Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

వైసీపీ పెన్షన్‌ అస్త్రం

. వలంటీర్ల రాజీనామాలకు ఒత్తిడి
. ఈసీ నిర్ణయాన్ని ప్రతిపక్షాలపై రుద్దే యత్నం
. వృద్ధుల్ని ఇబ్బంది పెడుతున్నారని దుష్ప్రచారం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వలంటీర్ల సేవలపై ఈసీ విధించిన ఆంక్షలను వైసీపీ తన ఎన్నికల ప్రచారానికి అస్త్రంగా ప్రయోగిస్తోంది. ప్రతిపక్షాల ఫిర్యాదుల వల్లే ఎన్నికల కమిషన్‌ వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టిందని… ఫలితంగా అవ్వా, తాతలు మళ్లీ అవస్థలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వైసీపీ విస్తృత ప్రచారం చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలందరికీ దీనినే ప్రధాన అంశంగా ప్రచారం చేయాలని ఆదేశించి, ప్రతిపక్షాలను పెన్షన్‌ దారుల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వలంటీర్లచే బలవంతపు రాజీనామాలు చేయించడం ద్వారా పెన్షన్‌దారుల సానుభూతి పొందేందుకు,ప్రత్యర్థులపై మరింత ఒత్తిడి పెంచే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రతి నెలా పెన్షన్‌లు తీసుకునేవారు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ఇతరులు కలిపి దాదాపు 66లక్షల మంది ఉన్నారు. వీరిని అధికారపార్టీ అతిపెద్ద ఓటు బ్యాంక్‌గా భావిస్తోంది. వీరందరికీ ప్రతి నెలా వలంటీర్లు 1వ తేదీ తెల్లవారురaామునుంచే ఇంటికి వెళ్లి నేరుగా పెన్షన్‌కు సంబంధించిన నగదు వారి చేతుల్లో పెడతారు. ఈ ప్రక్రియ వాస్తవానికి పెన్షన్‌దారులకు చాలా సౌకర్యంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకొచ్చిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతోంది. అందుకే వైసీపీ ఈ ఓటు బ్యాంక్‌ను కాపాడుకునేందుకు ఈసీ ఆంక్షలను సద్వినియోగం చేసుకునే యత్నం చేస్తోంది. ఈ వలంటీర్లు అందరూ అధికారపార్టీకి చెందినవారు కావడంతో, ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలంటే వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ఈసీకి ఫిర్యాదు చేసింది. హైకోర్టులో కూడా పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వారిని ఎన్నికలు ముగిసేవరకు పెన్షన్‌ల పంపిణీకి దూరంగా ఉంచాలని ఆదేశించింది. వారినుంచి ట్యాబ్‌లు, సెల్‌ఫోన్‌ సిమ్‌లు స్వాధీనం చేసుకోవాలని సూచించింది. పెన్షన్‌లను ప్రభుత్వం ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసుకోవచ్చునని ప్రత్యామ్నాయాన్ని సూచించింది. అయితే పెన్షన్‌ల పంపిణీకి కేవలం 48 గంటలు ముందుగా ఈసీ నుంచి ఈ ఆదేశాలు రావడం, మార్చి 31వ తేదీ ఆదివారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం దీనిపై ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో జాప్యం చోటు చేసుకుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా పెన్షనర్ల ఓటు బ్యాంక్‌ను ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, ప్రతిపక్షాల దుర్భుద్ధి వల్లే వృద్ధులు ఇబ్బందిపడాల్సి వస్తుందంటూ ప్రచారం చేపట్టారు. మరోవైపు సోషల్‌ మీడియాలో కూడా చంద్రబాబు అండ్‌ టీం చేసిన ఫిర్యాదుల కారణంగానే అవ్వా, తాతలకు పెన్షన్లు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పెన్షనర్ల సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన ప్రతిపక్ష నేత చంద్రబాబు అవ్వాతాత అంటూనే జగన్‌ వృద్ధులనూ మోసం చేస్తున్నాడని ఎదురుదాడికి దిగారు. అంతేగాక రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఖజానా ఖాళీ చేసి పెన్షన్‌ ఇవ్వలేకపోయిన జగన్‌, ఆ నెపాన్ని తమపై, ఎన్నికల సంఘంపై నెడుతున్నాడని దుయ్యబట్టారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒక్కరోజులోనే పెన్షన్‌ అందించే అవకాశం ఉన్నా ఇవ్వలేదని విమర్శించారు. వలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయనీయకూడదని టీడీపీ ఎవరినీ కోరలేదు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పలేదు. ప్రభుత్వ పథకాలకు ఇవ్వాల్సిన డబ్బులు, సొంత కాంట్రాక్టర్లకు జగన్‌ ఇచ్చుకున్నాడు. తన రాజకీయ లబ్ధి కోసం నడి వేసవిలో వృద్ధులు, వికలాంగులకు కూడా జగన్‌ ఇంటింటికీ పెన్షన్‌ ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. ఇంటింటికీ పెన్షన్‌ ఇచ్చేలా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ నేతలు కలెక్టర్లు, మండల నేతలు తహశీల్దార్లను కలిసి కోరాలని సూచించారు. వలంటీర్ల విషయంలో టీడీపీ స్పష్టమైన వైఖరితో ఉందని, మీ భవిష్యత్‌ ను చూసుకునే బాధ్యత మాది అని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. ఇదే విషయాన్ని వలంటీర్లు అందరికీ చెప్పాలని, వైసీపీ రాజకీయ క్రీడలో పావులు కాకుండా వారిని కాపాడాలని సూచించారు. మొత్తానికి ఈ రాజకీయ దుమారంపై అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌ రెడ్డి సోమవారం దీనిపై అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్‌ల పంపిణీకి ఆదేశించారు. గతంలో వలంటీర్లు ఇచ్చిన విధంగానే నేరుగా లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. అయినప్పటికీ తొలిసారి చేపడుతున్న ఈ ప్రక్రియ ఆచరణలో ఎలా జరుగుతుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img