Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అప్పు ఏడు లక్షల కోట్లే

. ప్రతిపక్షాలది దుష్ప్రచారం మాత్రమే
. టీడీపీ హయాంలోనే రుణాలెక్కువ
. చంద్రబాబు మేనిఫెస్టో ఓ మాయాజాలం
. విభజన వల్ల చాలా నష్టపోయాం
. అయినా సుపరిపాలన అందించాం
. ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ అప్పు మొత్తం కలిపి రూ.7 లక్షల కోట్లేనని, వాస్తవాలు తెలుసు కోకుండా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నా యని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మండిపడ్డారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మంగళ వారం సీఎం జగన్‌ మాట్లాడారు. ‘ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చాం. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచాం. దాదాపు రూ.2 లక్షల 55 వేల కోట్లు పేదలకు నేరుగా అందజేశాం. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే మా తాపత్రయం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇంటింటి ఆర్థిక స్థితిని మార్చాం’ అని సీఎం వివరించారు. ‘చంద్రబాబు ఏనాడూ మంచి చేసింది లేదు. అయినా కేంద్రం కంటే రెట్టింపు స్థాయిలో బాబు అప్పులు తెచ్చాడు. కానీ మనమే ఎక్కువ అప్పులు చేశామని అబద్ధాల బ్యాచ్‌ ప్రచారం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 6.5 శాతం అప్పులు చేస్తే…రాష్ట్ర ప్రభుత్వం 5.2 శాతం మాత్రమే చేసింది. ఏ రకంగా చూసినా గత ప్రభుత్వానికి, మనకూ ఎంత వ్యత్యాసముందో చెప్పేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. విభజన నాటికి రూ.లక్షా 53 వేల కోట్ల అప్పు ఉంటే… చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.4.12 లక్షల కోట్లకు చేరింది. ఇప్పుడది ఏడు లక్షల కోట్ల పై చిలుకుగా ఉంది. మన హయాంలో ఆర్థికసంఘం సిఫారసుల కంటే కూడా రూ.366 కోట్లు తక్కువ తీసుకున్నాం. చంద్ర బాబు హయాంలో రూ. 15,227 కోట్లు సగటున ఖర్చు చేస్తే… మన హయాంలో రూ.17,757 కోట్లు ఖర్చు చేశాం. రూ.2 లక్షల 55 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. ఇవిగాక నాన్‌ డీబీటీ ద్వారా రూ.లక్షా 76 వేల కోట్లు అందించాం’ అని సీఎం వెల్లడిరచారు. ‘ఈ వాస్తవాలను పక్కనబెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు మరలా కొత్త మేనిఫెస్టోలో ప్రజల్లోకి వెళ్లి వారిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రూ.70 వేల కోట్లకే రాష్ట్రం శ్రీలంక అవుతుందని అంటున్న చంద్రబాబు…రూ.1.26 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి’ అని జగన్‌ ప్రశ్నించారు. అదేమంటే సంపద సృష్టిస్తానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటు న్నారని విమర్శించారు. పధ్నాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు గతంలో ఏ మేరకు సంపద సృష్టించారో ఆయన పాలనలో రెవెన్యూ లోటు చూస్తే తేటతెల్లమవుతుందని ఎదురుదాడి చేశారు. నిజంగానే చంద్రబాబు అంత గొప్ప విజనరీ అయితే… ఆయన పాలనలో రాష్ట్రం మెరుగుపడి ఉంటే… ఆయన హయాంలో దేశ జీడీపీలో మన వాటా 4.47 శాతం మాత్రమేనని, అదే వైసీపీ ప్రభుత్వ హయాంలో 4.82 శాతం ఉందన్నారు. దీన్నిబట్టి చూస్తే ఎవరు సంపద సృష్టించారో స్పష్టంగా తెలుస్తుందన్నారు.
ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు వాగ్దానాలు ఉంటాయని, మనం రూ.70 వేల కోట్లకే చాలా కష్టాలు పడుతూంటే బాబు రూ.1.26 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం సాధ్యమేనా? ఇలా మోసం చేయడం, కుట్రలు పన్నడం ధర్మమేనా అని చంద్రబాబును ప్రశ్నించారు. ‘ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని కొన్ని పథకాలు రద్దు చేయలేదు. వాటిలో పెన్షన్లకు అయ్యే రూ.23,600 కోట్లు, రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తు రూ.11,000 కోట్లు, సబ్సిడీ బియ్యం రూ.4600 కోట్లు, ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా రూ.4,400 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.2,800 కోట్లు, వసతి దీవెన రూ.2,200 కోట్లు, సంపూర్ణ పోషణ కింద బాలింతలు, గర్భిణులు, ఆరేళ్ల లోపు చిన్నారులకు రూ.2,200 కోట్లు, గోరుముద్ద కింద పోషకాహారం కోసం రూ.1,900 కోట్లు…మొత్తం ఈ ఎనిమిది పథకాలకు రూ.52,700 కోట్లు ఖర్చు అవుతోంది. వీటిని ఏ ప్రభుత్వం కూడా రద్దు చేయలేదు. వీటికి మించి ఇస్తానని చెప్పడమంటే అది ప్రజలను మోసగించడమేనన్నారు. బాబు వయసు 75 సంవత్సరాలు. రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అయింది. మొదటిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు అవుతోంది. మూడుసార్లు సీఎం అయిన తరువాత కూడా ఇప్పటికీ ఫలానా పని చేశాను కాబట్టి తనకు ఓటేయండని చంద్రబాబు అడగలేకపోతున్నాడని జగన్‌ విమర్శించారు. మరోసారి అవకాశమిస్తే అది చేస్తా.. ఇది చేస్తా అని మాత్రమే అంటున్నారన్నారు.
చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని, పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ఆరోపించారు. మన 57 నెలల ప్రయాణంలో ఎక్కడా అవినీతికి తావివ్వలేదన్నారు. వివక్ష లేకుండా ప్రతి రూపాయి ప్రజలకు చేరుతోందని, బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. వాస్తవానికి తెలంగాణతో పోలిస్తే ఏపీ ఆదాయం తక్కువ. విభజన కారణంగా ఏటా రూ.13 వేల కోట్లు నష్టపోయాం. అంటే ఈ ఐదేళ్లలో లక్ష కోట్ల అదనపు ఆదాయం కోల్పోయాం. దీనికితోడు కరోనా కారణంగా రెండు ఆర్థిక సంవత్సరాలు తీవ్రంగా నష్టపోయాం. ఆదాయం తగ్గడంతో పాటు ఖర్చులూ పెరిగాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గాయి. ఈ కష్టాలను ఎదుర్కొని ఐదేళ్లు సుపరిపాలన అందించగలిగామన్నారు. మంచి జరిగితేనే తనకు అండగా ఉండాలని ప్రజలకు జగన్‌ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img