Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

పెరిగిన లెఫ్ట్‌ బలం

సీపీఐ 2, సీపీఎం 4, ఎంఎల్‌ 2 చోట్ల విజయం

న్యూదిల్లీ: పార్లమెంట్‌లో వామపక్షాల బలం 8కి పెరిగింది. సీపీఐ రెండు స్థానాల్లో, సీపీఎం నాలుగు, సీపీఐ ఎంఎల్‌ రెండు నియోజకవర్గాలలో విజయం సాధించాయి. తమిళనాడులోని నాగపట్నం లోక్‌సభ నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి వి. సెల్వరాజ్‌ 2,03,662 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఆయనకు 4,48, 243 ఓట్లు రాగా, సమీప ఏఐఏడీఎంకే ప్రత్యర్థి జి సుర్శిత్‌ శంకర్‌కు 2,44,581 ఓట్లు లభించాయి. ఎంటీకే అభ్యర్థి ఎం. కార్తికకు 1,26, 637 ఓటర్ల రాగా, బీజేపీ అభ్యర్థి ఎస్‌జీఎం రమేశ్‌ గోవింద్‌ 98,232 ఓట్లతో నాలుగవ స్థానంలో నిలిచారు.
తిర్పూర్‌ నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి కె. సుబ్బరాయన్‌ 1,24,731 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. ఆయనకు 4,69,156 ఓట్లురాగా, సమీప ఏఐఏడీఎంకే ప్రత్యర్థి పి. అరుణాచలంకు 3,44,425 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ఏపీ మురుగానందంకు 1,83,797 ఓట్లు లభించాయి. బీహార్‌లోని బెగూసరాయ్‌ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి గిరిరాజ్‌ సింగ్‌కు సీపీఐ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అవిదేశ్‌రాయ్‌ గట్టిపోటీ ఇచ్చారు. గిరిరాజ్‌ 81,480 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 6,49,331 ఓట్లు రాగా, అవిదేశ్‌ రాయ్‌కి 5,67,851 ఓట్లు లభించాయి. కేరళలోని మవెలిక్కర (ఎస్‌సీ) నియోజకవర్గంలో హోరాహోరి జరిగిన పోరులో సీపీఐ అభ్యర్థి సీఏ అరుణ్‌కుమార్‌ స్వల్ప తేడాతో ఓటమిచెందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కె. సురేశ్‌కు 3,69,516 ఓట్లు రాగా, అరుణ్‌కుమార్‌ 3,58,648 ఓట్లు తెచ్చుకుని కేవలం 10,868 ఓట్ల తేడాతో ఓడిపోయారు. త్రిస్సూర్‌ నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి వీఎస్‌ సునీల్‌ కుమార్‌ ఓటమి చెందారు. ఇక్కడ సురేశ్‌ గోపి విజయంతో రాష్ట్రంలో బీజేపీ మొదటిసారిగా విజయం సాధించింది. సురేశ్‌ గోపికి 4,12,338 ఓట్లు రాగా, సునీల్‌ కుమార్‌కు 3,37,652 ఓట్లు లభించి 74,686 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తిరువనంతపురం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి శశిథరూర్‌ మరోసారి గెలుపొందారు. ఆయనకు 3,58,155 ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌కు 3,42,078, సీపీఐ అభ్యర్థి పన్నియన్‌ రవీంద్రన్‌కు 2,457,648 ఓట్లు లభించాయి. శశిథరూర్‌ 16077 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వయనాడ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ 3,64,422 ఓట్ల తేడాతో సీపీఐ అభ్యర్థి అనీ రాజాను ఓడిరచారు. రాహుల్‌కు 647445 ఓట్లు, అనీ రాజాకు 283023 ఓట్లు లభించాయి.
ఇతర రాష్ట్రాలలోని సీపీఐ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో ్థ జంగాల అజయ్‌కుమార్‌కు 8,312, అసోంలోని లఖింపూర్‌లో థీరెన్‌ కోసహరికి 19,521, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ (ఎస్‌టీ)లో పూల్‌సింగ్‌ కచ్లామ్‌కు 35,655, చాత్రాలో అర్జున్‌ కుమార్‌కు 11,572, దుమ్కా (ఎస్‌టీ)లో రాజేశ్‌ కుమార్‌ కిస్కూకు 10,326, హజారీబాగ్‌లో అనిరుద్‌ కుమార్‌కు 9,572,లోహర్‌దఘా (ఎస్‌టీ)లో మహేంద్ర ఓరాన్‌కు 12,599 ఓట్లు లభించాయి. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే (ఎస్టీ)లో దేవీ సింగ్‌ నార్గవేకి 14,676, సిధిలో సంజయ్‌ కుమార్‌ నామ్‌దేవ్‌కు 20,264, షహదోల్‌ (ఎస్టీ)లో సమార్‌ షా సింగ్‌కు 19883, మహారాష్ట్రలోని పర్‌భనిలో క్షీరసాగర్‌కు 5140 ఓట్లు వచ్చాయి. ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌లో రమేశ్‌ చంద్ర సేథికి 7,876, పంజాబ్‌లోని అమృతసర్‌లో దశ్వీందర్‌ కౌర్‌కు 2481, ఫరీద్‌కోట్‌ (ఎస్సీ)లో గురుచరణ్‌సింగ్‌ మాన్‌కు 14,950, ఖదూర్‌సాహిబ్‌లో గుర్‌దియాల్‌ సింగ్‌కు3952, ఉత్తరప్రదేశ్‌లోని బందాలో రామ్‌ చరణ్‌ యాదవ్‌కు 9432, దౌరహరలో జనార్థన్‌ ప్రసాద్‌ మిశ్రాకు 15,900, ఫైజాబాద్‌లో అరవింద్‌ సేన్‌కు 15,367, లాల్‌గంజ్‌లో గంగా దీన్‌కు 12,271, ఘోసిలో వినోద్‌ రాయ్‌కి 6531, రాబర్ట్స్‌గంజ్‌ (ఎస్సీ)లో అశోక్‌ కుమార్‌ కనౌజియాకు 20,407 ఓట్లు లభించాయి. పశ్చిమ బెంగాల్‌లోని ఘటల్‌లో తపన్‌ గంగూలీకి 72,712, మేదినీపూర్‌లో విప్లవ్‌ భట్టాకు 57,336 ఓట్లు లభించాయి.
సీపీఎం నాలుగు చోట్ల విజయం
సీపీఎం తమిళనాడులో రెండు చోట్ల, కేరళ, రాజస్థాన్‌లో ఒక్కొక్క నియోజకవర్గంలో విజయం సాధించింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని సికార్‌ నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థి అమ్రారామ్‌ తన సమీప బీజేపీ ప్రత్యర్థి సుమోధానంద్‌ సరస్వతిని 72,896 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఆమ్రారామ్‌కు 659300, సరస్వతికి 586,404 ఓట్లు లభించాయి. తమిళనాడులోని మదురైలో సీపీఎం అభ్యర్థి ఎస్‌ వెంకటేశన్‌కు 4,30,323 ఓట్లు రాగా, సమీప బీజేపీ ప్రత్యర్థి రామశ్రీనివాసన్‌కు 220914 ఓట్లు లభించాయి.
దిండిగల్‌లో ఆర్‌. సచ్చిదానందంకు 670149 ఓట్లు రాగా, ఏఐఏడిఎంకే అభ్యర్థి మహ్మద్‌ ముబారక్‌కు 2,26,328 ఓట్లు లభించాయి. కేరళలోని అలథూర్‌ నియోజకవర్గంలో కె. రాథాకృష్ణన్‌ 20,111 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి రమ్య హరిదాస్‌పై విజయం సాధించారు. రాథాకృష్ణన్‌కు 403447 ఓట్లు రాగా, రమ్యకు 3836336 ఓట్లు లభించాయి.
సీపీఐఎంఎల్‌ రెండు చోట్ల గెలుపు
బీహార్‌లోని అర్హాలో సీపీఐ ఎంఎల్‌ అభ్యర్థి సుదామ ప్రసాద్‌ 4,87,791 ఓట్లు తెచ్చుకుని బీజేపీ అభ్యర్థి ఆర్‌కే సింగ్‌ను 55678 ఓట్ల తేడాతో ఓడిరచారు. సింగ్‌కు 4,32,113 ఓట్లు వచ్చాయి. కారాకట్‌ నియోజకవర్గంలో రాజా రామ్‌సింగ్‌ 370929 ఓట్లు తెచ్చుకుని 1,04,494 ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి పవన్‌సింగ్‌ను ఓడిరచారు. ఆయనకు 2,66,435 ఓట్లు లభించాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థి 248997 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img