Free Porn

manotobet

takbet
betcart
betboro

megapari
mahbet
betforward


1xbet
teen sex
porn
djav
best porn 2025
porn 2026
brunette banged
Friday, June 21, 2024
Friday, June 21, 2024

ప్రతిపక్ష నేత రాహుల్‌

. సీడబ్ల్యూసీ తీర్మానం
. పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ

న్యూదిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీని నియమించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. రాహుల్‌ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్‌ల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అలాగే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ పదవికి సోనియా గాంధీ తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) విస్తృత సమావేశం శనివారం జరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష పార్టీ నాయకులు, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు పార్టీ పనితీరును విశ్లేషించి, దానిని బలోపేతం చేయడానికి చర్యలను సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీశ్‌ తివారీ, డీకే శివకుమార్‌, రేవంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్‌ ఎంపీ కుమారి సెల్జా మాట్లాడుతూ ‘రాహుల్‌ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికవ్వాలన్నదే సీడబ్ల్యూసీ కోరిక’ అని అన్నారు. ఎంపీ కేసీ వేణుగోపాల్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు తీసుకోవాలని రాహుల్‌ గాంధీని ఏకగ్రీవంగా అభ్యర్థించింది’ అని తెలిపారు. పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ మనోభావాలను రాహుల్‌ గాంధీ విన్నారని, ఈ పాత్ర చేపట్టాలా వద్దా అనే దానిపై వచ్చే రెండు, నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ‘ప్రచార సమయంలో మేము సామాజిక, రాజకీయ న్యాయ సమస్యలను చాలా శక్తితో లేవనెత్తాము. పార్లమెంటు లోపల కూడా అది మరింత గొప్పగా కొనసాగాలి. మెరుగైన, బలమైన, అప్రమత్తమైన ప్రతిపక్షాన్ని కలిగి ఉండేందుకు రాహుల్‌ గాంధీ అత్యుత్తమ వ్యక్తి’ అని వేణుగోపాల్‌ అన్నారు. .నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడానికి కీలకంగా మారిన బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌కు ఇండియా ఐక్య సంఘటన ప్రధాని పదవి ప్రతిపాదించిందన్న వార్తలను వేణుగోపాల్‌ తోసిపుచ్చారు. జైరాం రమేశ్‌ మాట్లాడుతూ లోక్‌సభ ఫలితాలు పార్టీని పునరుజ్జీవింపజేశాయని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో పార్టీ పేలవమైన పనితీరుకు గల కారణాలను పరిశీలించేందుకు కమిటీని వేస్తామని, ఈ కమిటీ తన నివేదికను కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖడ్గేకు అందజేస్తుందని తెలిపారు. అదే సమయంలో ఆదివారం జరగనున్న మోదీ, ఇతర క్యాబినెట్‌ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ‘ఇండియా’ పార్టీలకు ఇంకా ఎలాంటి ఆహ్వానం అందలేదని జైరాం రమేశ్‌ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘ఆహ్వానం వచ్చినప్పుడు మేము నిర్ణయం తీసుకుంటాం. అయితే ఇప్పటివరకు అంతర్జాతీయ నేతలను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది’ అని అన్నారు. కాగా, సీడబ్ల్యూసీ మరొక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. కొన్ని రాష్ట్రాల్లో పార్టీ పేలవమైన పనితీరు నేపథ్యంలో ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ చేసిన కృషిని సీడబ్ల్యూసీ తీర్మానం కొనియాడిరది. ‘కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రూపొందించిన, నడిపించిన భారత్‌ జోడో యాత్ర, భారత్‌ జోడో న్యాయయాత్రల కారణంగా ఎక్కువగా ప్రత్యేకించవలసి వచ్చింది. ఆయన ఆలోచన, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ రెండు యాత్రలు మన దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపులు. లక్షలాది మంది మన కార్యకర్తలు, కోట్లాది మంది మన ఓటర్లలో ఆశ, విశ్వాసాన్ని నింపాయి. రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం పదునైనది, చురకైనది. ఇతర వ్యక్తుల కంటే ఎక్కువగా మన గణతంత్ర రాజ్యాంగ పరిరక్షణను 2024 ఎన్నికలలో ప్రధాన అంశంగా మార్చింది. ఎన్నికల ప్రచారంలో చాలా శక్తిమంతంగా ప్రతిధ్వనించిన ఐదు న్యాయాలు`ఐదు గ్యారెంటీలు’ కార్యక్రమం, రాహుల్‌జీ యాత్రల పరిణామం, అందులో ఆయన ప్రజల భయాలు, ఆందోళనలు, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనార్టీల ఆకాంక్షలను ఆయన విన్నారు’ అని పేర్కొంది. కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ ప్రమోద్‌ తివారీ మాట్లాడుతూ ‘కచ్చితంగా ఆయన (రాహుల్‌ గాంధీ) లోక్‌సభలో ప్రతిపక్ష నేత కావాలి. ఇది మా వర్కింగ్‌ కమిటీ అభ్యర్థన, అతని నిర్భయం, ధైర్యం ప్రశంసనీయం’ అని అన్నారు. అంతకుముందు రాహుల్‌ గాంధీ కీలక పాత్ర పోషించాలని అనేక మంది పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. ఇదే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఇది 140 కోట్ల మంది భారతీయుల డిమాండ్‌ అని అన్నారు. ‘మా డిమాండ్‌…140 కోట్ల మంది భారతీయుల డిమాండ్‌ ఒక్కటే. రాహుల్‌ గాంధీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టాలి. మహిళలు, నిరుద్యోగుల కోసం రాహుల్‌ గాంధీ పోరాడుతున్నారు’ అని తెలిపారు. గురుదాస్‌పూర్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ ఎంపీ సుఖ్‌జీందర్‌ సింగ్‌ రంధ్వా మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌లో ప్రధానికి సమాధానం చెప్పగల వ్యక్తి అని, అందుకే ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టాలని అన్నారు. ‘పార్లమెంట్‌లో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. అవును, ప్రధాన మంత్రికి సమాధానం చెప్పగల అటువంటి ముఖం దేశానికి రావాలని మేము కోరుకుంటున్నాం. దేశం మొత్తం దీన్ని కోరుకుంటుందని నేను భావిస్తున్నాను’ అని ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో 52 నుంచి ఇప్పుడు 100 కి పెరిగింది. ఈసారి కాంగ్రెస్‌ తరపున 99 మంది అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. గురువారం మహారాష్ట్రకు చెందిన సంగ్లీకి చెందిన స్వతంత్ర ఎంపీ విశాల్‌ పాటిల్‌ కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతు ఇవ్వడంతో దాని సంఖ్య మూడు అంకెల మార్కును తాకింది.
సీపీపీకి సోనియా తిరిగి ఎన్నిక
లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలందరితో కూడిన పార్లమెంటరీ పార్టీ (సీపీపీ)కి సోనియా గాంధీని చైర్‌పర్సన్‌గా తిరిగి ఎన్నుకున్నారు. సీపీపీ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ పేరును మల్లికార్జున ఖడ్గే ప్రతిపాదించగా, నేతలు గౌరవ్‌ గొగోయ్‌, తారిఖ్‌ అన్వర్‌ బలపరిచారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో ఎంపీలు ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించారు. గత లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధినేత్రిగా పనిచేసిన ఆమె మళ్లీ ఆ పదవికి ఎన్నికయ్యారు. 20 ఏళ్ల పాటు లోక్‌సభ సభ్యురాలిగా ఉన్న సోనియా ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు. సీపీపీ నాయకురాలిగా ఎన్నికయిన తర్వాత పార్టీ ఎంపీలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ పార్లమెంటులో ‘జాగ్రత్తగా, అప్రమత్తంగా, క్రియాశీలకంగా’ ఉండాలని కోరారు.
‘సీపీపీ సభ్యులుగా కొత్త ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడంలో జాగ్రత్తగా, అప్రమత్తంగా, క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన ప్రత్యేక బాధ్యత మనకు ఉంది. దశాబ్ద కాలంగా పార్లమెంటును బుల్‌డోజ్‌ చేసినట్లుగా ఇక ఉంచకూడదు. పార్లమెంటుకు అంతరాయం కలిగించడానికి, సభ్యులను విచిత్రంగా దుర్వినియోగం చేయడానికి లేదా సరైన పరిశీలన, చర్చ లేకుండా చట్టాన్ని ముందుకు తీసుకురావడానికి అనుమతించబడదు’ అని సోనియా గాంధీ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img