Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఇకపై రాజకీయ పాలన

. పార్టీ శ్రేణులకు పూర్తి ప్రాధాన్యతిచ్చి మార్పు చూపిస్తా
. బిజీగా ఉన్నా సమయం కేటాయిస్తా
. మీరు బాధ్యతగా ప్రజలకు సేవ చేయండి
. ఎంపీలతో టీడీపీ అధినేత చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : గతంలో వలే కాకుండా ఈసారి రాజకీయ పాలన ఉంటుందని ఎంపీలకు టీడీపీ అధినేత చంద్ర బాబు స్పష్టం చేశారు. ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు. బ్యూరోక్రాట్స్‌ పాలన ఎంత మాత్రం ఉండదు. చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది. ఇక అలా ఉండదు. మీరే ప్రత్యక్షంగా చూస్తారు. ఎంపీలందరూ తరచూ వచ్చి కలవండి. నేను బిజీగా ఉన్నా కూడా మీతో మాట్లాడుతా. నాకోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారు. నిద్రలేని రాత్రులు గడిపారు. కత్తి మెడ మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదు. పార్టీ శ్రేణుల త్యాగాలను మరిచిపోలేను. వారికి ఇకపై పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాను. ఈ ఐదేళ్లు కార్యకర్తలు పడిన ఇబ్బందులు మనోవేదన కలిగించాయి. నేతలు, కార్యకర్తల కృషి వల్లే పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతి అంశాన్ని నేనే వింటా. నేనే చూస్తానంటూ చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత చంద్రబాబు గురువారం సమావేశమయ్యారు. అందుబాటులో లేని ఎంపీలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్రంలో మంత్రివర్గ కూర్పు, టీడీపీకి ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు. చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో విహరించొద్దని గెలిచిన ఎంపీలకు స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కలిసి ఎవరి పరిధిలో వారు పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని వైసీపీ ఎంపీలు, జగన్‌ కేసుల మాఫీ అజెండాతోనే దిల్లీలో పైరవీలు చేశారన్నారు. కానీ మన కర్తవ్యం వేరు అని ఎంపీలకు చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలని సూచించారు. అందుకు తగ్గట్లుగానే పార్లమెంట్‌లో కృషి చేయాలన్నారు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలని, ఆ తరువాతే మనం అని చంద్రబాబు అన్నారు. వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని, పదవులు శాశ్వతమని ఎవరూ అనుకోవద్దని చెప్పారు. ఈ నెల 12వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని, ఈసారి ఎన్నికైన ఎంపీల టీమ్‌ చాలా బాగుందన్నారు. గతంలో ఎర్రంనాయుడు ఉన్నప్పుడు ఇటువంటి టీమ్‌ ఉంది. ఈ టీమ్‌ దిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం బాగా పని చేస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించామని, ఆయన వచ్చేందుకు సానుకూలంగా స్పందించారని చంద్రబాబు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img