Monday, October 28, 2024
Monday, October 28, 2024

ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు

. ఇక ‘అంబేద్కర్‌ విదేశీ విద్యానిధి’
. జీవో విడుదల చేసిన ప్రభుత్వం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ఆరు ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్పు చేసింది. ఇప్పటికే వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకకు…ఎన్టీఆర్‌ భరోసాగా మార్పు చేస్తూ ఉత్తర్వులివ్వగా… తాజాగా సాంఘిక సంక్షేమశాఖ అధ్వర్యంలో నడిచే ఆరు ప్రభుత్వ పథకాల పేర్లు మార్చా రు. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా వీరాంజనేయులు ఆదేశాల మేర కు శాఖ కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీజేశారు. ప్రజాభీష్టం మేరకే ఈ పేర్లు మార్చుతున్నట్లుగా స్పష్టంచేశారు. వాటిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌గా పేర్లు మారాయి. జగనన్న విదేశీ విద్యా దీవెన (ఎస్సీలు)కు బదులుగా అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి(ఏఓవీఎన్‌), వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు. వైఎస్‌ఆర్‌ విద్యోన్నతికి ఎన్టీఆర్‌ విద్యోన్నతి, జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం (జేసీఎస్‌పీ)కి సివిల్‌ సర్వీస్‌ పరీక్షా ప్రోత్సాహకాలుగా పేర్లు మార్చుతూ ఆదేశాలు జారీజేశారు. రాబోయే రోజుల్లో మరికొన్ని పథకాల పేర్లు మార్చే అవకాశాలున్నాయి. జగనన్న, వైఎస్‌ఆర్‌ పేర్లతో ఉన్న అన్ని పథకాలను ఎన్టీఆర్‌, చంద్రబాబు పేర్లతోగానీ, సాధారణ పేర్లతోగాని మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img