Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

మొదటి సంతకం వలంటీర్‌ వ్యవస్థ పైనే

. నాయుడుపేట సభలో సీఎం జగన్‌
. మరోసారి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా

విశాలాంధ్ర – నాయుడుపేట : ఏపీలో మరోసారి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని సీఎం జగన్‌ జోస్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాగానే తన తొలి సంతకం వలంటీర్‌ వ్యవస్థపైనే ఉంటుందన్నారు జగన్‌. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 8వ రోజు గురువారం సాయంత్రం తిరుపతి జిల్లా నాయుడుపేట బైపాస్‌లో నిర్వహిం చిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ… టీడీపీ అధినేత చంద్ర బాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు తన పాలనతో ఒక్క హామీ అయినా నేరవేర్చారా అని సీఎం జగన్‌ నిలదీశారు. మన ప్రభుత్వంలో అవ్వా తాతల ఇంటికి వెళ్లి పెన్షన్‌ ఇచ్చే వాళ్లమని, అది తట్టుకోలేకపోయిన చంద్రబాబు తన మనుషులతో అడ్డుకున్నారని సీఎం జగన్‌ ఆరోపించారు. కుటిల కూటమిని తరిమికొట్టేందుకు అందరూ సిద్ధమయ్యారని జగన్‌ అన్నారు. మంచిని అడ్డుకుంటున్న దుష్టచతుష్టయంపై యుద్ధానికి సిద్ధం అని ప్రకటించారు. మీరు వేసే ప్రతీ ఓటు మీ తలరాతను మార్చే ఓటు అని జగన్‌ అన్నారు. ఇవి మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అని చెప్పారు. ఈ ఎన్నికలు రెండు భావ జాలాల మధ్య జరుగుతున్న సంఘర్షణ అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు పెత్తందారులు, పేదలకు మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు. ‘కొంచెం ఓపిక పట్టండి. జూన్‌ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం వలంటీర్‌ వ్యవస్థపైనే చేస్తాను. మళ్లీ వలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్లీ సేవలు అందించే కార్యక్రమం ప్రారంభిస్తాను. ఇదే చంద్రబాబును అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు మీ హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు కదా… పెన్షన్‌ కావాలన్నా, రేషన్‌ కావాలన్నా, సర్టిఫికెట్‌ కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం ఇస్తే కానీ వివక్ష లేకుండా ఏ ఒక్క పేదవాడికి అప్పట్లో అందే పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజు జన్మభూమి కమిటీలు ఏ మాదిరి పని చేశాయో అందరికీ తెలుసు. ఇవాళ వలంటీర్‌ వ్యవస్థ అన్నది జగన్‌ ను అభిమానించే ఈ సైన్యం ఎలా పని చేస్తోంది అంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉంది’ అని సీఎం జగన్‌ అన్నారు. మరో 5 వారాల్లో జరగనున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగేవి కాదన్నారు. మనం వేసే ఈ ఓటుతో మన కుటుంబానికి చెందినవారి తలరాతలు నిర్ణయించే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అంటూ ప్రసంగించారు. జగనన్నను ఓడిరచాలని వారు, పేదలను గెలిపించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్నిసొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా అని ప్రశ్నించారు. వలంటీర్లను ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇవ్వకుండా ఆపేయించి 31మంది అవ్వాతాతలు మృతి చెందడానికి చంద్రబాబు కారకులయ్యారని ఆరోపించారు. ఆయన్ను హంతకుడు అనలేమా అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తువచ్చేవి వెన్నుపోట్లు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు.. అందుకే జగన్‌ కు రాష్ట్రమంతా కోట్ల మంది ఉంటే.. చంద్రబాబుకు మాత్రం నా అనేవాళ్లు పక్క రాష్ట్రంలో ఉన్నారన్నారు. తనకు వారిలాగా కుట్రలు, జిత్తులు, పొత్తులతో పని లేదని, ఇంటి ఇంటికి మంచి చేశాం కాబట్టే మళ్లీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో ప్రజల ముందుకు వస్తున్నానన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు, మోసం చేయడు, చేయలేని వాగద్ధానాలతో మేనిఫేస్టో పెట్టడన్నారు. చంద్రబాబు మోసాల, అబద్ధాలతో నిండిన కిచిడి మేనిఫేస్టోతో తాను పోటీ పడాలనుకోవటం లేదని చెప్పారు. 58 నెలల పాలనలో మేనిఫెస్టోలో చెప్పని పనులు కూడా చేశామనానరు. భవిష్యత్తులో ప్రతి ఇంటకి చేయగలిగినంత మంచి చేస్తానన్నారు. మరోసారి వైసీపీని గెలిపించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img