Free Porn

manotobet

takbet
betcart
betboro

megapari
mahbet
betforward


1xbet
teen sex
porn
djav
best porn 2025
porn 2026
brunette banged
Friday, June 21, 2024
Friday, June 21, 2024

మిత్రులపై చిన్నచూపు

. కీలక శాఖలన్నీ కమలం వద్దే
. బీజేపీ సీనియర్లకే పెద్దపీట
. రామ్మోహన్‌కు విమానయానం
. పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి (సహాయ)
. శ్రీనివాసవర్మకు ఉక్కు, పరిశ్రమలు (సహాయ)

న్యూదిల్లీ : న్యూదిల్లీ: మోదీ 3.0లో మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపు పూర్తిగా ఏకపక్షంగా ఉన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ.. ఆయన మంత్రివర్గంలోని 71 మంది ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. వీరిలో 30 మందికి కేబినెట్‌ హోదా.. ఐదుగురికి స్వతంత్ర హోదా, మిగిలిన 36 మందిని సహాయ మంత్రులుగా నియమించారు. తాజాగా సోమవారం వీరికి శాఖలు కేటాయించారు. కీలక శాఖలన్నీ కాషాయ పార్టీనే అట్టిపెట్టుకుంది. చాలామంది సీనియర్లు కేబినెట్‌ లో స్థానం నిలుపుకున్నారు. అనేకమందికి పాత శాఖలే కేటాయించారు. అమిత్‌ షా, రాజ్‌ నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, అశ్విని వైష్ణవ్‌ వంటి వారు తమ పాత శాఖలనే తిరిగి పొందారు. ప్రధానమంత్రి కాకుండా 71మంది మంత్రుల్లో 60మంది బీజేపీకి చెందినవారే. ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, జేడీఎస్‌, శివసేన, ఎన్సీపీ, ఎల్జీపీ, ఆర్‌ఎల్డీ, అప్పాదళ్‌ తదితర పార్టీల నుంచి కేవలం 11మంది ఎంపీలకు మంత్రి పదవులు వరించాయి. అయితే కేబినెట్‌ కూర్పుపైన, శాఖల కేటాయింపులపై కూడా మిత్రపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన టీడీపీ… రైల్వే, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఆరోగ్య, జలశక్తి శాఖల్లో ఏవైనా తమకు ఇవ్వాలని బీజేపీ అగ్రనేతల వద్ద మొర పెట్టుకుంది. ఈ విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు వారిని కోరినట్లు ప్రచారం జరిగింది. రాజధాని అమరావతి నిర్మాణం అనుకున్న విధంగా… అనుకున్న సమయానికి పూర్తి కావాలంటే.. పట్టణాభివృద్ధి శాఖ అయితే మంచిదనే అభిప్రాయంలో టీడీపీ శ్రేణులు భావించాయి. ఆంధ్రుల జీవనాడి.. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తి కావాలంటే… జలశక్తి శాఖ అయితే కరెక్ట్‌ అన్న చర్చ కూడా పార్టీలో జరిగింది. కానీ అందుకు భిన్నంగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహననాయుడుకు పౌరవిమానయానశాఖను మోదీ కేటాయించారు. మరో ఎంపీ పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయమంత్రి నియమించారు. బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ కేటాయించారు. తమ అంచనాలకందని రీతిలో శాఖల కేటాయింపు జరగడంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. తెలంగాణలో బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డికి కీలకమైన గనులశాఖ కేబినెట్‌ హోదాతో అప్పగించారని, పౌర విమానయాన శాఖతో రాష్ట్రాభివృద్ధికి ఏం మేలు జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వేళ… ఏ ఏ శాఖలు తమ ఎంపీలకు కేటాయిస్తారని ఆంధ్రులు తీవ్ర ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, కేరళలో ఒకరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికీ సైతం ఏ శాఖలు కేటాయిస్తారనే చర్చ సాగుతుంది. ఏదీ ఏమైనా ఈ రోజు రాత్రికి ఏ మంత్రికి ఏ శాఖ కేటాయించారనే అంశంపై ఓ స్పష్టత రానుందని తెలుస్తుంది.
శివసేన (ఏక్‌నాథ్‌ షిండే) అసంతృప్తి
ఇక ఎన్డీయే ప్రభుత్వంలో స్వతంత్ర బాధ్యతలు కలిగిన సహాయ మంత్రిత్వ పదవి దక్కడంపై ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. శివసేన పార్టీ కేబినెట్‌ మంత్రి ఆశిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎన్డీయే ఇతర భాగస్వామ్య పక్షాలకు దక్కిన పదవులను ప్రస్తావిస్తూ శివసేన చీఫ్‌విప్‌ శ్రీరంగ్‌ బర్నే మాట్లాడుతూ… ఐదుగురు ఎంపీలు కలిగిన చిరాగ్‌ పాస్వాన్‌, ఒక ఎంపీ కలిగిన జితన్‌ రాం మాంరీa, ఇద్దరు ఎంపీలు కలిగిన జేడీఎస్‌లకు ఒక్కో కేబినెట్‌ మంత్రి పదవిని కేటాయించారని… తమను మాత్రం ఒకే ఒక్క సహాయ మంత్రి పదవికి పరిమితం చేశారని వాపోయారు.
ఏడు ఎంపీలు ఉన్నప్పటికీ ఒక్క పదవి మాత్రమే ఎందుకు లభించిందని ప్రశ్నించారు. తమకు కేబినెట్‌ మంత్రిత్వ శాఖ వచ్చి ఉండాల్సిందని తెలిపారు. కాగా శివసేన నుంచి ప్రతాప్‌రావ్‌ జాదవ్‌కు స్వతంత్ర హోదా కలిగిన కేంద్ర పదవి దక్కింది. మరోవైపు ఎన్సీపీ అజిత్‌ పవార్‌ వర్గం సైతం తమకు సహాయ మంత్రి పదవితో సరిపెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమకు కూడా కేబినెట్‌ మంత్రి కావాలని డిమాండ్‌ చేసింది. ఆదివారం ప్రమాణస్వీకారానికి ముందు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర హోదా మంత్రి ప్రతిపాదనను తిరస్కరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img