Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆ ఎమ్మెల్యేలపై అనర్హత

హిమాచల్‌ స్పీకర్‌ సంచలన నిర్ణయం
ఆరుగురు కాంగ్రెస్‌ శాసనసభ్యుల సభ్యత్వం రద్దు
తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటన

షిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక్క స్థానానికి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిరది. కాంగ్రెస్‌ గుర్తుపై పోటీ చేసిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలను ఉల్లఘించినందుకు అనర్హత వేటు వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్‌ కుల్దీప్‌ సింగ్‌ పథానియా స్పష్టం చేశారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను రాజిందర్‌ రాణా, సుధీర్‌ శర్మ, ఇందర్‌ దత్‌ లఖన్‌పాల్‌, దేవిందర్‌ కుమార్‌ భూటూ, రవి ఠాకూర్‌, చెతన్య శర్మగా స్పీకర్‌ వెల్లడిరచారు. తక్షణమే అమల్లోకి వస్తుందని మీడియా ముఖంగా ప్రకటించారు. ఎమ్మెల్యేల అనర్హతపై బుధవారం తన తీర్పును రిజర్వ్‌ చేసిన స్పీకర్‌ కుల్దీప్‌ సింగ్‌ పఠానియా- హస్తం పార్టీ గుర్తుపై ఎన్నికైనందున ఈ శాసనసభ్యులు కాంగ్రెస్‌ విప్‌ను ధిక్కరించి ఫిరాయింపు నిరోధక చట్టాన్ని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. స్పీకర్‌ నిర్ణయంతో హిమాచల్‌ లో బీజేపీ సృష్టించిన రాజకీయ సంక్షోభానికి తెరపడినట్లయింది. కాగా అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేలందరూ హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం ఉదయం ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్‌ సింగ్‌ సుఖు తన అధికార నివాసంలో ఎమ్మెల్యేలతో అల్పాహార సమావేశం నిర్వహించారు. ‘ఇది కేవలం అందరం కలవడం కోసమే…సమావేశంలో ఏం జరుగుతుందనేది చూద్దాం’ అని సమావేశానికి ముందు షిమ్లా అర్బన్‌ ఎమ్మెల్యే హరిష్‌ జనార్థా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం స్థిరంగా ఉందని, పూర్తి కాలం కొనసాగుతుందని పలువురు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కాగా ఈ సమావేశం కొనసాగుతుండగానే ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినట్లు స్పీకర్‌ ప్రకటించడం గమనార్హం.
బీజేపీ విఫలయత్నం
హిమాచల్‌ప్రదేశ్‌లో మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్‌ మహాజన్‌కు అనుకూలంగా ఈ ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌ చేశారు. అనంతరం ఆ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌పై ఓటింగ్‌కు వీరు దూరంగా ఉన్నారు. క్రాస్‌ ఓటింగ్‌ నేపథ్యంలో కాంగ్రెస్‌పై అవిశ్వాస తీర్మానం చేపట్టాలని ఆ రాష్ట్ర గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లాను కలిసిన బీజేపీ నేతలు అసెంబ్లీలో బడ్జెట్‌ ఆమోదం పొందకుండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సభలో నినాదాలు చేసిన 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను పథానియా సస్పెండ్‌ చేశారు. అనంతరం వాయిస్‌ ఓటింగ్‌ ద్వారా ఆర్థిక బిల్లును సభ ఆమోదించింది. ఆ తర్వాత సభను స్పీకర్‌ నిరవధికంగా వాయిదా వేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ బలం 68 నుంచి 62కి తగ్గింది. మెజారిటీ సంఖ్య కూడా 35 నుంచి 32 తగ్గింది. ప్రస్తుతం 34 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో ఉన్నారు.
పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: కాంగ్రెస్‌
హిమాచల్‌ ప్రదేశ్‌లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నంలో బీజేపీ విఫలమైందని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు లొంగిపోయి క్రాస్‌ ఓటింగ్‌ పాల్పడటంతో సంఖ్యాబలం ఉన్నప్పటికీ ఏకైక రాజ్యసభ సీటును అధికార కాంగ్రెస్‌ కోల్పోవాల్సి వచ్చిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్‌) జైరామ్‌ రమేశ్‌ పేర్కొన్నారు. క్రాస్‌ ఓటింగ్‌ చేసిన ఆరుగురు ఎమ్మెల్యేలను స్పీకర్‌ అనర్హులుగా ప్రకటించారన్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే బీజేపీ ధనబలం, అధికార బలంతో ఆట ప్రారంభించిందని అన్నారు. అయితే హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆ పార్టీ చేసిన యత్నం విఫలమైందని తెలిపారు.

ఉల్లంఘించారని షిమ్లాలో ఏర్పాటు చేసిన

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img