని, పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామని, కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మిస్తామని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ చార్జిషీటులో కాంగ్రెస్‌ పెట్టలేదని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిలారెడ్డి, అసెంబ్లీ అభ్యర్థులకు మద్దతుగా శనివారం పుత్తా ఎస్టేట్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు. అంతకుముందు ఆయన ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు.
రాహుల్‌గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్‌, వైఎస్సార్‌ ఒక్కటే అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వైఎస్సార్‌ ఆలోచనలకు వ్యతిరేకం కాదన్నారు. వైఎస్సార్‌ బిడ్డ, తన చెల్లెలు షర్మిలారెడ్డి మీ ముందు నిలబడిరదని, తన చెల్లిని పార్లమెంటుకు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌ సైద్ధాంతిక విలువలు షర్మిలలో ఉన్నాయన్నారు. రాష్ట్ర హక్కులు దిల్లీలో వినపడాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్నారు. విభజన హామీలను బీజేపీ ఒక్కటీ అమలు చేయలేదని రాహుల్‌ విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి సర్కారు నడుస్తోందని ఆరోపించారు. 2014లో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వచ్చి వుంటే అన్ని హామీలు అమలయ్యేవన్నారు. 2024లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి వాగ్దానం అమలు చేస్తామన్నారు. వైఎస్సార్‌ దేశానికి మార్గదర్శకుడన్నారు. ఆయన పాదయాత్ర తనకు ఆదర్శమన్నారు. ఆయన ఆదర్శంతోనే జోడో యాత్ర చేశానన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుస్తాయన్నారు. భారత్‌ జోడో ద్వారా దేశపు వీధుల్లో తిరిగానన్నారు. సామాజిక న్యాయం కోసం వైఎస్సార్‌ రాజకీయం చేశాడన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ బీటీమ్‌ నడిపిస్తోందని ఆరోపించారు. బీజేపీ అంటే బాబు, జగన్‌, పవన్‌ అని, వీళ్ల రిమోట్‌ ప్రధాని మోదీ చేతుల్లో ఉందన్నారు. మోదీ చేతిలో సీబీఐ, ఈడీ ఉండటంతో ఆ ముగ్గురు మౌనం దాల్చారన్నారు. వైఎస్సార్‌ సిద్ధాంతం కాంగ్రెస్‌ సిద్దాంతమని, అదే బీజేపీ వ్యతిరేక సిద్ధాంతమన్నారు. కానీ జగన్‌ అందుకు భిన్నంగా బీజేపీతో చెలిమిచేస్తున్నారని ఆరోపించారు. తమ అవినీతి బయటపడుతుందనే భయంతోనే జగన్‌, చంద్రబాబు నోరు విప్పడం లేదన్నారు. రాజ్యాంగ పరిరక్షణ ఇండియా కూటమి లక్ష్యమన్నారు. రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడానికి ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేసి తీరతామన్నారు. రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని, నిరుపేదలకు రూ.5 లక్షలతో పక్కా ఇళ్లు కట్టిస్తామన్నారు. 2.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పేదమహిళను ఎంపిక చేసి, ఆ మహిళ బ్యాంక్‌ ఖాతాలో లక్ష రూపాయలు ఏడాదికి ఇస్తామన్నారు.
షర్మిలారెడ్డి మాట్లాడుతూ మోదీ పదేళ్ల కాలంలో విభజన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. బీజేపీ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిందన్నారు. అలాంటి బీజేపీతో బాబు పొత్తు పెట్టుకోగా… జగన్‌ తొత్తుగా మారారన్నారు. విభజన హామీలు నెరవేర్చని బీజేపీతో ఎలా పొత్తు పెట్టుకుంటారని ఆమె ప్రశ్నించారు. అందరికి రాజధానులు ఉన్నాయని, మనకు చేతిలో చిప్ప, నెత్తి మీద కుచ్చు టోపీ ఉందన్నారు. చంద్రబాబు సింగపూర్‌ అన్నాడు, జగన్‌ మూడు రాజధానులు అన్నారని, ఇద్దరూ రాజధానిని పట్టించుకోలేదని ఆరోపించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశాభివృద్ధికి కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ విశేష కృషి చేశాయన్నారు. ప్రస్తుత

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img