Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ప్రజాస్వామ్యం ధ్వంసం

మోదీ పాలన ఆద్యంతం నియంతృత్వమే

. ప్రజల్లో విద్వేషం నింపే చర్యలకు ప్రాధాన్యం
. క్షీణించిన రాజ్యాంగ విలువలు
. స్వయంప్రతిపత్తి కోల్పోతున్న వ్యవస్థలు
. మొక్కుబడిగా పార్లమెంటు సమావేశాలు
. న్యాయవ్యవస్థపై పెరిగిన పెత్తనం
. విపక్షాలు, ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం
. ఎన్నికల వేళ కీలక నేతల అరెస్టులు

న్యూదిల్లీ : కేంద్రంలో పదేళ్లపాటు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సాగిన ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది. స్వతంప్రతిపత్తిగల పాలనా వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని నియంతృత్వ పాలన సాగిస్తోంది. ఒక్కో ఇటుక తొలగిస్తూ ప్రజాస్వామ్య కోటను కూల్చివేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ‘మోదీ’ జపం తారస్థాయికి చేరింది. దేశ ఖ్యాతిని ఇనుమడిరపజేసే ఘనతలను తనదే అని చెప్పుకోవడం నరేంద్రుడికి పరిపాటిగా మారింది. నరేంద్ర మోదీ పేరిట ‘నమో’ ప్రచారాన్ని కాషాయ పార్టీ హోరెత్తిస్తోంది. కోట్లలో ప్రజా ధనాన్ని గుమ్మరిస్తూ హోర్డింగులు, బ్యానర్లు, టీవీలు, పత్రికల్లో ప్రకటనల రూపంలో ప్రచార్భాటాన్ని సాగిస్తోంది. ప్రగల్భాలు పలకడంలో, అబద్ధాలు చెప్పడంలో, నిరంకుశంగా వ్యవహరించడంలో మోదీకి ఎవరూ సాటి రారంటే అతిశయోక్తి కాదు. మోదీ పదేళ్ల పాలనలో అనేక అసాధారణ పరిణామాలు జరిగాయి. స్వతంత్ర భారతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఘటనలు చోటుచేసుకున్నాయి. అతి తక్కువ కాలం జరిగిన లోక్‌సభగా 17వ లోక్‌సభ నిలిచింది. 20వేలకుపైగా ఎన్జీవోల లైసెన్సులు రదయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, మంత్రులు అరెస్టుకు గురయ్యారు. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశారు. రైతాంగ పోరాటానికి మద్దతిచ్చిన వారి పాస్‌పోర్టులు, వీసాలు రద్దు చేశారు. అసమ్మతిని అణచివేసేందుకు అనేకమంది మేధావులు, మానవహక్కుల కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ కార్యకర్తలు, పాత్రికేయులతో పాటు అనేకమంది నిర్బంధానికి గురి కావాల్సి వచ్చింది. విపక్ష కీలక నేతలు విచారణ ఖైదీలుగా ఉన్న సమయంలో సార్వత్రిక ఎన్నికలు జరగడం దేశంలో గతంలో ఎన్నడూ జరగలేదు. న్యాయ వ్యవస్థపైనా పాలకులు పెత్తనం చేస్తుండటం…. సుప్రీంకోర్టును ఆక్షేపించడం గతంలో జరగలేదు.
ప్రధానమంత్రి కార్యాలయం సమాధానం 2022 నుంచి 13 ప్రశ్నలకు ఇచ్చింది. అదే మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 85 ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. పీఆర్‌ఎస్‌ పరిశోధన ప్రకారం 1952 నుంచి అతితక్కువ సమయం జరిగిన సమావేశాలుగా 17వ లోక్‌సభ సమావేశాలు నిలిచాయి. పూర్తి పదవీ కాలం పనిచేసిన లోక్‌సభల్లో 16వ సభలో (మోదీ హయాంలో) కేవలం 331 సిట్టింగ్‌లు జరిగాయి. 17వ లోక్‌సభలోనే అతి తక్కువగా 17.6శాతం అంటే 210కుగాను 37 బిల్లులు మాత్రమే పార్లమెంటు కమిటీల పరిశీలనకు వెళ్లాయి. పార్లమెంటు శీతాకాల సమావేశంలో ఒక్క బిల్లునూ పరిశీలించలేదు. చర్చలు జరపకుండా, సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోకుండానే బిల్లులు ఆమోదం పొందాయి. డిప్యూటీ స్పీకర్‌ లేకుండా సమావేశాలు జరగాయి. శీతాకాల సమావేశంలో 20శాతం సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. 2021లో ప్రధాని నాలుగు గంటలు మాత్రమే లోకసభకు కేటాయించారు.
పదేళ్లలో మోదీ ఘనతలు ఇవే…
మోదీ ప్రభుత్వం తమ ప్రత్యర్థులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ, ఐటీ వంటి వ్యవస్థలను అస్త్రాలుగా ప్రయోగిస్తోందన్నది బహిరంగ సత్యం. ఇటీవల జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు జైలుకు పంపారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే నేషనల్‌ జ్యుడిషియల్‌ అపాయింట్స్‌మెంట్స్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్స్‌ బిల్లు (2014 ఆగస్టులో) ద్వారా జడ్జిల నియామకాలు, బదిలీ అధికారాలను లాక్కోవాలనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను పునరుద్ధరించింది. దీంతో కొలీజియంపై తీవ్ర దాడిని మోదీ యంత్రాంగం కొనసాగించింది. కొలీజియం సిఫార్సు చేసిన కనీసం 50 పేర్లు ఇప్పటికీ పెండిరగ్‌లోనే ఉన్నాయి. దీనిని సుప్రీంకోర్టు సైతం ఆక్షేపించింది. తీర్పులను ప్రభావితం చేసేందుకు వెనుకాడటంలేదు.మోదీ హయాంలో దాఖలైనన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఎన్నడూ దాఖలు కాలేదు. ఏ ప్రధాని చేయనన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను మోదీ చేశారు. రాష్ట్రాల్లో చేపట్టే ప్రతి కేంద్ర ప్రాజెక్టు… రక్షణ రంగంలో సైతం తన చేతులు మీదగానే జరిగేలా చూసుకున్నారు. అన్ని చోట్ల ప్రత్యక్షమై అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. చివరకు వ్యోమగాములను సైతం ఆయనే ప్రకటించారు. సాయుధ దళాల రాజకీయీకరణకు మోదీ ప్రభుత్వం తెరతీసింది. గతేడాది 822 మోదీ సెల్ఫీపాయింట్లు ఏర్పాటయ్యాయి. సైనిక స్థావరాల్లో సైతం వీటిని ఏర్పాటు చేశారు. స్కూళ్లు, కాలేజిలు, రైళ్లు, ఆలయాలు, సంక్షేమ పథకాలన్నీ ‘నమో’ జపం ఎక్కువైంది. మోదీ చాలీసా…మహారాష్ట్ర ‘మోదీ స్ట్రిప్ట్‌’ పని జరుగుతోందట!
బుల్డోజర్‌ రాజకీయాలునిర్బంధ కాండ మోదీయోగి (యూపీ సీఎం) హయాంలో మైనారిటీలే లక్ష్యంగా బుల్డోజర్‌ రాజకీయాలు నడిచాయి.ముస్లింల నివాసాలు, దుకాణాలు, మదర్సాలను కూల్చివేశారు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో బుల్డోజర్ల పద్ధతి కొనసాగింది. తాజాగా నిరసన తెలిపే రైతుల మద్దతుదారుల పాస్‌పోర్టులు, వీసాలు రద్దు చేయించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద 2018`22 మధ్యకాలంలో 5,024 కేసులు నమోదయ్యాయి. 701 దేశద్రోహం కేసుల్లో 8,947 మంది అరెస్టు అయినట్లు కేంద్రం తెలిపింది. వీటిలో ఈడీ, ఎన్‌ఐఏ, సీబీఐ, ఐటీ, నార్కోటిక్‌ శాఖలు చేపట్టిన అరెస్టులు పేర్కొనలేదు. ప్రింట్‌, డిజిటల్‌ మీడియాలో ప్రచారాలు, ప్రకటనలతో బీజేపీ ప్రభుత్వం హోరెత్తించింది. మార్చిలో ఎన్నికల ప్రకటన వెలువడగా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ఏడు పేజీలు, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆరు పేజీల్లో మోదీ చిత్రాలు కనిపించాయి. ఇది మార్చి 10న జరిగింది. అలాగే 12వ తేదీన కూడా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆరు ఫుల్‌ పేజీలు, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ఏడు పేజీల ప్రకటనలు వచ్చాయి. భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేసింది. బాలీవుడ్‌లోనూ మోదీ ప్రతిష్ఠను పెంచేలా ఆర్టికల్‌ 370 వంటి చిత్రాలు విడుదలయ్యాయి.
నిరంకుశ రికార్డులన్నీ బద్దలు!
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు పలనా వ్యవహారాల్లో తలదూర్చిన దాఖలాలు గతంలో లేవు కానీ మోదీ హయాంలో ఇది మితిమీరిపోయింది. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు పెండిరగ్‌లో పెట్టి వేధించడం మొదలైంది. చివరకు సుప్రీంకోర్టును ప్రభుత్వాలు ఆశ్రయించాల్సి వచ్చింది. కేరళ, తమిళనాడులో ఈ పరిస్థితులు దాపురించగా…. పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో వివాదాలు కొనసాగాయి. స్వతంత్ర భారత్‌లో మొట్టమొదటి సారి ప్రధాన ప్రతిపక్షానికి చెందిన బ్యాంకు ఖాతాలు అన్నింటినీ కేంద్రప్రభుత్వం సీజ్‌ చేయించింది. ఎన్నికలకు ముందు ఇలాంటి పరిణామం గతంలో జరగలేదు. రూ.10.29 కోట్లను సీజ్‌ చేయడం ద్వారా తృణమూల్‌ కాంగ్రెస్‌పై ఈడీ దృష్టి పెట్టింది. తదుపరి లక్ష్యాలుగా ఆర్‌జేడీ ఉన్నది. ఇప్పటికే అనేక కేసుల్లో యాదవ్‌ కుటుంబం చిక్కుకొనివున్నది. మోదీని ఫాసిస్టుగా పేర్కొన్నందుకు గూగుల్‌కు చెందిన జెమిని చాట్‌బాట్‌, కృత్రిమ మేధపై సర్కార్‌ నిఘా పెట్టింది. ఇప్పటికే కాగ్‌ గొంతు నొక్కేసింది. విపక్షాల రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం లేదు. వినిమయ వ్యయం సర్వేల గణాంకాలు ప్రభావితం చేసింది. మోదీ మార్కు రాజకీయాలతో వాస్తవాలను కప్పిపుచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు బీజేపీ శాయాశక్తుల యత్నిస్తోంది. కాగా, మోదీ రెండేళ్ల కిందట రూ.12 కోట్ల మెర్సిడెజ్‌ బెంచ్‌ మేబాచ్‌ ఎస్‌ 650ను ఎంపిక చేసుకున్నారు. గతంలో వాజ్‌పేయి కూడా అంబాసిడర్‌ వద్దని బీఎండబ్ల్యూ7 సిరీస్‌ వాహనాన్ని ఎంచుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img