Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఇండియాదే అధికారం

. నియంతృత్వ బీజేపీని ఓడిస్తాం
. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సాధిస్తాం
. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీపై ప్రజలే పోరాడుతున్నారు
. మతాల మధ్య చిచ్చుపెట్టే మోదీ ప్రజాజీవితం నుంచి వైదొలగాలి
. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే

న్యూదిల్లీ: కేంద్రంలో నియంతృత్వ బీజేపీ సర్కారు మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకుని తీరతామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీ మార్క్‌ అందుకోపోబోతోందని ఆయన ధీమా వెలిబుచ్చారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై ఖడ్గే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌, ఇండియా కూటమి పక్షాల పట్ల ప్రజల అభిప్రాయం గణనీయంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో ద్వేషం, విభజన వ్యాప్తి చేసే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి వ్యతిరేకంగా ప్రజలే పోరాడుతున్నారని తెలిపారు. ‘ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రజలు పోరాడుతున్నారు. అందుకే వారు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. రామాలయం, హిందూ-ముస్లిం విభజన, భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఘర్షణల పేరుతో బీజేపీ పదేపదే ప్రజలను ఎమోషనల్‌గా మోసం చేసింది. ఇప్పుడు ప్రజలు బీజేపీ అసలు రంగును అర్థం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రచారం తర్వాత మాకు అర్థమైంది. ఇండియా కూటమికి లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. కాంగ్రెస్‌, ఇండియా కూటమి పార్టీలకు ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు వస్తాయి. బీజేపీకి మెజారిటీ సీట్లు రాకుండా ఆపగలుగుతాం. బీజేపీ ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదు. విపక్ష కూటమి తరఫున ప్రజలు పోరాడుతున్నారు. బీజేపీ ఈ ఎన్నికల్లో వెనుకంజలో ఉంది. ఈ లోక్‌ సభ ఎన్నికలు చాలా కీలకమైనవి. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, దేశ పౌరుల ప్రాథమిక హక్కులు, వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సి ఉంది’’ అని మల్లికార్జున ఖడ్గే వ్యాఖ్యానించారు. హిందూ-ముస్లిం అని మాట్లాడితే తనకు ప్రజా జీవితంలో ఉండే హక్కు లేదని ఆయన వాదిస్తున్నారని… ఒకసారి హిందూ-ముస్లింలపై చేసిన ప్రసంగాల రికార్డును చూడాలన్నారు. మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రతిరోజూ తన వాక్చాతుర్యంతో హిందూ ముస్లింల మధ్య విద్వేషం నింపుతున్న ప్రధాని మోదీ ప్రజా జీవితం నుంచి వైదొలగాలని లేదా తప్పును అంగీకరించి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
ఈ ఎన్నికల్లో ఆ రెండే ప్రధాన అంశాలు
2024 లోక్‌ సభ ఎన్నికల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగం ప్రధాన అంశాలుగా మారాయని ఖడ్గే తెలిపారు. రెండు కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం వంటి హామీలను కూడా బీజేపీ నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. కేంద్రంలోని ఎన్‌?డీఏ సర్కార్‌ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు ప్రజలు బీజేపీ ఉద్దేశాలను అర్థం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లు, రాజ్యాంగం అనే రెండు ప్రధాన అంశాలు కేంద్రంగా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ‘‘రాజ్యాంగాన్ని మార్చాలంటే మూడిరట రెండు వంతుల మెజారిటీ కావాలి. 400 సీట్లు గెలిపించాలని బీజేపీ పదేపదే చెబుతోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా రిజర్వేషన్‌ గురించి మాట్లాడారు. రాజ్యాంగంలో ఉన్న వాటిని వారు తీసేయలేరు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంది. పలు పదవుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యక్తులను నియమించాలనుకుంటుంది. మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ, మణిపుర్‌, ఉత్తరాఖండ్‌, గోవాలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ ఇబ్బంది పెట్టింది. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూడా అంగీకరించదు. అందుకే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం. ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కులను కాపాడుతుంది. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తోంది. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తోంది. అందుకే ఈ ఎన్నికలు ప్రజలకు చాలా ముఖ్యమైనవి’’ అన్నారు. ఎన్నికల సమయంలో విపక్ష నేతలను బీజేపీ బెదిరిస్తోందని, అలాగే వేధింపులకు గురిచేస్తోందని ఖడ్గే మండిపడ్డారు. ప్రచారం కూడా చేసుకోనివ్వకుండా కటకటాలపాలజేస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచివి కావని హెచ్చరించారు. దేశంలో నిరంకుశ పాలన అమలవుతోందని అన్నారు. 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో తాము ప్రతి రాష్ట్రంలో బాగా మెరుగుపడినట్లు ఖడ్గే తెలిపారు. బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకొంటామన్న విశ్వాసం ఉందన్నారు. ప్రభుత్వంతో పోరాడేందుకు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని.. తాము వారికి సాయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక బీహార్‌లో కాంగ్రెస్‌-ఆర్జేడీ కలిసి బీజేపీ భావజాలంపై పోరాడుతున్నాయని వెల్లడిరచారు. దళిత, వెనుకబడిన వర్గాలు బలంగా తమ కూటమికి మద్దతు పలుకుతున్నాయన్నారు. ఇక యూపీలో 2019లో ఎస్పీ, కాంగ్రెస్‌ వేర్వేరుగా పోటీచేయడంతో నాడు బలహీనపడినట్లు అంచనావేశారని… ఈ సారి రెండు పార్టీల నేతలు కలిసి ప్రచారం చేయడం కూడా కూటమికి కలిసొచ్చే అంశమన్నారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గతం కంటే ఎక్కువ సీట్లను సాధిస్తోందన్నారు. మహారాష్ట్రలో విపక్ష కూటమి అధికసంఖ్యలో స్థానాలను సాధిస్తుందన్నారు. గతంలో యూపీఏ అధికారంలో ఉన్న రెండు విడతల్లో కాంగ్రెస్‌కు 140, 206 స్థానాలే వచ్చాయని ఖడ్గే గుర్తు చేశారు. అప్పుడు కూడా ఉపాధి హామీ, ఆర్టీఐ, ఆర్టీఈ, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ, ఇండో-యూఎస్‌ న్యూక్లియర్‌ డీల్‌ వంటి మంచి పనులు చేశామన్నారు. బీజేపీని ఓడిరచాలనే లక్ష్య సాధనలో భాగంగానే వేర్వేరు రాష్ట్రాల్లో విభిన్నమైన వ్యూహాలను అనుసరించినట్లు ఖడ్గే తెలిపారు. కేరళలో ఎవరు గెలిచినా బీజేపీని వ్యతిరేకిస్తారన్నారు. అలానే దిల్లీ, హర్యానా, గుజరాత్‌లలో ఆప్‌ అలానే పనిచేస్తుందని వివరించారు. కేవలం పంజాబ్‌లో కాంగ్రెస్‌, ఆప్‌ మాత్రమే ప్రధాన పార్టీలు కావడంతో వేర్వేరుగా పోటీ చేస్తున్నట్లు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img