Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎంత మంది పిల్లలున్నా…

తల్లికి వందనంపై మంత్రి లోకేశ్‌
ఎప్పటి నుంచి అమలు అనే దానిపై అస్పష్టత

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన తల్లికి వందనం పథకం ఈ విద్యా సంవత్సరం నుంచా?, వచ్చే విద్యా సంవత్సరం నుంచా? అనే దానిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ పథకాన్ని అమలు చేసి తీరుతామని, ఎంత మంది పిల్లలు ఉంటే, వారందరికీ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటుకూ వర్తింపజేస్తామని తెలిపారు. తల్లికి వందనం పథకంపై మార్గదర్శకాలను త్వరలో రూపొందిస్తామని, ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఒక ఇంట్లో ఎంత మంది ఎంత మంది పిల్లలు ఉంటే… వారందరికీ పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు. శాసన మండలిలో బుధవారం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌ రెడ్డి, కేఎస్‌ లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు తదితరులు తల్లికి వందన పథకం అమలుపై ఉన్న అనుమానాలు తొలగించాలని కోరారు.
రామ్‌గోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ తల్లికి వందనంపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన రీతిలో తల్లికి వందనంపైన స్పష్టత ఇవ్వాలని, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు ఇస్తారా?, లేదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి కింద ఒక పిల్ల వాడికే రూ.15 వేలు ప్రకటించినప్పటికీ కేవలం తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు మాత్రమే పడ్డాయని, మిగిలిన మొత్తం వాచ్‌మేన్‌, నిర్వహణకు కేటాయించారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో భాగంగా బడికి వెళ్లే పిల్లలు అందరికీ ఇస్తామన్నారని, పాత పథకంలోని లోపాలను అధ్యయనం చేసి, తల్లికి వందనం అమలు చేయాలని కోరారు. ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తల్లికి వందనం పథకంతో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం ఉండేలా చూడాలన్నారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి లోకేశ్‌ బదులిస్తూ, ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోల్లో తల్లికి వందన పథకాన్ని ఎంత మంది పిల్లలు ఉంటే… వారందరికీ ఇస్తామని హామీ ఇచ్చామని, ఆ హామీకి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. గతంలో చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
గత అమ్మఒడి పథకంలో ఈ పథకానికి అర్హతలను మార్చి వేశారని ఆరోపించారు. తన పాదయాత్రలో ద్విచక్ర వాహనాలు ఉన్న వారికి సైతం తెల్లకార్డులు రద్దయినట్లు తెలిపారని, వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని, తల్లికి వందనం పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలకు ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. నాడు`నేడు, అమ్మఒడి, సీబీఎస్‌ఈ, ఐబీ లాంటి పథకాలను తీసుకువస్తే… ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు పిల్లలు తగ్గారో సమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా రంగంపై ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img