Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

మోదీ మెడలు వంచిన జనం

యూపీలో తీవ్ర భంగపాటు

భారీగా తగ్గిన బీజేపీ మెజారిటీ… అయోధ్యలో ఓటమి

. ఎన్‌డీయే కూటమికే 291 సీట్లు
. దీటుగా పోటీ ఇచ్చిన ఇండియా కూటమి
. 235 సీట్లతో దూసుకెళ్లిన కాంగ్రెస్‌`మిత్రులు

న్యూదిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పెద్దఎదురు దెబ్బ తగిలింది. బీజేపీకి 370…ఎన్‌డీఏకు 400 సీట్లు నినాదంతో దేశమంతా తిరిగిన ప్రధాని మోదీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. బీజేపీకి సొంతంగా కేవలం 240 సీట్లు మాత్రమే రాగా…ఎన్‌డీయేకు 291 సీట్లు దక్కాయి. రామమందిరం పేరుతో ఓట్లు రాబట్టుకోవాలన్న బీజేపీ కుట్రలను విపక్షాలు, ప్రజలు తిప్పికొట్టారు. ప్రత్యేకించి ఎంతో నమ్మకం పెట్టుకున్న ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గాయి. కాగా, అత్యంత ప్రమాదరకరంగా తెలుగు రాష్ట్రాల్లో(తెలంగాణలో 8, ఆంధ్రప్రదేశ్‌లో మూడు) 11 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంది. బీజేపీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం రానప్పటికీ ఎన్‌డీఏగా 291 సీట్లు సాధించింది. దీంతో తిరిగి అధికారం చేపట్టేందుకు అవకాశం ఏర్పడిరది. అయితే, బీజేపీ దూకుడుకు ఇండియా కూటమి దీటుగా అడ్డుకట్ట వేసింది. పశ్చిమబెంగాల్‌లో సైతం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఎన్‌డీఏకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ‘400 పార్‌’కు దూరంగా బీజేపీ తన ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలపై ఆధారపడిన అస్థిరమైన మెజారిటీతో పోరాడవలసి వచ్చింది. అయితే ప్రతిపక్ష ఇండియా కూటమి బలీయమైన శక్తిగా అవతరించింది. బీజేపీ ఓట్ల శాతం తగ్గుదల కాంగ్రెస్‌కు భారీ లాభం చేకూర్చింది. ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఓట్ల శాతం 46.2 శాతం కాగా, ఇండియా కూటమి ఓట్ల శాతం 41.3 శాతంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల ఓట్లు లెక్కిస్తున్నంత సేపూ అధికార ఎన్‌డీఏ కూటమి ఆశించిన, ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన స్పష్టమైన సంఖ్యకు చేరుకోలేదు. ఒకే పార్టీ పాలనకు చెందిన ఆధిపత్యంలో మార్పు, సంకీర్ణ రాజకీయాలకు తిరిగి రావడాన్ని సూచిస్తూ 543 సీట్లు గల పార్లమెంటులో మ్యాజిక్‌ సంఖ్య 272 కంటే చాలా దిగువున బీజేపీ 240 స్థానాలకే పరిమితమైంది. ఇక ఇండియా కూటమి 235 స్థానాలతో ముందుకు కొనసాగుతోంది. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ 100 సీట్లకు చేరుకుంది. 2019లో కాంగ్రెస్‌ సాధించిన సీట్లకంటే ఇవి రెట్టింపు కావడం విశేషం. గత ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 303 సీట్లు రాగా, ఎన్‌డీఏకు 350కి పైగా సీట్లు వచ్చాయి. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ బీజేపీని బాగా దెబ్బతీసింది. రాజస్థాన్‌, హర్యానాలో, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ మాట్లాడుతూ ‘బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. దేశ ప్రజలు మోదీ వెంటే ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు. మరోవైపు, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఫలితాలపై స్పందిస్తూ మోదీపై విరుచుకుపడ్డారు. ‘ఇప్పుడు పదవీ విరమణ చేసిన ప్రధాని మాజీ కాబోతున్నారని రుజువైంది. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయండి. ఇదే ఈ ఎన్నికల సందేశం’ అని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’ లో పేర్కొన్నారు. ఇదిలాఉండగా, 80 సీట్లతో దేశంలోనే అత్యంత రాజకీయ ప్రాధాన్యత గల రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ సంచలన తీర్పు వెలువరించింది. సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌ కూటమి బీజేపీ వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేయడం ద్వారా బీజేపీని దాని బలమైన కోటలో తిప్పికొట్టింది. గతసారి గెలిచిన 62 స్థానాల నుంచి కేవలం 36 స్థానాలకు మాత్రమే బీజేపీని పరిమితం చేసింది. అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఎస్‌పీ 2019లో సాధించిన ఐదు స్థానాల నుంచి 34 స్థానాల్లో ఆధిక్యానికి ఎదిగింది. కాంగ్రెస్‌ ఆరు స్థానాలు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. వారణాసిలో మోదీ 1.52 లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. అయితే, ఆయన పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ అమేథీలో కాంగ్రెస్‌ అభ్యర్థి, గాంధీ కుటుంబ సన్నిహితుడు కిషోరీ లాల్‌ శర్మ చేతిలో 1.31 లక్షల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రాయ్‌ బరేలీ నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, లక్నో నుంచి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కన్నౌజ్‌ నుంచి ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ విజయం సాధించారు. అఖిలేశ్‌ యాదవ్‌ ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమికి మంచి ఫలితం ఇచ్చారు. ప్రతిపక్ష కూటమికి మరో కీలక మిత్రపక్షమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ పశ్చిమ బెంగాల్‌లో 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2019లో ఆ పార్టీ సాధించిన 22 సీట్ల కంటే ఎక్కువ. బీజేపీ ఈ రాష్ట్రంలో గత లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాలు సాధించగా, ఇప్పుడు 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం 29 స్థానాల్లో బీజేపీ గెలుపొందడం లేదా ముందంజ వేయడంతో మధ్య ప్రదేశ్‌ పూర్తిగా కాషాయ రంగులోకి మారింది. గుజరాత్‌లో కూడా బీజేపీ 26 స్థానాలకుగాను 25 స్థానాల్లో విజయం లేదా ఆధిక్యంలో ఉంది. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి అంత నిర్ణయాత్మకంగా లేదు. బీహార్‌లో బీజేపీ 12 స్థానాల్లో, దాని మిత్రపక్షం జేడీ(యూ) 13 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌జేడీ) నాలుగు స్థానాల్లో విజయం దిశగా అడుగులు వేస్తోంది. రాజస్థాన్‌లో బీజేపీ 14 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ దాని కూటమితో కలిసి 25 గెలుచుకుంది. కాంగ్రెస్‌ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హర్యానాలో కూడా బీజేపీకి దిగ్భ్రాంతి కలిగించే ఫలితాలు వచ్చాయి. హిందీ రాష్ట్రాలలో ప్రతిపక్ష ఇండియా కూటమి నిరుద్యోగం, ధరల పెరుగుదల సమస్యల చుట్టూ మద్దతుదారులను కూడగట్టింది. మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలు ఉండగా ఐదేళ్ల క్రితం 23 సీట్లు గెలుచుకున్న బీజేపీ…ఇప్పుడు 11 స్థానాలకే పరిమితమైంది. దాని మిత్రపక్షమైన శివసేన ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు, కాంగ్రెస్‌ ఒక స్థానం నుంచి ఎదిగి 12 స్థానాల్లో, శివసేన (యూబీటీ) 19 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఎన్‌సీపీ శరద్‌ పవార్‌ వర్గానికి ఏడు సీట్లు లభించే అవకాశం కనిపిస్తోంది. ఇండియా కూటమికి 38 స్థానాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ 25 లోక్‌సభ స్థానాలకు గాను 16, బీజేపీ 3, వైసీపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి.
ఒడిశా, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మార్పు
ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌ (బీజేడీ) అనూహ్య ఓటమి చవిచూసింది. పట్నాయక్‌ ముఖ్యమంత్రిగా ఆరోసారి రికార్డు సృష్టించే ప్రయత్నాన్ని బీజేపీ అడ్డుకుంది. ఒడిశాలో కనీసం 79 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం సాధించింది. మరోవైపు రాష్ట్రంలోని 147 అసెంబ్లీ స్థానాలకుగాను 48 నియోజకవర్గాల్లో బీజేడీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో 135 స్థానాల్లో ఆధిక్యంతో అధికారం దిశగా దూసుకుపోయింది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైసీపీ) కేవలం 11 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. బీజేపీ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు బీజేపీకి దూరం
ఎన్నికల సంఘం విడుదల చేసిన సంఖ్యల ప్రకారం, ముస్లిం ఓటర్లు బీజేపీకి దూరమైనట్లు తెలుస్తోంది. అయితే ఇది కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చలేదు. 2019లో ముస్లింల ప్రాబల్యం ఉన్న 103 స్థానాల్లో బీజేపీ 45, కాంగ్రెస్‌ 11, ఇతరులు 47 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఈసారి బీజేపీ 35, కాంగ్రెస్‌ 12, ఇతరులు 55 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. భారత్‌ను కాంగ్రెస్‌ను దూరం చేయాలనే బీజేపీ లక్ష్యం ఇప్పుడు మరింత దూరంలో కనిపిస్తోంది. 2019లో కేవలం 52 సీట్లకు తగ్గిన కాంగ్రెస్‌ పార్టీ ఈసారి భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. 95 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తెలంగాణలో మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్‌ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2019లో రాష్ట్రంలో కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2019లో కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకుంది. రాజస్తాన్‌లో 2019లో కాంగ్రెస్‌ తన లోక్‌సభ ఖాతాను తెరవడంలో విఫలమైంది. ఈసారి మాత్రం 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక హర్యానాలో గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించని స్థాయి నుంచి ఇప్పుడు ఐదు సీట్లు గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
రామ మందిరం ప్రభావం లేదు
అయోధ్యలోని రామ మందిరానికి సంబంధించిన ప్రాణ ప్రతిష్ఠ యూపీలోను, అంతకు మించి దేశంలోనూ ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఈ వ్యూహం కాషాయ పార్టీకి ఏమాత్రం పని చేయలేదని తెలుస్తోంది. రామమందిరం ఉన్న అయోధ్య పరిధిలోకి వచ్చే ఫైజాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌పై సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి అవదేశ్‌ ప్రసాద్‌ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img