Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వేసవి గట్టెక్కేదెలా?

. అడుగంటిన రిజర్వాయర్లు
. ప్రమాదకర స్థితికి భూగర్భ నీటిమట్టాలు
. తాగునీటి సమస్యలతో అల్లాడుతున్న ప్రజలు, పశువులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో ఈ ఏడాది తాగునీటి ఎద్దడి సమస్య తీవ్రత ఎక్కువగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధాన రిజర్వాయర్లు శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులన్నీ అడుగంటాయి. మరోవైపు ఈ ఏడాది నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ నీటిమట్టాలు ప్రమాదకర స్థితికి పడిపోయాయి. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మంచినీటి బావులు, చెరువులు ఒట్టిపోయాయి. బోరు బావులు ఎండిపోతున్నాయి. చేతిపంపులకు కూడా నీరు అందని పరిస్థితి నెలకొంది. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలు గడిచేదెలా? అని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో తలమునకలు కావడంతో నీటి ఎద్దడి నివారణా చర్యలను పట్టించుకునేవారే కానరావడం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనిపై తరచూ అధికారులను హెచ్చరిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆదేశాలు అమలు కావడం లేదు. తాగునీటి ఎద్దడి సమస్యతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌ 215.81 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 34.7 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అంటే ప్రాజెక్టు సామర్థ్యంలో 16.8 శాతానికి నీటి మట్టం పడిపోయింది. అలాగే నాగార్జున సాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టులో 513.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం 137.76 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేయడంతో దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు కూడా చుక్క నీరు రావడం లేదు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల సాగు, తాగు నీటి సమస్య పరిష్కారానికి దోహదపడే పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.66 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. చివరకు వీటీపీఎస్‌ నిర్వహణ కోసం ఎల్లప్పుడూ 3 టీఎంసీల నీరు నిల్వ ఉండే ప్రకాశం బ్యారేజీ కూడా ప్రస్తుతం 1.68 టీఎంసీల కనీస నీటి నిల్వతో వెలవెలబోతోంది. మరోవైపు, రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఏడు జిల్లాలు మినహా 19 జిల్లాల్లో భూగర్భ నీటిమట్టాలు ప్రమాదకర స్థితికి పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే మార్చిలో మూడు మీటర్ల దిగువకు నీటిమట్టాలు పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. కోస్తాంధ్ర ప్రాంతాల్లోనూ భూగర్భ జలాల పరిస్థితి నిరాశజనకంగా ఉండగా, కరువు ప్రాంతం అయిన రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ప్రకాశం జిల్లాలో సగటు భూగర్భ జల లభ్యత గత ఏడాదితో పోలిస్తే 8 మీటర్లకు, సత్యసాయి జిల్లాలో 5.22 మీటర్ల దిగువకు పడిపోయింది. అలాగే అనంతపురం, నంద్యాల, పల్నాడు, అన్నమయ్య, కర్నూలు జిల్లాల్లో భూగర్భ నీటిమట్టాలు ప్రమాదకర స్థితికి చేరాయి. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. చెరువులు, కాలువలు, కుంటలు ఎండిపోవడంతో పశువులు కూడా దాహార్తితో అల్లాడుతున్నాయి. వేసవి ఎండలు తీవ్రం కావడంతో విద్యుత్‌ వినియోగం కూడా వారం రోజుల నుంచి గణనీయంగా పెరిగింది. దీంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక అనధికార విద్యుత్‌ కోతలు అమలవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే చెరువులన్నీ నింపాలని, విద్యుత్‌ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని, నీటి ఎద్దడి ప్రాంతాల్లో ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img