Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మహాలక్ష్మితో మహిళలకు మేలుసోనియా గాంధీ

న్యూదిల్లీ: తమ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో జాబితా చేసిన ‘హామీలు’ ఈ ‘క్లిష్ట సమయం’లో ప్రజల పరిస్థితులను మారుస్తాయని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ సోమవారం హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ సామాజిక మాధ్యమంలో ప్రసారం చేసిన ఒక వీడియో సందేశంలో ‘తీవ్రమైన సంక్షోభం’ నేపథ్యంలో దేశ మహిళలు కఠినమైన సమయాలు ఎదుర్కొంటున్నారు. పార్టీకి చెందిన ‘మహాలక్ష్మి పథకం’ వారి జీవితాలను మార్చడానికి సహాయపడుతుంది’ అని అన్నారు. ‘నా ప్రియమైన సోదరీమణులు, మహిళలు స్వేచ్ఛా పోరాటం నుంచి ఆధునిక భారతదేశం సృష్టి వరకు భారీ సహకారం అందించారు. అయితే, ఈ రోజు మన మహిళలు తీవ్రమైన ద్రవ్యోల్బణం మధ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వారి కృషి, తపస్సుకు న్యాయం చేయడానికి కాంగ్రెస్‌ వచ్చింది విప్లవాత్మక హామీతో’ అని సోనియా గాంధీ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ‘మహాలక్ష్మి పథకం’ పేద కుటుంబానికి చెందిన ఒక మహిళకు ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇస్తుందని ఆమె చెప్పారు. ఈ పథకం అమలవుతున్న కర్నాటక, తెలంగాణలోని కోట్ల కుటుంబాల జీవితాలను కాంగ్రెస్‌కు చెందిన ‘హామీలు’ ఇప్పటికే మార్చాయని సోనియా గాంధీ అన్నారు. ఈ రెండు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. ‘ఇది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అయినా, సమాచార హక్కు, విద్యా హక్కు లేదా ఆహార భద్రత వంటి పథకాల ద్వారా కాంగ్రెస్‌ పార్టీ లక్షలాది మంది భారతీయులకు సాధికారత ఇచ్చింది. మా పనిని ముందుకు తీసుకెళ్లడానికి ‘మహాలక్ష్మి’ తాజా హామీ’ అని కాంగ్రెస్‌ నేత అన్నారు. ‘ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్‌ హస్తం మీతో ఉందని నేను మీకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను.
ఈ హస్తం మీ పరిస్థితులను మారుస్తుంది. ధన్యవాదాలు. జై హింద్‌’ అని ఆమె పార్టీ చిహ్నాన్ని ప్రస్తావిస్తూ అన్నారు. కాగా, ఆమె విజ్ఞప్తిని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ‘ఎక్స్‌’ పోస్టుల్లో పంచుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ… ‘మీ ఒక ఓటు మీ ఖాతాలో ఏటా లక్ష రూపాయలకు సమానమని పేద కుటుంబాల మహిళలు గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. భయంకరమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మధ్య పోరాడుతున్న మహిళలకు కాంగ్రెస్‌ ‘మహాలక్ష్మి’ పథకం రక్షణగా ఉంటుంది. ప్రతి నెలా రూ.8,500 నేరుగా బ్యాంక్‌ ఖాతాలలో జమ చేయడంతో భారతదేశ మహిళలు ఆర్థికంగా ఒకరిపై ఆధారపడటం నుంచి విముక్తి పొందుతారు’ అని పేర్కొన్నారు. ‘అందువల్ల ఓటు వేయండి. మీ పరిస్థితులను మార్చండి’ అని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img