Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఫైళ్ల మాయంపైసమగ్ర దర్యాప్తు

రామకృష్ణ డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో కీలక ఫైళ్ల మాయంపై సమగ్ర దర్యాప్తు జరిపించి… బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల విభాగాలలోని కీలక పత్రాలను మాయం చేయటం, దహనం చేయటం చేస్తున్నట్లు తెలుస్తోందని, ఇసుక, మైనింగ్‌, మద్యం, రెవెన్యూ, మెప్మా తదితర శాఖల్లో భారీ కుంభకోణాలు జరిగాయని రామకృష్ణ తెలిపారు. వేలకోట్ల రూపాయల అవినీతి, అక్రమాలు జరిగి ప్రజాధనం దుర్వినియోగ మైందని ఆరోపించారు. కొందరు అధికారులు వైసీపీి ప్రభుత్వ ఒత్తిడికి లొంగి ఆయా శాఖల, కార్పొరేషన్ల నిధులు మళ్లించారని, నూతన ప్రభుత్వం ఏర్పాటవుతున్న సమయంలో కీలక ఫైళ్లు మాయం చేయటం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. ఆయా శాఖల్లో కీలక ఫైళ్ల మాయంపై విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img