Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అక్టోబరులో థర్డ్‌ వేవ్‌

ముప్పు ముంచుకొస్తున్నట్లు కేంద్రానికి ఎన్‌ఐడీఎం నివేదిక

పిల్లల పైనే అధిక ప్రభావమని హెచ్చరిక
ప్రస్తుత వైద్య సదుపాయాలపై అసంతృప్తి
మెరుగైన సన్నద్ధ చర్యలు అవసరమని స్పష్టీకరణ

బెంగళూరు : దేశంలో కోవిడ్‌`19 ‘థర్డ్‌ వేవ్‌’ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనేక రాష్ట్రాలలో లాక్‌డౌన్ల సడలింపు, ఎత్తివేత జరిగాయి. అలాగే సంవత్సర కాలానికి పైగా రోజువారీ కొత్త కేసుల నమోదులో తగ్గుదలను దేశ రాజధాని నివేదించింది. అయితే ‘థర్డ్‌ వేవ్‌’ అక్టోబరులో శిఖర స్థాయికి చేరుకుంటుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణులు బృందం ఒకటి స్పష్టం చేసింది. ముప్పును ఎదుర్కోవడానికి ప్రస్తుత వైద్య సదుపా యాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్‌లో కోవిడ్‌ మహమ్మారి మొదటి దశ సెప్టెంబరు 2020లో శిఖర స్థాయికి చేరుకోగా, మే, 2021లో రెండవ తరంగం మరణ మృదంగం మోగించింది. కాగా థర్డ్‌ వేవ్‌ అధికంగా పిల్లల పైన ప్రభావం చూపించవచ్చని అనేక మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, పిల్లలకు ఇప్పటి వరకు టీకా వేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌ఐడీఎం) కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, భారత్‌లో అక్టోబరులో థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తన నివేదికను సమర్పిం చింది. ప్రత్యేక అవసరాలున్న చిన్నారులు, ఇతర వ్యాధు లతో బాధపడుతున్న పిల్లలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి కోవిడ్‌ వాక్సినేషన్‌ చర్యలను ముమ్మరం చేయాలని, పిల్లల అవసరాలకు అనుగుణంగా పిల్లల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. థర్డ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్యం కోసం సన్నద్ధం కావాలని, ప్రస్తుతం వైద్య సదుపాయాలు సరిపోవని నివేదికలో వెల్లడిరచింది. ఇక పిల్లలకు వైద్యం కోసం సిబ్బందిని, వైద్య పరికరాలు, వెంటిలేటర్లు, అంబులెన్స్‌ల సంఖ్యను పెంచాలని సూచించింది. దేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 82 శాతం శిశు వైద్యుల కొరత ఉండగా.. దేశ వ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో 63 శాతం ఖాళీలు ఉన్నట్లు ఎన్‌ఐడీఎం నివేదిక తెలిపింది. థర్డ్‌ వేవ్‌ ముప్పును దృష్టిలో పెట్టుకుని వైద్యుల కొరత, ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. ‘థర్డ్‌ వేవ్‌ ప్రిపెర్డ్‌నెస్‌ : చిల్డ్రన్‌ వల్నరబిలిటీ అండ్‌ రికవరీ’ పేరుతో కూడిన ఈ నివేదిక అందు బాటులో ఉన్న సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఒక వార్తా సంస్థ కథనం పేర్కొంది. ఇదిలాఉండగా, సార్స్‌కోవ్‌2 డెల్టా వేరియంట్‌తో హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించడం అసాధ్యమని, ఈ వైరస్‌ భారతదేశానికి అంటువ్యాధిగా మారవచ్చని, కోవిడ్‌ మహమ్మారి కాలాను గుణ వ్యాప్తికి కారణమవుతుందని ఏకాభిప్రాయం పెరుగు తోంది. అయితే పిల్లలతో ప్రధాన ఆందోళన మరణం కాదని, శాస్త్రీయ నివేదికలను పరిశీలిస్తే, ఈ వ్యాధి యువకులలో చాలా తక్కువ ప్రమాదకరమని సూచిస్తు న్నాయి. వారు తమ శరీరంలోని వైరస్‌తో ఇతరులకు వ్యాప్తి చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్‌ మహమ్మారి విషయంలో పెద్దల్లో కంటే పిల్లలో మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పిల్లలు మహమ్మారి నుంచి కోలుకున్న అనంతరం మల్టీ-సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌(ఎంఐఎస్‌సి) అనే వ్యాధిని ఎదుర్కొంటున్నట్లు వెల్లడయ్యింది. కరోనా నుంచి కోలు కొన్న 15 ఏళ్ల లోపు పిల్లలకు ఈ వ్యాధి ఎక్కువగా సోకు తోంది. ఇది సోకినప్పుడు శరీరంలోని వివిధ భాగాల్లో మంట పుడుతుంది. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, బ్రెయిన్‌, చర్మం, కళ్లు, పొట్టలో అవయవాలకు ఈ మంట వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతోందో ఇప్పటికీ తెలియ దని అమెరికాలో వ్యాధుల నియంత్రణ సంస్థ పేర్కొంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా గతవారం మాట్లాడుతూ పిల్లలకు కోవిడ్‌19 వాక్సిన్లను త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. 2 నుంచి 18 సంవత్సరాల వయస్సు గత పిల్లల్లో కోవాగ్జిన్‌ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలు సెప్టెంబరులో అందవచ్చని న్యూదిల్లీ ఏఐఐఎం ఎస్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. 12 సంవత్స రాలు పైబడిన వయస్సు వారికి అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ కాడిలా తయారు చేసిన కోవిడ్‌`19 టీకా జైకోవ్‌-డిని భారత ఔషధ నియంత్రణ మండలి ఆగస్టు 20న ఆమోదించింది. భారతదేశంలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి ఆమోదించబడిన మొదటి టీకా ఇది. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం కరోనా మహమ్మారిపై నిపుణుల సిఫార్సులను పట్టించుకోక పోవడంపై పదేపదే విమర్శలు ఎదుర్కొంటోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img