London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

రహదారులు రక్తసిక్తం

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిదిమంది దుర్మరణం

విశాలాంధ్ర – చంద్రగిరి/పార్వతీపురం/గన్నవరం: అతి వేగమో…నిర్లక్ష్యమో… కారణం ఏదైనా కానీ ఘోర రోడ్డు ప్రమాదాలు నిత్యం ఎందరినో పొట్టనబెట్టుకుంటున్నాయి. రాష్ట్రంలో సోమవారం వేర్వేరు చోట్ల జరిగిన మూడు ఘోర రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది దుర్మరణం చెందగా అనేకమంది గాయాలపాలయ్యారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం. కొంగరవారి పల్లి సమీపంలో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. నరసాపురానికి చెందిన వీరు వైద్యం కోసం సోమవారం తెల్లవారురaామున కారులో తమిళనాడులోని వేలూరు సీఎంసీకి బయలుదేరారు. కొంగర వారిపల్లి సమీపంలో కారు అతివేగంగా వచ్చి జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవ్వగా… తీవ్ర గాయాలతో కారు డ్రైవర్‌ షమీర్‌ బాషా (30), అందులో ప్రయాణిస్తున్న పద్మమ్మ (50), జయంతి (45), శేషయ్య (47) అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాసులు (49), నీరజ (46)కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఇరుక్కున్న మృతదేహాలను పోలీసులు అతి కష్టం మీద బయటకు తీశారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీని ఢీకొట్టిన కారు
కృష్ణ జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టిన ఘటనలో తమిళనాడుకు చెందిన నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ కుటుంబం కొవ్వూరు నుంచి తమిళనాడుకు కారులో వెళ్తుండగా…డ్రైవర్‌ నిర్లక్ష్యంతో అదుపు తప్పిన కారు డివైడర్‌ పైనుంచి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వామినాథన్‌ (40), రాకేష్‌ (12), రాధప్రియ (14), గోపి(23) అక్కడిక్కడే మృతి చెందారు. సత్య (స్వామినాథన్‌ భార్య) తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను అంబులెన్సు లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘాట్‌ రోడ్డులో ఆటోబోల్తా
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం వంబరిల్లి ఘాట్‌ రోడ్డులో ఆటో బోల్తా పడిరది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 17 మంది గిరిజనులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘాట్‌ రోడ్డు ఎక్కుతున్న సమయంలో ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఆటో నుజ్జునుజ్జయింది. బాధితులంతా సీతంపేట సంత పూర్తి చేసుకొని తిరిగి ఇంటికివెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన విషయం తెలుసుకున్న స్ధానికులు లోయలోకి దిగి క్షతగాత్రులను బయటకు తీసి, సీతంపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రధాన వైద్యాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది వైద్య సేవలు అందించారు. ప్రథమచికిత్స అనంతరం 10 మందిని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో 12 ఏళ్ల కార్తీక్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలం, ఆస్పత్రి వద్ద క్షతగాత్రులు, బాధితుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. సీతంపేట పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులను పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్ధి నిమ్మక జయకృష్ణ పరామర్శించారు. గిరిజన గూడెంలో ఉంటున్న వారంతా కలిసి నిత్యవసర వస్తువులు కొనుగోలు కోసం సీతంపేట సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా… వారి ఇళ్లకు సమీపంలోనే ఆటో బోల్తాపడిరది. దీనిపై ఉన్నతాధికారులు కూడా స్పందించి గిరిజన కుటుంబీకులకు మెరుగైన వైద్యసహాయం అందించడంతోపాటు వారిని ఆదుకోవాలని గిరిజన సంఘాల నేతలు కోరుతున్నారు. అధికారులు స్పందించి… మానవతా దృక్పథంతో క్షతగాత్రులను ఆదుకోవాలని సీపీఐ మన్యం జిల్లా కార్యదర్శి కోరాడ మన్మధరావు కోరారు. కాగా సోమవారం ఉదయం జరిగిన ఆటోబోల్తా సంఘటనపై రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీవీజీ శంకరరావు ఆరా తీశారు. సంబంధిత అధికారులు, వైద్యులతో స్వయంగా మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img