Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

‘పోస్టల్‌’ పంచాయితీ!

. ముదురుతున్న వివాదం
. ఆర్వో సంతకం లేకున్నా లెక్కించాలన్న ఈసీ
. ఈసీ ప్రత్యేక గైడ్‌ లైన్స్‌పై వైసీపీ అభ్యంతరం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని విధంగా పోస్టల్‌ బ్యాలెట్ల వివాదం ముదురుతోంది. ఈసారి భారీ సంఖ్యలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ జరగడం కూడా వివాదానికి ప్రధానకారణమైంది. ఎన్నికల సిబ్బందితో పాటు పోలింగ్‌ కేంద్రాలకు రాలేని వృద్ధులకు కూడా ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షలకు పైగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. గెలుపుపై వైసీపీ, ఎన్డీఏ కూటమి ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోస్టల్‌ బ్యాలెట్లు ఉభయపక్షాలకు కీలకంగా మారాయి. ప్రతి పోస్టల్‌ బ్యాలెట్‌పై ఆర్వోలు సంతకం చేయాల్సి ఉండగా, కొందరు చేయలేదు. దీంతో ఆర్వో సంతకం లేకపోయినా, ఆర్వో సీల్‌ లేకపోయినా వాటిని కూడా లెక్కించాలని కోరుతూ ఎన్డీఏ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈసీ సానుకూలంగా స్పందిస్తూ ఉద్యోగులు, సర్వీసు అధికారులు, ఇతర వ్యక్తుల నుంచి వచ్చిన పోస్టల్‌ బ్యాలెట్లను ఆర్వో సంతకం, సీల్‌ లేదని తిరస్కరించకూడదని, వాటిని కూడా లెక్కించాల్సిందేనంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఒకవేళ పోస్టల్‌ బ్యాలెట్‌ను తిరస్కరించాల్సిన పరిస్థితి వస్తే లోపలి కవర్‌ తెరవకుండా తిరస్కరించాలని, అది కూడా ఫారం-13ఏలోని డిక్లరేషన్‌, ఫారం13సీలోని కవర్‌ బీ లోపల కనిపించని పక్షంలో తిరస్కరించవచ్చునని ఈసీ సూచించింది. అలాగే డిక్లరేషన్‌పై ఓటర్లు సక్రమంగా సంతకం చేయకపోయినా, లోపభూయిష్టంగా ఉన్నా తిరస్కరించవచ్చునని తెలిపింది. అంతేతప్ప ఆర్వో సంతకానికి, బ్యాలెట్‌ చెల్లుబాటుకి సంబంధం లేదని స్పష్టం చేసింది. పోస్టల్‌ బ్యాలెట్‌ వెనుక ఆయన సంతకం, సీల్‌ వేయడం ఆర్వో బాధ్యత తప్ప, దానిని సాకుగా చూపి ఓటును తిరస్కరించడం తగదని సూచించింది. అయితే పోస్టల్‌ బ్యాలెట్లు ఎక్కువగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డాయని భావిస్తున్న వైసీపీ నేతలు ఎన్డీఏ నేతల విజ్ఞప్తి తర్వాత ఈసీ నిబంధనలు మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు సందర్భంగా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకోవచ్చంటూ వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కింపుపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా ఇచ్చిన ప్రత్యేక గైడ్‌లైన్స్‌పై అభ్యంతరం తెలిపారు. గెజిటెడ్‌ అధికారం సంతకం పెట్టి స్టాంప్‌ వేయాలని గతంలో చెప్పారు. ఇప్పుడు కొత్తగా స్టాంప్‌ వేయకపోయినా సరే ఆమోదించాలని అంటున్నారు అని మాజీ మంత్రి పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉంది. ఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదు. ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుంది. ఈ నిబంధనలపై పునరాలోచించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాట్లు ఏపీలోనే ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌లో లేని సడలింపులతో కూడిన మార్గదర్శకాలు జారీ చేయడం సరికాదన్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు.
పోస్టల్‌ బ్యాలెట్లు చెల్లకపోతే ఆర్వోలదే బాధ్యత: కేఆర్‌సీ
పోస్టల్‌ బ్యాలెట్లు చెల్లకపోతే ఆ బాధ్యత రిటర్నింగ్‌ అధికారులదేనని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ (కేఆర్‌సీ) అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు చెల్లకపోవడం ఎన్నికల ప్రక్రియలో లోపంగా పరిగణించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడి ఉద్యోగులు బాధ్యతగా ఓటు వేశారని, ఆ ఓటు చెల్లదంటే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల ఓటు హక్కు వినియోగాన్ని ఎందుకింత సంక్లిష్టంగా మారుస్తున్నారని మండిపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ సమంజసమేనా అని నిలదీశారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను సరళతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఓటు హక్కు చెల్లుబాటయ్యేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల అధికారులు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img